Tuesday, October 13, 2026 03:36 PM
Tuesday, October 13, 2026 03:36 PM

జగన్ ను భయపెడుతోన్న సొంత జిల్లా..!

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల వేడి పీక్స్‌కు చేరింది. మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో ఎలాగైనా జెండా పాతాలని అధికార కూటమి వ్యూహాలు రచిస్తుండగా.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆత్మరక్షణలో పడినట్లు పొలిటికల్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ముఖ్యంగా మేయర్ స్థానాల్లో పోటీ చేసేందుకు వైసీపీ తరఫున అభ్యర్థులు పెద్దగా ధైర్యం చూపించడం లేదనే టాక్ బలంగా వినిపిస్తోంది. మిగిలిన నియోజకవర్గాల సంగతి ఎలా ఉన్నా.. వైఎస్సార్ జిల్లాలోని పులివెందుల, కడప స్థానాలు ఇప్పుడు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి పెద్ద తలనొప్పిగా మారాయని తెలుస్తోంది.

Also Read : కూటమిలో సీట్ల పంచాయతీ..!

ఎలాగైనా వైఎస్సార్ జిల్లాలో జగన్ మోహన్ రెడ్డి పట్టును పూర్తిగా దెబ్బతీయాలని, కడప, పులివెందుల స్థానాల్లో వైసీపీని ఓడించడమే లక్ష్యంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తోంది. అధికార బలం, మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో.. బలమైన ప్రత్యర్థులను ఎదుర్కొని నిలబడే అభ్యర్థులు దొరకడం వైసీపీకి గగనంగా మారింది. ఓటమి భయం, తదుపరి పరిణామాల నేపథ్యంలో మేయర్ రేసులో నిలబడటానికి కీలక నేతలు సైతం వెనకడుగు వేస్తున్నట్లు సమాచారం.

Also Read : ఏపీలో మున్సిపల్ సమరానికి సై.. రేపే షెడ్యూల్ విడుదల..?

సొంత గడ్డపైనే పార్టీ ఉనికికి సవాల్ ఎదురవుతుండటంతో జగన్ మోహన్ రెడ్డి ఈ విషయాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇతర ప్రాంతాల కంటే కడప, పులివెందులపైనే ఆయన ప్రత్యేకంగా దృష్టి సారించి, గెలుపు గుర్రాలను అన్వేషించే పనిలో పడ్డారు. స్థానిక నేతలతో వరుస సమీక్షలు జరుపుతూ.. అభ్యర్థులకు అవసరమైన భరోసా కల్పించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. కూటమి వ్యూహాలను తిప్పికొట్టి తన కోటను జగన్ కాపాడుకుంటారా, లేక కూటమి అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తుందా అనేది ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

విశాఖ మేయర్ రిజర్వేషన్...

బీజేపీ నేతల ఒత్తిళ్లతోనే విశాఖపట్నం నగర...

ఏపీ జడ్పీ ఛైర్మన్...

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు...

మంగళగిరి మేయర్‌ పీఠం...

మంగళగిరి–తాడేపల్లి మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌ పదవి...

ఈడీ టార్గెట్ జగన్.....

వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ...

ఏపీలో మున్సిపల్ సమరానికి...

ఆంధ్రప్రదేశ్‌లో సుదీర్ఘ కాలంగా ఎదురుచూస్తున్న స్థానిక...

కూటమిలో సీట్ల పంచాయతీ..!

స్థానిక సమరానికి తెరలేసింది. కూటమిలో సీట్లు...

పోల్స్