Wednesday, October 14, 2026 01:34 AM
Wednesday, October 14, 2026 01:34 AM

లివర్ ఆరోగ్యానికి కాఫీ అమృతమా..?

మనం ఉదయాన్నే నిద్రలేవగానే మైండ్ యాక్టివ్‌గా మారడానికి తాగే కాఫీ.. కేవలం మనల్ని నిద్రమత్తు వదిలించడమే కాకుండా మన కాలేయానికి ఒక రక్షణ కవచంలా పనిచేస్తుందని ప్రముఖ వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. సుప్రసిద్ధ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ సౌరభ్ సేథి దాదాపు పది వేలకు పైగా లివర్ స్కాన్‌లను పరిశీలించిన తర్వాత కాఫీ వల్ల కాలేయానికి చేకూరే అద్భుతమైన ప్రయోజనాలను సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకున్నారు. అందువల్లనే తాను ప్రతిరోజూ ఉదయం కాఫీ తాగుతానని ఆయన వివరించారు.

పరిశోధనల ప్రకారం.. కాఫీ క్రమం తప్పకుండా తాగే వారిలో కాలేయ వ్యాధుల వల్ల వచ్చే మరణాల ముప్పు దాదాపు నలభై తొమ్మిది శాతం తక్కువగా ఉన్నట్లు తేలింది. అలాగే ప్రతిరోజూ అదనంగా రెండు కప్పుల కాఫీ తాగడం వల్ల కాలేయం దెబ్బతినే ‘సిర్రోసిస్’ ముప్పు 40 శాతం తగ్గుతుందని 4 లక్షల 32 వేల మందిపై జరిపిన మెగా అధ్యయనంలో వెల్లడైంది. అంతేకాకుండా, ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రమాదకరంగా మారుతున్న లివర్ క్యాన్సర్ వచ్చే అవకాశాలను కూడా కాఫీ దాదాపు 35 శాతం వరకు తగ్గిస్తుందని 22 లక్షల మందిపై జరిపిన పరిశోధనల విశ్లేషణలో రుజువైంది.

అయితే ఈ అద్భుత ప్రయోజనాలు కేవలం కాఫీలోని కెఫిన్ వల్ల మాత్రమే కాదని.. కెఫిన్ లేని డికాఫ్ కాఫీ తాగినా కూడా కాలేయానికి సమానమైన ప్రయోజనాలు అందుతాయని డాక్టర్ సేథి స్పష్టం చేశారు. కాలేయ ఆరోగ్యం బాగుండాలంటే రోజుకు మూడు నుండి నాలుగు కప్పుల కాఫీ సరైన పరిమాణంగా అధ్యయనాలు చెబుతున్నప్పటికీ, ప్రతి ఒక్కరి శరీర తత్వాన్ని బట్టి ఈ పరిమాణం మారవచ్చని ఆయన తెలిపారు. అయితే కాఫీ తాగేటప్పుడు అందులో మితిమీరిన చక్కెర లేదా క్రీమ్ వంటివి కలపడం వల్ల కాఫీలోని అసలైన పోషక విలువలు దెబ్బతింటాయని, కాబట్టి వాటిని తక్కువగా వాడుతూ కాలేయ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

వైసీపీని తుడిచేస్తున్న చిన్న...

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీకి...

తెలంగాణ బీజేపీలో కాక్రోచ్...

ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్...

విశాఖ మేయర్ రిజర్వేషన్...

బీజేపీ నేతల ఒత్తిళ్లతోనే విశాఖపట్నం నగర...

జగన్ ను భయపెడుతోన్న...

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల వేడి...

ఏపీ జడ్పీ ఛైర్మన్...

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు...

మంగళగిరి మేయర్‌ పీఠం...

మంగళగిరి–తాడేపల్లి మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌ పదవి...

పోల్స్