Monday, October 12, 2026 02:13 PM
Monday, October 12, 2026 02:13 PM

విజయవాడ మేయర్ అభ్యర్థి ఫిక్స్..!

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగనుంది. ఇప్పటికే రిజర్వేషన్ల కేటాయింపుపై సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి కూడా. ఈ నేపథ్యంలో ప్రధాన నగరాల్లో మేయర్ అభ్యర్థులపై ప్రధాన పార్టీల్లో జోరుగా చర్చలు నడుస్తున్నాయి. ప్రధానంగా రాజధాని అమరావతి పరిధిలోని విజయవాడ, గుంటూరు నగరాల మేయర్ స్థానాల కోసం కూటమి పార్టీల్లో చాలా మంది ఆశావహులు పోటీ పడుతున్నారు. గుంటూరు మేయర్ స్థానాన్ని తమ పార్టీకి కేటాయించాలని జనసేన పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గట్టిగా పట్టుపడుతున్నట్లు తెలుస్తోంది. అయితే టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు మాత్రం.. గుంటూరు బదులుగా విజయవాడ మేయర్ సీటు తీసుకోవాలి సూచిస్తున్నట్లు తెలుస్తోంది.

Also Read : మేయర్ స్థానాల రిజర్వేషన్లు ఇవే..? మహిళలకు 50 శాతం కోటా..!

తాజాగా రిజర్వేషన్లపై జరుగుతున్న ప్రచారంలో విజయవాడ మేయర్ స్థానాన్ని ఓసీ జనరల్‌కు కేటాయిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో విజయవాడ మేయర్ స్థానం కోసం అటు టీడీపీలో, ఇటు జనసేనలో పలువురు ప్రముఖులు పోటీ పడుతున్నారు. ఇప్పటికే విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వర్రావు కొడుకు బోండా సిద్ధార్థ మేయర్‌గా పోటీ పడేందుకు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. అదే సమయంలో గద్దె రామ్మోహన్ రావు కుమారుడు, పట్టాభి పేర్లు కూడా బాగానే వినిపిస్తున్నాయి. తాజాగా బొప్పన భవకుమార్ కూడా పోటీ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఓసీ జనరల్ అనే వార్త బయటకు రావడంతో.. ఆశావహుల జాబిత మరింత పెరిగిపోయింది.

Also Read : ఏపీ లోకల్ పోరు.. ఈసీ రిజర్వేషన్ యాక్షన్‌ ప్లాన్‌ రెడీ..?

అయితే తాజాగా విజయవాడ మేయర్‌గా మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ సతీమణి పుష్పవల్లిని రెండు పార్టీల నేతలు దాదాపు ఖాయం చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల వంగవీటి రాధ కూడా ఇదే విషయంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో చర్చించినట్లు సమాచారం. మహిళ, కాపు సామాజిక వర్గం, టీడీపీ నేత కావడంతో.. ఎవరు అభ్యంతరం పెట్టే అవకాశం ఉండదనేది పార్టీ పెద్దల భావన. ఇదే సమయంలో చాలా ఏళ్లుగా పదవి కోసం ఎదురు చూస్తున్న వంగవీటి రాధకు కూడా న్యాయం చేసినట్లు అవుతుందనే మాట కూడా వినిపిస్తోంది. విజయవాడ మేయర్ అంటే.. అన్ని విధాలుగా సముచిత స్థానం కల్పించినట్లు అవుతుందంటున్నారు. ఒక వేళ విజయవాడ మేయర్ స్థానాన్ని ఓసీ మహిళకు కేటాయించినా.. పుష్పవల్లి ఎంపిక సరిగ్గా సరిపోతుందనేది పార్టీ పెద్దల మాట. మరోవైపు పవన్ కళ్యాణ్‌తో పుష్పవల్లి ఉన్న ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో పుష్పవల్లి ఫిక్స్ అనే మాట బాగా వినిపిస్తోంది. అయితే తుది జాబితా వచ్చే వరకు ఖరారు కాదంటున్నారు కూడా.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

తమిళనాడు సీఎం విజయ్...

దక్షిణ భారత రాజకీయాల్లో ఆసక్తికర, కీలక...

పెన్షన్.. వివరించకుంటే ప్రమాదమే..!

నవంబర్ నెల నుంచి ఎన్‌టీఆర్ భరోసా...

ఏపీ లోకల్ పోరు.....

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు...

రాష్ట్రంలో కరువు ముప్పు.....

తెలంగాణలో రానున్న రోజుల్లో తీవ్ర నీటి...

ఎన్టీఆర్ కట్టించిన ఇల్లు.....

హైదరాబాద్ మహానగరంలో అత్యంత రద్దీగా ఉండే...

వైసీపీ కుట్రలకు చంద్రబాబు...

ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో కీలక ఘట్టం...

పోల్స్