Tuesday, October 13, 2026 02:32 PM
Tuesday, October 13, 2026 02:32 PM

ఏపీ జడ్పీ ఛైర్మన్ రిజర్వేషన్లు ఇవేనా..?

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి కసరత్తు వేగవంతమైంది. ఇప్పటికే మున్సిపల్ చైర్‌పర్సన్లు, మేయర్ల రిజర్వేషన్లను ప్రభుత్వం అధికారికంగా ఖరారు చేయగా, తాజాగా జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్‌ స్థానాల రిజర్వేషన్లకు సంబంధించిన ప్రాథమిక వివరాలు బయటకు వచ్చాయి. పంచాయతీరాజ్ అధికారులు జిల్లాల వారీగా రిజర్వేషన్లను ఖరారు చేసే పనిలో నిమగ్నమవగా, సోషల్ మీడియా వేదికగా ప్రాథమిక రిజర్వేషన్ల జాబితా ఒకటి తెగ హల్ చల్ చేస్తోంది.

Also Read : ఏపీలో మున్సిపల్ సమరానికి సై.. రేపే షెడ్యూల్ విడుదల..?

రాష్ట్రంలోని మొత్తం జడ్పీ పీఠాలకు సంబంధించిన కేటాయింపులు ఈ విధంగా ఉన్నాయి. గిరిజన ప్రాంతాలైన పార్వతీపురం మన్యంను ఎస్టీ జనరల్‌కు కేటాయించగా.. అల్లూరి సీతారామరాజు, పోలవరం స్థానాలను ఎస్టీ మహిళకు కేటాయించినట్లు తెలుస్తోంది. ఇక షెడ్యూల్డ్ కులాల కోటా కింద బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, ఎన్టీఆర్, ప్రకాశం జిల్లాలను ఎస్సీ జనరల్‌గా.. గుంటూరు, తిరుపతి జిల్లాలను ఎస్సీ మహిళా కేటగిరీ కింద ప్రాథమికంగా నిర్ధారించారు. వెనుకబడిన తరగతుల రిజర్వేషన్ల విషయానికి వస్తే.. అనంతపురం, కర్నూలు, విశాఖపట్నం జిల్లాలను బీసీ జనరల్‌కు కేటాయించగా, అనకాపల్లి, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల జడ్పీ పీఠాలను బీసీ మహిళలకు కేటాయించినట్లు ఈ ప్రాథమిక జాబితా ద్వారా స్పష్టమవుతోంది.

Also Read : కూటమిలో సీట్ల పంచాయతీ..!

అదేవిధంగా బాపట్ల, చిత్తూరు, తూర్పు గోదావరి, ఏలూరు, కాకినాడ, కృష్ణా, పల్నాడు జిల్లాలను జనరల్ మహిళా కేటగిరీ కింద రిజర్వ్ చేసినట్లు సమాచారం. మరోవైపు అన్నమయ్య, మార్కాపురం, నంద్యాల, పొట్టి శ్రీరాములు నెల్లూరు, సత్యసాయి, పశ్చిమ గోదావరి, వైఎస్సార్ కడప జిల్లాల జడ్పీ స్థానాలు ఎలాంటి రిజర్వేషన్లు లేని అన్ రిజర్వ్‌డ్ అంటే జనరల్ కేటగిరీ కిందకు రానున్నాయి. అయితే, ప్రస్తుతం ప్రచారంలో ఉన్న ఈ జాబితా కేవలం ప్రాథమిక అంచనా మాత్రమేనని, ప్రభుత్వం నుంచి త్వరలోనే వెలువడే తుది అధికారిక గెజిట్ ప్రకటనలో మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

జగన్ ను భయపెడుతోన్న...

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల వేడి...

మంగళగిరి మేయర్‌ పీఠం...

మంగళగిరి–తాడేపల్లి మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌ పదవి...

ఈడీ టార్గెట్ జగన్.....

వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ...

ఏపీలో మున్సిపల్ సమరానికి...

ఆంధ్రప్రదేశ్‌లో సుదీర్ఘ కాలంగా ఎదురుచూస్తున్న స్థానిక...

కూటమిలో సీట్ల పంచాయతీ..!

స్థానిక సమరానికి తెరలేసింది. కూటమిలో సీట్లు...

బాంబు పేల్చిన రాహుల్.....

దేశ రాజధాని వేదికగా సాగుతున్న ఓటర్ల...

పోల్స్