భారతదేశ ప్రీమియం ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లో ప్రముఖ అంతర్జాతీయ ఆటోమొబైల్ సంస్థ బీవైడీ ఇండియా అరుదైన మైలురాయిని అందుకుంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 20,000 ఎలక్ట్రిక్ కార్ల డెలివరీలను పూర్తి చేసినట్లు సంస్థ అధికారికంగా ప్రకటించింది. గతేడాది సెప్టెంబర్‌లో 10,000 యూనిట్ల విక్రయాల మార్కును దాటిన బీవైడీ, కేవలం ఏడాదికి పైగా కాలంలోనే తన అమ్మకాలను రెట్టింపు చేసుకోవడం విశేషం. ఇటీవల దేశ రాజధాని ఢిల్లీలోని పీపీఎస్ బీవైడీ షోరూమ్ వేదికగా 20,000వ కారును ప్రత్యేక వేడుకల మధ్య కస్టమర్‌కు అందజేశారు.
Also Read : డబ్ల్యూటీసీ ఫైనల్ రేసులో టీమిండియాకు డూ ఆర్ డై..!
భారత మార్కెట్లో బీవైడీ సాధించిన ఈ భారీ విజయంలో ‘అట్టో 3’, ‘సీలయన్ 7’ మోడళ్లు అత్యంత కీలక పాత్ర పోషించాయి. సంస్థ విక్రయాలలో అట్టో 3 ఎలక్ట్రిక్ ఎస్యూవీ 9,000 డెలివరీలతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా, గతేడాది ఫిబ్రవరిలో విడుదలైన సీలయన్ 7 మోడల్ తక్కువ కాలంలోనే 5,000 యూనిట్లకు పైగా అమ్ముడైంది. మొత్తం 20,000 డెలివరీలలో ఈ రెండు మోడళ్లే ఏకంగా 14,000కు పైగా వాటాను దక్కించుకోవడం గమనార్హం. వీటితో పాటు స్పోర్టీ లుక్‌తో ఆకట్టుకుంటున్న ‘సీల్’ ఎలక్ట్రిక్ సెడాన్, కుటుంబ అవసరాలకు అనువైన ‘ఈమాక్స్ 7’ ఎంపీవీ కార్లకు కూడా భారత వినియోగదారుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది.
Also Read : అంతర్గత ప్రజాస్వామ్యం.. బాగా ముదిరినట్లుంది..!
తమ బ్లేడ్ బ్యాటరీ టెక్నాలజీ, అత్యాధునిక ఫీచర్లపై భారతీయ కస్టమర్లకు పెరుగుతున్న నమ్మకానికి ఈ 20,000 డెలివరీల మైలురాయే నిదర్శనమని బీవైడీ ఇండియా వైస్ ప్రెసిడెంట్, నేషనల్ సేల్స్ హెడ్ శ్రీరంగ్ జోషి పేర్కొన్నారు. కేవలం ప్రీమియం విభాగంతోనే ఆగిపోకుండా, ఇటీవలే తమ అల్ట్రా-లగ్జరీ బ్రాండ్ ‘డెంజా’ ను కూడా భారత్‌లో ప్రవేశపెట్టినట్లు తెలిపారు. ఈ బ్రాండ్ కింద ఏడు సీట్ల లగ్జరీ ఎంపీవీ ‘డెంజా డీ9’ (ఎక్స్-షోరూమ్ ధర రూ. 90 లక్షలు),
Also Read : ఏపీకి మరో రెండు, మూడు తుపానుల ముప్పు..?
హై-పెర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ కారు ‘డెంజా జెడ్9 జీటీ’ (ఎక్స్-షోరూమ్ ధర రూ. 1.56 కోట్లు) మోడళ్లను మార్కెట్ లోకి తీసుకువచ్చింది. ప్రస్తుతం దేశంలోని 40 ప్రధాన నగరాల్లో 51 షోరూమ్‌ల ద్వారా బీవైడీ తన సేవలను అందిస్తోంది. రాబోయే రోజుల్లో మరిన్ని నగరాలకు తమ డీలర్షిప్ నెట్‌వర్క్‌ను విస్తరించడంతో పాటు, కస్టమర్లకు మెరుగైన అమ్మకాల అనంతర సేవలు, ఛార్జింగ్ సదుపాయాలను అందుబాటులోకి తెచ్చి, ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో మరింత ముందుకు దూసుకెళ్లేందుకు సంస్థ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.


