Tuesday, October 13, 2026 07:15 PM
Tuesday, October 13, 2026 07:15 PM

వైసీపీని తుడిచేస్తున్న చిన్న శ్రీను.. ఉత్తరాంధ్రలో భారీ దెబ్బ..!

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. ఎవరూ ఊహించని విధంగా ఉత్తరాంధ్రలో వైసీపీ నుంచి టిడిపి లోకి వలసల జోరు పెరిగింది. విజయనగరం జిల్లాలో వైసీపీకి చెందిన సుమారు 3,500 మంది నాయకులు మరియు కార్యకర్తలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పి తెలుగుదేశం పార్టీలో చేరారు. చీపురుపల్లి, గరివిడి, మెరకముడిదాం మండలాలకు చెందిన పలువురు మాజీ జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులుతో పాటు కింది స్థాయి కేడర్ అంతా అధికారికంగా టీడీపీ కండువా కప్పుకున్నారు.

Also Read : రాహుల్ పక్కన నిలిచిన ఆ యువతి ఎవరు..?

ఉమ్మడి విజయనగరం జిల్లాలో రాజకీయంగా ఎంతో ప్రభావం ఉన్న మజ్జి శ్రీనివాసరావు, సీనియర్ నాయకులు కళా వెంకట్రావు ఆధ్వర్యంలో ఈ భారీ చేరికల కార్యక్రమం ఘనంగా జరిగింది. ఇటీవల కాలంలో మజ్జి శ్రీనివాసరావు వైసీపీని వీడి టీడీపీలో చేరిన తర్వాత, ఉత్తరాంధ్ర వ్యాప్తంగా ఆ పార్టీకి వ్యతిరేకంగా వలసల జోరు మరింత ఊపందుకుంది. తాజాగా జరిగిన ఈ భారీ చేరికలతో విజయనగరం జిల్లాలో వైసీపీ బలం పూర్తిగా క్షీణించిందనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది.

Also Read : జగన్ ను భయపెడుతోన్న సొంత జిల్లా..!

స్థానిక సంస్థల ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో ఒకేసారి వేల సంఖ్యలో నాయకులు పార్టీ మారడం వైఎస్సార్‌సీపీ అధిష్టానాన్ని కలవరపెడుతోంది. ఉత్తరాంధ్రలో తమ కంచుకోటను కాపాడుకునేందుకు నానా తంటాలు పడుతున్న ఆ పార్టీకి, ఈ వలసలు అతిపెద్ద రాజకీయ సవాల్‌గా మారాయి. టీడీపీ నేతల వ్యూహాత్మక పావులతో రాబోయే రోజుల్లో ఆ జిల్లాలో వైసీపీ మరింత బలహీనపడే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

తెలంగాణ బీజేపీలో కాక్రోచ్...

ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్...

విశాఖ మేయర్ రిజర్వేషన్...

బీజేపీ నేతల ఒత్తిళ్లతోనే విశాఖపట్నం నగర...

జగన్ ను భయపెడుతోన్న...

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల వేడి...

ఏపీ జడ్పీ ఛైర్మన్...

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు...

మంగళగిరి మేయర్‌ పీఠం...

మంగళగిరి–తాడేపల్లి మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌ పదవి...

ఈడీ టార్గెట్ జగన్.....

వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ...

పోల్స్