Tuesday, October 13, 2026 06:49 PM
Tuesday, October 13, 2026 06:49 PM

వంశీ.. నువ్వు ఎవరి తాలుకానో తెలుసా..!

వల్లభనేని వంశీమోహన్.. ఈ పేరు పెద్దగా పరిచయం అవసరం లేదు. తెలుగు రాష్ట్రాల్లో బాగా ఫేమస్. 2009 ఎన్నికల్లోనే గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసేందుకు చాలా ప్రయత్నాలు చేశారు. చివరికి జూనియర్ ఎన్‌టీఆర్‌తో కూడా బలంగానే రికమండేషన్ చేయించుకున్నాడు. కానీ చంద్రబాబు మాత్రం.. ఆయనకు విజయవాడ పార్లమెంట్ టికెట్ ఇచ్చారు. లగడపాటి రాజగోపాల్‌తో పోటీ పడలేక వంశీ ఓడిపోయారు. ఆ తర్వాత 2014లో గన్నవరం నుంచి పోటీ చేసిన ఎమ్మెల్యే అయ్యారు. 2019లో మళ్లీ రెండోసారి కూడా గన్నవరం ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే సరిగ్గా ఆరు నెలలకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలియజేయడంతో వంశీ హాట్ టాపిక్ అయ్యారు.

Also Read : జగన్ ను భయపెడుతోన్న సొంత జిల్లా..!

2019 ఎన్నికల్లో గెలిచే వరకు చంద్రబాబు దేవుడు, లోకేష్ రియల్ హీరో అని చెప్పిన నోటీతోనే వైసీపీలో చేరిన తర్వాత ఆ ఇద్దరినీ అనకూడని మాటలు అన్నారు. రాయలేని భాషలో రెచ్చిపోయారు. చివరికి చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరిపై కూడా నోరు జారారు. తర్వాత క్షమాపణలు చెప్పినప్పటికీ.. తెలుగు తమ్ముళ్లు మాత్రం కసితో రగిలిపోయారు. ఎన్నికలకు ముందు టీడీపీ నేతలు, కార్యకర్తలు ఎంతో ఇబ్బంది పెట్టారు వంశీ. ఇవన్నీ గుర్తు పెట్టుకున్న కార్యకర్తలు.. ఎన్నికల్లో వంశీ సీటు చించేశారు. ఇంకా చెప్పాలంటే.. కౌంటింగ్ మొదలైన రెండో రౌండ్‌లోనే కేంద్రం నుంచి వంశీ వెళ్లిపోయాడంటే.. ఆయన పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నేతల్లో వంశీ అంత దారుణ పరిస్థితి మరెవ్వరికీ రాలేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అప్పటి వరకు నల్లటి నిగనిగలాడే జుట్టుతో ఫుల్ గ్లామర్‌గా కనిపించిన వంశీ నిజస్వరూపం బయటపడింది. తెల్ల జుట్టు, మాసిన గడ్డం, దగ్గు, ఒంటి నిండా రోగాలు.. కంటి నిండా నిద్ర కూడా పోలేని దయనీయ పరిస్థితి.. బక్కచిక్కిన శరీరం.. చివరికి చిరకాల మిత్రుడు పేర్ని నాని కూడా గుర్తుపట్టలేని దుస్థితి. నలుగురి మధ్యలో నిలుచుంటే.. వంశీ ఏడి.. అని పేర్ని పక్కనున్న వాళ్లను అడిగి వీడియో సోషల్ మీడియాలో బాగా ట్రోల్ అయ్యింది. ఇలాంటి వంశీ ఇప్పుడు బెయిల్ మీద బయట ఉన్నాడు. కోర్టు వాయిదాలకు వెళ్తున్నాడు.

దాదాపు రెండేళ్ల పాటు నోటికి తాళం వేసుకున్న వల్లభనేని వంశీ.. ఇటీవల గన్నవరం నియోజకవర్గంలో అప్పుడప్పుడు కనిపిస్తున్నాడు. ఇలా కనిపించినప్పుడు నాలుగు పంచ్ డైలాగులు వేసి వెళ్లిపోతున్నాడు. తాజాగా ఓ మీటింగ్‌లో పాల్గొన్న వంశీ.. “నేను ఎవరి తాలుకానో తెలుసా.. నన్ను లోపలేసినోడినే లోపలేసినోడి తాలుకా.. ఆయనెవరో తెలుసుగా.. గుర్తు పెట్టుకోండి.. ఆయనున్నాడు.. ఆయన తేలుస్తాడు.. మీ లెక్క మొత్తం.. తేలుస్తాడు..” అంటూ డైలాగ్ చెప్పారు. దీంతో అక్కడే ఉన్న వైసీపీ నేతలు, అభిమానులు ఈలలతో గోల చేశారు. ఇప్పుడు ఈ వీడియోను వైసీపీ సోషల్ మీడియా బాగా సర్క్యులేట్ చేస్తోంది. మీ లెక్క 2029లో తేలుస్తాడు.. వస్తాడు.. అంటూ టైటిల్ పెడుతున్నారు కూడా.

Also Read : ఈడీ టార్గెట్ జగన్.. రాజకీయమా? చట్ట ప్రక్రియలో భాగమా?

అయితే వంశీ డైలాగ్ ఇప్పుడు బాగా ట్రోల్ అవుతుంది. అసలు నువ్వు ఎవరి తాలుకానో తెలుసా.. నీ వెనుక ఉన్నోడు ఎవరో తెలుసా.. నీ వెనుక ఉన్నోడు ఎన్ని నెలలు జైలులో ఉన్నాడో తెలుసా.. నీ వెనుక ఉన్నోడు.. ఎన్ని ఏళ్లుగా బెయిల్ మీద బయట ఉన్నాడో తెలుసా.. నీ వెనుక ఉన్నోడి బాబాయ్ ఎలా చనిపోయాడో తెలుసా.. నీ వెనుక ఉన్నోడు అధికారంలోకి వచ్చేందుకు బాబాయ్‌ని ఏం చేశాడో తెలుసా.. నీ వెనుక ఉన్నోడు ఎన్ని వేల కోట్లు దోచుకున్నాడో తెలుసా.. నీ వెనుక ఉన్నోడు కేంద్రానికి ఎంత భయపడతాడో తెలుసా.. నీ వెనుక ఉన్నోడి మీద ఎన్ని కేసులున్నాయో తెలుసా..? అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. మరికొందరు అయితే.. ముందు నీ వెనుక ఉన్నోడు జైలుకు పోకుండా చూసుకోమను.. తర్వాత చంద్రబాబు సంగతి, టీడీపీ నేతలు, జనసేన నేతల గురించి లెక్క తేల్చమని చెప్పు.. అంటూ విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. పాపం వంశీ.. అనవసరంగా జగన్ జైలు జీవితం, ఆర్థిక నేరాల చిట్టాను బయటపెట్టినట్లు అయ్యింది.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

వైసీపీని తుడిచేస్తున్న చిన్న...

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీకి...

తెలంగాణ బీజేపీలో కాక్రోచ్...

ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్...

విశాఖ మేయర్ రిజర్వేషన్...

బీజేపీ నేతల ఒత్తిళ్లతోనే విశాఖపట్నం నగర...

జగన్ ను భయపెడుతోన్న...

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల వేడి...

ఏపీ జడ్పీ ఛైర్మన్...

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు...

మంగళగిరి మేయర్‌ పీఠం...

మంగళగిరి–తాడేపల్లి మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌ పదవి...

పోల్స్