బరువు తగ్గాలని అనుకునే ప్రతి ఒక్కరూ ముందుగా చేసే పని అన్నం తినడం ఆపేయడం లేదా కార్బోహైడ్రేట్లు ఉన్న ఆహారాన్ని పూర్తిగా దూరం పెట్టడం. ఇలా చేయడం వల్ల బరువు వేగంగా తగ్గుతామని చాలా మంది భావిస్తారు. అయితే, ప్రముఖ న్యూట్రిషనిస్ట్ ప్రకారం.. బరువు తగ్గడానికి కార్బ్స్‌ను పూర్తిగా స్కిప్ చేయడం సరైన పద్ధతి కాదు. దీనికి బదులుగా, ఆకలితో కడుపు మార్చుకోకుండా కడుపు నిండా తింటూనే బరువు తగ్గే అద్భుతమైన టెక్నిక్ వాల్యూమ్ ఈటింగ్ అని వారు స్పష్టం చేస్తున్నారు.
Also Read : గవర్నర్ కోటా పైనే హస్తం కన్ను..!
మన శరీరానికి తక్షణ శక్తిని అందించడానికి కార్బోహైడ్రేట్లు ఇంధనంలా పనిచేస్తాయి. వీటిని పూర్తిగా మానేయడం వల్ల శరీరం అలసటకు గురవడమే కాకుండా, మెదడు పనితీరు మందగించడం, మూడ్ స్వింగ్స్ రావడం, తీవ్రమైన నీరసం వచ్చే ప్రమాదం ఉంది. అంతేకాకుండా, కార్బ్స్ నిరోధించడం వల్ల క్రేవింగ్స్ పెరిగి, చివరికి తెలియకుండానే ఎక్కువ క్యాలరీల ఆహారాన్ని తినేలా చేస్తుంది. అందుకే డైటింగ్‌లో బ్రౌన్ రైస్, ఓట్స్, తృణధాన్యాల వంటి సంక్లిష్ట కార్బోహైడ్రేట్లను తగిన మోతాదులో చేర్చుకోవడం చాలా ముఖ్యం.
వాల్యూమ్ ఈటింగ్ అంటే తక్కువ క్యాలరీలు ఉండి, ఎక్కువ పరిమాణం ఉండే ఆహార పదార్థాలను ఎంచుకోవడం. దీనివల్ల ఎక్కువ ఆహారం తిన్న తృప్తి కలగడమే కాకుండా, కడుపు నిండిన భావన ఎక్కువ సేపు ఉంటుంది. ఉదాహరణకు, ఒక చిన్న చాక్లెట్ ముక్క తినడం వల్ల వచ్చే క్యాలరీలు.. ఒక పెద్ద బౌల్ నిండా ఉండే సలాడ్ లేదా పుచ్చకాయ ముక్కల వల్ల వచ్చే క్యాలరీలతో సమానం. ఇక్కడ చాక్లెట్ తింటే ఆకలి తీరదు కానీ, సలాడ్ లేదా పండ్లు తింటే కడుపు నిండుతుంది.
Also Read : అమెరికా సంచలన నిర్ణయం.. ఇరాన్ దాడి భయాలే కారణమా..?
ఈ విధానాన్ని రోజువారీ డైటింగ్‌లో సులభంగా అమలు చేయడానికి.. మీ ప్లేట్‌లో సగానికి పైగా దోసకాయలు, క్యారెట్లు, బ్రోకలీ, పాలకూర వంటి తక్కువ క్యాలరీలు, ఎక్కువ ఫైబర్, నీటి శాతం ఉన్న కూరగాయలతో నింపేయాలి. యాపిల్స్, పుచ్చకాయ, స్ట్రాబెర్రీస్ వంటి పండ్లను స్నాక్స్‌గా తీసుకోవడం వల్ల తక్కువ క్యాలరీలతో కడుపు నిండుతుంది. చికెన్ బ్రెస్ట్, గుడ్డు తెల్లసొన, పనీర్ లేదా పప్పుధాన్యాలను జత చేయడం వల్ల కండరాల పుష్టితో పాటు ఆకలి త్వరగా వేయదు. ఈ విధంగా కార్బోహైడ్రేట్లను పరిమితంగా ఉంచుకుంటూ, ఎక్కువ పరిమాణంలో ఉండే పోషకాహారాన్ని తీసుకోవడమే శాశ్వతంగా, ఆరోగ్యకరంగా బరువు తగ్గడానికి ఏకైక మార్గమని న్యూట్రిషనిస్ట్ స్పష్టం చేస్తున్నారు.


