Sunday, September 13, 2026 10:59 PM
Sunday, September 13, 2026 10:59 PM

ఎన్టీఆర్–త్రివిక్రమ్ మూవీలో బాలీవుడ్ బ్యూటీకి లైన్ క్లియర్..?

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌ లో తెరకెక్కనున్న భారీ పాన్ ఇండియా ప్రాజెక్టుపై అంచనాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఇటీవలే చిత్రబృందం అధికారికంగా “శివుడి కుమారుడు.. పార్వతీదేవికి గర్వకారణం.. దేవసేనాని” అనే ఆసక్తికరమైన క్యాప్షన్‌ తో ఫస్ట్ లుక్ పోస్టర్‌ ను విడుదల చేయగా, సినీ వర్గాల్లో దీనిపై పెద్ద చర్చ మొదలైంది. తాజాగా ఈ సినిమా హీరోయిన్ ఎంపికకు సంబంధించి సోషల్ మీడియాలో ఒక క్రేజీ రూమర్ వైరల్ అవుతోంది.

Also Read : పాపం దాయది.. పేదరికం కోరల్లో పాకిస్తాన్..!

ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో హీరోయిన్‌గా బాలీవుడ్ స్టార్ బ్యూటీ కియారా అద్వానీ నటించే అవకాశాలు ఉన్నట్లు టాలీవుడ్ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. ఇప్పటికే చిత్రబృందం ఆమెతో కథా చర్చలు కూడా జరిపినట్లు ప్రచారం సాగుతోంది. ఒకవేళ ఈ టాక్స్ సక్సెస్ అయితే, ఎన్టీఆర్ మరియు కియారా అద్వానీ ఒకే స్క్రీన్‌ పై జోడీగా కనిపించడం ఇదే తొలిసారి అవుతుంది. కియారాకు ఇప్పటికే తెలుగులో మంచి క్రేజ్ ఉండటంతో ఈ వార్తపై నెటిజన్ల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాల్లో హీరోయిన్ పాత్రలకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది.

Also Read : లొంగే ప్రసక్తే లేదు.. ఇరాన్ ప్రెసిడెంట్ సంచలన ప్రకటన..!

అందువల్ల కియారా ఓకే చెబితే ఆమె కోసం ఒక పవర్‌ ఫుల్ రోల్‌ ను డిజైన్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే, ఈ ప్రాజెక్టుకు గాడ్ ఆఫ్ వార్ అనే టైటిల్‌ ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఫస్ట్ లుక్‌ లో హింట్ ఇచ్చిన దేవసేనాని కాన్సెప్ట్‌ కు ఈ టైటిల్ పక్కాగా సరిపోతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. యాక్షన్, ఎమోషన్, పురాణ నేపథ్యం మరియు విజువల్ వండర్‌ గా తెరకెక్కనున్న ఈ చిత్రం.. దర్శకుడు త్రివిక్రమ్ కెరీర్‌ లోనే అత్యంత భారీ బడ్జెట్‌ తో రూపొందనుందని టాక్. అయితే టైటిల్, కథ మరియు హీరోయిన్ ఎంపికపై చిత్రయూనిట్ నుండి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఏదేమైనా ఈ కాంబినేషన్ అనౌన్స్‌మెంట్‌ తోనే పాన్ ఇండియా లెవెల్‌ లో సంచలనం సృష్టిస్తోంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

కూటమిలో సీట్ల పంచాయతీ.....

ఆలు లేదు.. సూలు లేదు.. కొడుకు...

ఏపీ అభ్యర్థులకు అలర్ట్.....

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా...

రమా నందనాను వెంటాడుతున్న...

లండన్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికి...

నల్లమల సాగర్‌లో కృష్ణమ్మ...

శ్రీశైలం నుంచి కృష్ణా జలాలు పరవళ్లు...

వల్లభనేని ఆస్తుల గుట్టు...

మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని...

DSC స్పోర్ట్స్‌ కోటా...

కష్టపడి పతకాలు సాధించి, అన్ని అర్హతలతో...

పోల్స్