Tuesday, October 13, 2026 12:45 PM
Tuesday, October 13, 2026 12:45 PM

రాహుల్ పక్కన నిలిచిన ఆ యువతి ఎవరు..?

ఓటర్ల జాబితా నుంచి భారీగా పేర్ల తొలగింపు, ఎన్నికల అక్రమాలపై ప్రధాన ప్రతిపక్షం ఇండియా కూటమి సోమవారం ఢిల్లీ వేదికగా భారీ నిరసన ప్రదర్శన చేపట్టింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేతృత్వంలో వేలాది మంది కార్యకర్తలు సుప్రీంకోర్టు వైపు మార్చ్ నిర్వహించారు. ఈ నిరసన ప్రదర్శనలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో పాటు ఒక యువతి అందరి దృష్టిని ఆకర్షించింది. రాహుల్ గాంధీ ప్రచార ట్రక్కుపై ఎక్కి నిరసనకారులకు అభివాదం చేస్తున్న సమయంలో, తెల్లటి షర్ట్ ధరించిన ఆ యువతి ఆయన పక్కనే నిలబడి తీవ్రస్థాయిలో నినాదాలు చేస్తూ కనిపించింది.

Also Read : విజయవాడ మేయర్ అభ్యర్థి ఫిక్స్..!

దీంతో సోషల్ మీడియాలో ఆ ఫోటోలు వైరల్‌గా మారగా.. ఇంతకీ రాహుల్ పక్కనున్న ఆ యువతి ఎవరనే చర్చ మొదలైంది. ఆమె పేరు జన్నత్ బిష్ణోయ్. ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిలర్‌గా ఆమె బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగమైన నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియాలో ఆమె క్రియాశీల సభ్యురాలు. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం రాజస్థాన్‌కు చెందిన జన్నత్.. ప్రస్తుతం ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన శ్యామా ప్రసాద్ ముఖర్జీ కాలేజీలో బిఏ సెకండ్ ఇయర్ చదువుతున్నారట.

Also Read : గుర్రపు స్వారీ ఆటిజం పిల్లల్లో ఇంత మార్పు తెస్తుందా..?

గత కొంతకాలంగా ఢిల్లీలో జరుగుతున్న విద్యార్థి ఉద్యమాల్లో ఆమె చురుగ్గా పాల్గొంటున్నారు. క్యాంపస్‌లలో విద్యార్థినుల భద్రత కోసం జన్నత్ బిష్ణోయ్ నిరంతరం పోరాడుతున్నారు. కాలేజీ ఆవరణల్లో సీసీటీవీ నెట్‌వర్క్‌లను ఏర్పాటు చేయాలని, పింక్ పోలీస్ బూత్‌లను ఏర్పాటు చేయాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థి రాజకీయాలే కాకుండా పర్యావరణ ఉద్యమాల్లోనూ ఆమె భాగస్వామి అయ్యారు. పేపర్ లీకేజీల వ్యవహారం తర్వాత కాంగ్రెస్ పార్టీ యువతకు, విద్యార్థులకు చేరువయ్యేందుకు ఛాత్రోం కీ గూంజ్ వంటి కార్యక్రమాలతో సరికొత్త వ్యూహాలు రచిస్తోంది. అందులో భాగంగానే సోమవారం నాటి సుప్రీంకోర్టు మార్చ్‌లో రాహుల్ గాంధీ పక్కన జన్నత్ బిష్ణోయ్ లాంటి యువ మహిళా విద్యార్థి నేతకు సముచిత స్థానం కల్పించడం రాజకీయంగానూ ఆసక్తి రేకెత్తించింది.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

మంగళగిరి మేయర్‌ పీఠం...

మంగళగిరి–తాడేపల్లి మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌ పదవి...

ఈడీ టార్గెట్ జగన్.....

వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ...

ఏపీలో మున్సిపల్ సమరానికి...

ఆంధ్రప్రదేశ్‌లో సుదీర్ఘ కాలంగా ఎదురుచూస్తున్న స్థానిక...

కూటమిలో సీట్ల పంచాయతీ..!

స్థానిక సమరానికి తెరలేసింది. కూటమిలో సీట్లు...

బాంబు పేల్చిన రాహుల్.....

దేశ రాజధాని వేదికగా సాగుతున్న ఓటర్ల...

తమిళనాడు సీఎం విజయ్...

దక్షిణ భారత రాజకీయాల్లో ఆసక్తికర, కీలక...

పోల్స్