Monday, November 16, 2026 08:02 PM
Monday, November 16, 2026 08:02 PM

పెద్దలలో టైప్ 1 మధుమేహంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ సంచలన మార్గదర్శకాలు..!

పెద్దలలో టైప్ 1 మధుమేహం నిర్ధారణ, నిర్వహణపై ప్రపంచ ఆరోగ్య సంస్థ మొట్టమొదటిసారిగా సమగ్రమైన మార్గదర్శకాలను విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరికీ ఆర్థిక స్థోమతతో సంబంధం లేకుండా నాణ్యమైన, ప్రాణాలను రక్షించే వైద్యం అందేలా చేయడమే ఈ మార్గదర్శకాల ప్రధాన ఉద్దేశం. టైప్ 1 డయాబెటిస్ అనగానే కేవలం పిల్లలను మాత్రమే ప్రభావితం చేసే సమస్యగా భావిస్తుంటారు, కానీ ఇది పెద్ద వయస్సు వారినీ పెద్ద ఎత్తున ప్రభావితం చేస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.

Also Read : వైసీపీలో భారీ ప్రక్షాళన.. వేటుకు వేళ..!

టైప్ 1 డయాబెటిస్ ఉన్న పెద్దలు రోజులో అనేక పర్యాయాలు ఇన్సులిన్ ఇంజెక్షన్లు తీసుకోవాలని డబ్ల్యూహెచ్‌ఓ సిఫార్సు చేసింది. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలకు అనుగుణంగా ఇన్సులిన్ మోతాదును సర్దుబాటు చేసుకోవాలని, శరీరంలో సహజంగా ఉత్పత్తి అయ్యే ఇన్సులిన్‌లాగే పనిచేసే మానవ ఇన్సులిన్ సమర్థవంతమైన, సరైన చికిత్స మార్గమని పేర్కొంది. ఆర్థిక వనరులు పరిమితంగా ఉన్న ప్రాంతాల్లోనూ ఇది సులభంగా, చౌకగా లభించేలా చూడాల్సిన అవసరాన్ని చెప్పింది ప్రపంచ ఆరోగ్య సంస్థ.

మధుమేహాన్ని అదుపులో ఉంచడంలో రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను ఎప్పటికప్పుడు పరిశీలించడం అత్యంత కీలకమని డబ్ల్యూహెచ్‌ఓ స్పష్టం చేసింది. ఆసుపత్రులలో సాధారణ రక్త పరీక్షల ద్వారా లేదా రోగులు ఇంట్లోనే ఫింగర్-ప్రిక్ టెస్ట్, చర్మానికి అమర్చుకునే చిన్న సెన్సార్ల ద్వారా నిరంతరం పర్యవేక్షించే కంటిన్యూయస్ గ్లూకోజ్ మానిటరింగ్ పద్ధతులను ఉపయోగించవచ్చని తెలిపింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో లేని చోట..

Also Read : ఎన్విడియా వివాదం వేళ భారత్ సంచలన నిర్ణయం.. చైనాకు మాస్టర్ స్ట్రోక్

ప్రత్యామ్నాయంగా మూత్రంలో గ్లూకోజ్ పరీక్షలను కూడా పరిగణించవచ్చని పేర్కొంది. కేవలం అత్యాధునిక ఆసుపత్రులకే పరిమితం కాకుండా, వైద్య సదుపాయాలు తక్కువగా ఉన్న ప్రాంతాలలో, సహజ విపత్తులు లేదా అత్యవసర పరిస్థితులు ఏర్పడినప్పుడు కూడా డయాబెటిస్ సేవలు నిరంతరం అందేలా ఈ మార్గదర్శకాలు దోహదపడతాయి. ప్రపంచవ్యాప్తంగా అందరికీ సరసమైన ధరలలో నాణ్యమైన చికిత్స అందేలా దేశాలు తగిన చర్యలు తీసుకోవాలని, ఈ కార్యక్రమాల రూపకల్పనలో టైప్ 1 డయాబెటిస్‌తో జీవిస్తున్న రోగులను కూడా భాగస్వామ్యం చేయాలని డబ్ల్యూహెచ్‌ఓ ప్రోత్సహిస్తోంది.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

మళ్ళీ మొదటికి వచ్చిన...

కృష్ణా జిల్లా మిల్క్ ప్రొడ్యూసర్స్ కోఆపరేటివ్...

ఎన్విడియా వివాదం వేళ...

అంతర్జాతీయ టెక్నాలజీ, చిప్‌సెట్ రంగాల్లో ప్రముఖ...

కోస్తాంధ్ర తీరాన్ని ఈనెల...

ఇప్పటికే 2 తుపాన్లతో అల్లాడుతున్న ఏపీ...

స్థానిక సంస్థల రిజర్వేషన్లపై...

స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల కేటాయింపు,...

ఏపీ లిక్కర్ స్కామ్...

ఏపీ రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతున్న...

మేయర్ కుర్చీ.. సీనియర్లకు...

ఒక్క మేయర్ కుర్చీ.. మూడు పార్టీల...

పోల్స్