Tuesday, October 13, 2026 06:03 AM
Tuesday, October 13, 2026 06:03 AM

ఈరోజు రాశి ఫలితాలు (13-10-2026)

శ్రీ పరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, ఆశ్వయుజ మాసం, శుక్ల పక్షం.. 13-10-2026 నాడు మీ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి అనుకుంటున్నారా, అయితే ఆ వివరాలు మీకోసం. మీ గ్రహాల ప్రభావం ఎలా ఉందో చెక్ చేసుకోండి..

మేషం

దూరప్రయాణాల వలన శ్రమ అధికమౌతుంది. రావలసిన సొమ్ము సకాలంలో చేతికి అందదు. వృథా ఖర్చులు పెరుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో ఆటుపోట్లు తప్పవు. బంధువులతో అకారణంగా మాట పట్టింపులుంటాయి. కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు.
—————————————

వృషభం

గృహమున శుభకార్యములు నిర్వహిస్తారు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. వ్యాపార, ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. సన్నిహితులతో సఖ్యతగా వ్యవహారిస్తారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు పరుస్తారు.
—————————————

మిధునం

ఆరోగ్యపరంగా చికాకులు తప్పవు. వ్యాపారాలలో జాగ్రత్త అవసరం. చేపట్టిన వ్యవహారాలలో ఆటంకాలు ఉంటాయి. ఇంటా బయట బాధ్యతలు పెరుగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. ఇతరులకు ధనపరంగా మాట ఇవ్వడం మంచిది కాదు. ఉద్యోగమున మీ కష్టం ఫలించదు.
—————————————

కర్కాటకం

ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి. వ్యాపార, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలలో ముందడుగు వేస్తారు. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. దూరపు బంధువుల నుండి అందిన సమాచారం ఊరట కలిగిస్తుంది. స్నేహితులతో వివాదాలు సర్దుబాటు కాగలవు.
—————————————

సింహం

ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపారాలు లాభాల బాటలో సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో నూతనోత్సాహంతో ముందుకు సాగుతారు. బంధుమిత్రుల సహాయ సహకారాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. ఆదాయం సంతృప్తినిస్తుంది. సోదరులతో శుభాకార్య విషయాలపై చర్చలు చేస్తారు.
—————————————

కన్య

దూరప్రయాణాలలో వాహన ఇబ్బందులుంటాయి. నూతన ఋణాలు చేస్తారు. ఇంటా బయట బాధ్యతలు ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. కుటుంబ సభ్యుల ప్రవర్తన వలన మానసిక ప్రశాంతత లోపిస్తుంది. చేపట్టిన పనుల్లో అవాంతరాలు కలుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో సమస్యలు అధికమౌతాయి.
—————————————

తుల

చిన్నపాటి అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. బందు మిత్రులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. వ్యాపార, ఉద్యోగాలలో ఊహించని మార్పులుంటాయి. కొన్ని కార్యక్రమాలు ముందుకు సాగక నిరాశ పెరుగుతుంది. రెండు రకములైన ఆలోచన వలన ధన నష్టాలు తప్పవు.
—————————————

వృశ్చికం

ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. నిరుద్యోగులు నూతన ఉద్యోగ అవకాశములు పొందుతారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. నూతన కార్యక్రమాలు చేపడతారు. వృత్తి వ్యాపారాలలో మీ అంచనాలు నిజమవుతాయి.
—————————————

ధనస్సు

వ్యాపారాలు గతం కంటే మెరుగవుతాయి. ఉద్యోగమున అధికారుల అనుగ్రహం కలుగుతుంది. సంతాన విద్యా ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలమౌతాయి. గృహ నిర్మాణ పనులు ప్రారంభిస్తారు. చిన్ననాటి స్నేహితుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఆకస్మిక ధన లాభ సూచనలున్నవి.
—————————————

మకరం

దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. రాబడికి మించి ఖర్చులు పెరుగుతాయి. సోదరులతో ఆస్తి వివాదాలు ఉంటాయి. వ్యాపార, ఉద్యోగాలలో ఊహించని ఇబ్బందులుంటాయి. నూతన ఋణ ప్రయత్నాలు ఫలించవు. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది.
—————————————

కుంభం

వృత్తి వ్యాపారాలలో అంచనాలు అందుకోవడంలో విఫలమౌతారు. సన్నిహితుల నుండి ఊహించని విమర్శలు ఎదురవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు మందకోడిగా సాగుతాయి. ఆర్థిక సమస్యలు తప్పవు. చేపట్టిన పనులలో కష్టానికి తగ్గ ఫలితం దక్కదు. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు.
—————————————

మీనం

వ్యాపార విస్తరణకు మిత్రుల సహాయం అందుతుంది. ఆదాయం గతం కంటే మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో గృహమున ఆనందంగా గడుపుతారు. ఉద్యోగాలు ఆశాజకనంగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో మీ సేవలకు తగిన గుర్తింపు పొందుతారు. సోదరులతో ఆస్తి వివాదాలు పరిష్కారమౌతాయి.
—————————————

గమనిక : ఈ ఆర్టికల్‌లో అందించిన జ్యోతిష్య సమాచారం, వార్షిక ఫలాలు, పరిహారాలన్నీ జ్యోతిష్యశాస్త్రం, హిందూ మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇది అందుబాటులో ఉన్న సమాచారం మేరకు అవగాహన కొరకు ఇవ్వబడింది. ఏదైనా నిర్ణయాలు తీసుకునే ముందు జ్యోతిష్య పండితులను సంప్రదించండి.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

బాంబు పేల్చిన రాహుల్.....

దేశ రాజధాని వేదికగా సాగుతున్న ఓటర్ల...

తమిళనాడు సీఎం విజయ్...

దక్షిణ భారత రాజకీయాల్లో ఆసక్తికర, కీలక...

పెన్షన్.. వివరించకుంటే ప్రమాదమే..!

నవంబర్ నెల నుంచి ఎన్‌టీఆర్ భరోసా...

విజయవాడ మేయర్ అభ్యర్థి...

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా...

ఏపీ లోకల్ పోరు.....

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు...

రాష్ట్రంలో కరువు ముప్పు.....

తెలంగాణలో రానున్న రోజుల్లో తీవ్ర నీటి...

పోల్స్