Saturday, May 30, 2026 08:31 PM
Saturday, May 30, 2026 08:31 PM

టయోటా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ.. సింగిల్ ఛార్జ్‌పై 543 కిమీ రేంజ్..!

భారత ఆటోమొబైల్ మార్కెట్లోకి ప్రముఖ కార్ల తయారీ సంస్థ టయోటా కిర్లోస్కర్ మోటార్ తన మొట్టమొదటి ఆల్ ఎలక్ట్రిక్ కారును అధికారికంగా విడుదల చేసింది. టయోటా అర్బన్ క్రూయిజర్ ఎబెల్లా పేరుతో తీసుకొచ్చిన ఈ సరికొత్త మిడ్ సైజ్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ టాప్ స్పెక్ ఈ3 వేరియంట్ ప్రారంభ ధరను రూ. 23.60 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా కంపెనీ నిర్ణయించింది. మారుతి సుజుకి అప్ కమింగ్ ఈ-విటారా ప్లాట్‌ ఫారమ్‌ పైనే ఈ సరికొత్త ఈవీని కూడా డిజైన్ చేశారు. భారత మార్కెట్లో ఇది హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్, ఎంజీ జెడ్ఎస్ ఈవీ, టాటా కర్వ్ ఈవీ వంటి మోడళ్లకు గట్టి పోటీ ఇవ్వనుంది.

Also Read : ఇరాన్ రూట్ బంద్.. భారత్ మాత్రం సేఫ్, కేంద్రం సీక్రెట్ వ్యూహం ఇదే..!

లుక్స్ పరంగా ఈ కారు టయోటా గ్లోబల్ డిజైన్ ఎలిమెంట్స్‌ తో ఎంతో అట్రాక్టివ్‌ గా కనిపిస్తుంది. మస్కులర్ అప్పీల్ ఇచ్చేలా చెక్కినట్లున్న బోనెట్, సైడ్ క్యారెక్టర్ లైన్స్, మరియు గాలి రాపిడిని తట్టుకునేలా ఏరోడైనమిక్ డిజైన్‌ తో కూడిన అల్లాయ్ వీల్స్ దీని సొంతం. ఈ కారు పొడవు 4,285 మిమీ, వెడల్పు 1,800 మిమీ మరియు 2700 మిమీ భారీ వీల్‌ బేస్‌ తో వస్తోంది. కేఫ్ వైట్, బ్లూయిష్ బ్లాక్, గేమింగ్ గ్రే, స్పోర్టిన్ రెడ్, ఎంటైసింగ్ సిల్వర్ వంటి మోనో టోన్ రంగులతో పాటు, బ్లాక్ రూఫ్ కాంబినేషన్‌ తో వచ్చే డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్లలో కూడా ఇది లభిస్తుంది.

కారు లోపలి భాగం.. బ్లాక్ అండ్ బ్రౌన్ షేడ్స్ డ్యూయల్ టోన్ థీమ్‌ తో చాలా లగ్జరీగా ఉంది. మోడరన్ ఈవీ ఫీచర్లయిన పనోరమిక్ సన్‌ రూఫ్, 10.1 ఇంచుల భారీ ఇన్ఫోటైన్మెంట్ డిస్‌ ప్లే, వెంటిలేటెడ్ సీట్లు, వైర్‌ లెస్ ఛార్జింగ్ ప్యాడ్, జేబీఎల్ సౌండ్ సిస్టమ్, అంబియంట్ లైటింగ్, ఎయిర్ ప్యూరిఫైయర్, డయల్ టైప్ గేర్ షిఫ్ట్ నాబ్ వంటి మరెన్నో ప్రీమియం సదుపాయాలను ఇందులో పొందుపరిచారు. భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ ఈ కారులో ఏకంగా 7 ఎయిర్‌ బ్యాగ్‌ లు, 360-డిగ్రీల కెమెరా, అడ్వాన్స్‌డ్ లెవెల్-2 ఏడీఏఎస్ సేఫ్టీ ఫీచర్లను అందించారు.

Also Read : పెద్దికి షాక్ ఇచ్చిన తెలంగాణా హైకోర్ట్..!

రేంజ్ అర్బన్ క్రూయిజర్ ఎబెల్లా టాప్ వేరియంట్ లో పవర్‌ఫుల్ 61 కెవి బ్యాటరీ ప్యాక్ ను అమర్చారు. ఇది 171 హెచ్ పీ పవర్‌ ను, 193 ఎన్ఎం గరిష్ట టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది. పర్ఫామెన్స్ పరంగా ఎక్కడా తగ్గని ఈ ఎలక్ట్రిక్ కారు, సింగిల్ ఫుల్ ఛార్జ్‌ పై ఏకంగా 543 కిలోమీటర్ల మైలేజ్/రేంజ్ ఇస్తుందని టయోటా సంస్థ అధికారికంగా క్లెయిమ్ చేస్తోంది. ఇండియన్ మార్కెట్లో నమ్మకమైన బ్రాండ్ ఇమేజ్ ఉన్న టయోటా నుండి వచ్చిన ఈ మొదటి ఎలక్ట్రిక్ కార్.. ఈవీ ప్రియులను భారీగా ఆకట్టుకునే అవకాశం కనిపిస్తోంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

కూటమికి దూరంగా టీ...

ప్రొఫెసర్ నాగేశ్వర్.. నిజానికి ఇది ఒక...

తెలంగాణపై జనసేనాని గురి.....

గత కొన్నాళ్ళుగా తెలంగాణ రాజకీయాలపై జనసేన...

ఏపీ ఇసుక స్కామ్‌...

ఏపీలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో...

గోదావరి జిల్లాల్లో మళ్లీ...

పోలవరం జిల్లా పరిధిలో పెద్దపులి సంచారం...

బొల్లా బ్రహ్మనాయుడు పరార్.....

సైబరాబాద్ పరిధిలో సంచలనం సృష్టించిన ఒక...

కుల పిచ్చి దాటడమే...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేన అధినేత, డిప్యూటీ...

పోల్స్