Thursday, November 19, 2026 08:01 PM
Thursday, November 19, 2026 08:01 PM

స్వీట్లపై వెండి బదులు అల్యూమినియం.. ఆరోగ్యంపై ప్రభావం ఏంటి?

కాజూ కట్లీ, చమ్‌చమ్ వంటి స్వీట్లపై మెరిసే వెండి పూత వెనుక కల్తీ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అసలైన వెండి రేకులకు బదులుగా అల్యూమినియం రేకులు తయారు చేసి విక్రయిస్తున్నారన్న సమాచారంతో హైదరాబాద్ పోలీసులు నాలుగు తయారీ యూనిట్లపై దాడులు చేశారు. చార్మినార్ పరిసరాల్లో నిర్వహించిన ఈ దాడుల్లో నకిలీ సిల్వర్ వర్క్‌తో పాటు తయారీ సామగ్రిని స్వాధీనం చేసుకుని, నలుగురు యజమానులను అరెస్టు చేశారు

Also Read : కూటమిలో తేలని జెడ్పీల లెక్క! టీడీపీకి 22.. జనసేనకు 4?

హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేశ్ మురళీధర్ భగవత్ వెల్లడించిన వివరాల ప్రకారం.. నిందితులు అల్యూమినియం రేకులు, తునకలను అసలైన తినదగిన వెండి వర్క్‌గా నమ్మించి విక్రయిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. వీటిని తెలంగాణలోని స్వీట్ షాపులు, బేకరీలు, పాన్ దుకాణాలకు సరఫరా చేసినట్లు పోలీసులు గుర్తించారు. స్వీట్ల అలంకరణతో పాటు పాన్ తయారీలోనూ ఈ నకిలీ ఉత్పత్తులను వినియోగించినట్లు సమాచారం.

ఈ ఘటనతో ఆహారం ద్వారా అల్యూమినియం శరీరంలోకి చేరితే ఎలాంటి ప్రభావం ఉంటుందనే ప్రశ్న తలెత్తుతోంది. అయితే ఆరోగ్యంపై దాని ప్రభావం తీసుకున్న పరిమాణం, ఎంతకాలం శరీరంలోకి చేరుతోంది, వ్యక్తి ఆరోగ్య పరిస్థితి వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది.

శరీరంలోకి వెళ్లిన అల్యూమినియం అంతా పేరుకుపోతుందా?

ఆహారం ద్వారా తీసుకున్న అల్యూమినియంలో చాలా తక్కువ భాగమే జీర్ణవ్యవస్థ నుంచి రక్తంలోకి శోషించబడుతుంది. శోషించబడని భాగం ప్రధానంగా మలం ద్వారా బయటకు వెళ్తుంది. రక్తంలోకి చేరిన కొద్దిపాటి అల్యూమినియంలో అధిక భాగాన్ని మూత్రపిండాలు మూత్రం ద్వారా తొలగిస్తాయని అమెరికాకు చెందిన ఏజెన్సీ ఫర్ టాక్సిక్ సబ్‌స్టాన్సెస్ అండ్ డిసీజ్ రిజిస్ట్రీ (ఏటీఎస్‌డీఆర్) వివరిస్తోంది.

అధికంగా పేరుకుపోతే మెదడు, ఎముకలపై ప్రభావం

శరీరంలో అల్యూమినియం అధికంగా పేరుకుపోయిన కొన్ని సందర్భాల్లో మెదడు, ఎముకలకు సంబంధించిన సమస్యలు నమోదయ్యాయి. ముఖ్యంగా మూత్రపిండాల పనితీరు తగ్గిన వారిలో అల్యూమినియం బయటకు వెళ్లే ప్రక్రియ మందగించడంతో ప్రమాదం పెరగవచ్చు. అయితే అల్యూమినియం కలిసిన స్వీట్ ఒక్కసారి తిన్నంత మాత్రాన జ్ఞాపకశక్తి కోల్పోవడం లేదా నాడీ సంబంధిత వ్యాధులు తప్పనిసరిగా వస్తాయని చెప్పడం సరికాదు. ఆరోగ్య ప్రభావాన్ని అంచనా వేయడానికి మోతాదు, వ్యవధి, శరీరంలోకి చేరిన విధానాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. ఎక్కువగా తినేవారిలో మాత్రం తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.

Also Read : కాకినాడ పరిణామం.. సిక్కోలుకు సంకేతమా..?

ఊపిరితిత్తుల సమస్యల విషయంలోనూ ఈ తేడా గుర్తించాలి. అల్యూమినియం ధూళిని అధికంగా పీల్చే పరిశ్రమల కార్మికుల్లో శ్వాస సంబంధిత సమస్యలు నమోదయ్యాయి. ఆహారం ద్వారా అల్యూమినియం తీసుకోవడాన్ని, ధూళిని పీల్చడం వల్ల కలిగే ప్రభావాలతో నేరుగా పోల్చలేం.

స్వీట్లపై ఆకర్షణీయంగా కనిపించే మెరుపు ఒక్కటే వాటి నాణ్యతకు ప్రమాణం కాదు. వెండి వర్క్ పేరుతో అల్యూమినియం సరఫరా చేసినట్లు వెలుగులోకి వచ్చిన ఈ వ్యవహారం.. అలంకరణకు ఉపయోగించే పదార్థాల నాణ్యత, తయారీ కేంద్రాలు, సరఫరా వ్యవస్థపై పర్యవేక్షణ అవసరాన్ని తెలుపుతోంది.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

భారతీయ రైల్వే.. బాబోయ్.....

భారతీయ రైల్వే వ్యవస్థ అత్యాధునిక వైపు...

2028–29 ఎన్నికలు వేరే...

తెలుగు రాష్ట్రాల్లో వచ్చే శాసనసభ ఎన్నికలు...

కాకినాడ పరిణామం.. సిక్కోలుకు...

శ్రీకాకుళం జిల్లా పరిషత్ పీఠం ఎవరికి...

ఎన్టీఆర్ బాటలో పవన్.....

కారు కూతలు కూస్తున్న వారి నోటికి...

కూటమిలో తేలని జెడ్పీల...

ఆంధ్రప్రదేశ్‌లో జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్లు, వైస్‌...

మిశ్రాకు బ్రేకులు పడుతున్నాయా..?

ఐఏఎస్ కార్తికేయ మిశ్రాను సీఎంఓ నుంచి...

పోల్స్