Monday, November 16, 2026 08:01 PM
Monday, November 16, 2026 08:01 PM

స్థానిక సంస్థల రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు

స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల కేటాయింపు, రొటేషన్ విధానంపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అత్యంత కీలకమైన తీర్పును వెలువరించింది. ఒక నిర్దిష్ట నియోజకవర్గం లేదా స్థానాన్ని షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల వారికి రిజర్వ్ చేయాలని కోరే ప్రాథమిక లేదా అంతర్గత హక్కు ఏ ఓటరుకు గానీ, ఏ అభ్యర్థికి గానీ ఉండదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చీ, జస్టిస్ వి. మోహనలతో కూడిన ధర్మాసనం సోమవారం ఈ మేరకు సంచలన వ్యాఖ్యలు చేస్తూ దాఖలైన ప్రత్యేక అనుమతి పిటిషన్‌ను కొట్టివేసింది.

Also Read : ఏపీ లిక్కర్ స్కామ్ దర్యాప్తులో భయంకర నిజాలు..!

మహారాష్ట్రలోని జిల్లా పరిషత్, పంచాయతీ సమితి ఎన్నికలకు సంబంధించి ఆ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 2025 రిజర్వేషన్ల రొటేషన్ నిబంధనలలోని ‘రూల్ 12’ను సవాలు చేస్తూ రూపాలి ఇంద్రభూషణ్ సోండే అనే పిటిషనర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. గతంలో ఇదే అంశంపై గత ఏడాది సెప్టెంబర్ 19న బాంబే హైకోర్టు పిటిషన్‌ను కొట్టివేయగా, ఆ తీర్పును సవాలు చేస్తూ ఆమె సుప్రీంకోర్టులో అప్పీల్ చేశారు. 2025 సవరణ తర్వాత జరిగే ఎన్నికలను మొదటి ఎన్నికగా పరిగణిస్తూ రిజర్వేషన్ల రొటేషన్‌ను కొత్తగా ప్రారంభించడం వల్ల తమ నియోజకవర్గానికి రిజర్వేషన్ దక్కే అవకాశం కోల్పోతోందని పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది వాదించారు.

Also Read : మేయర్ కుర్చీ.. సీనియర్లకు అగ్ని పరీక్ష..!

ఈ వాదనలపై స్పందించిన ధర్మాసనం, రాజ్యాంగం మరియు ఎన్నికల నియమాలు స్థానిక సంస్థల్లో ఆయా వర్గాల జనాభా దామాషా ప్రకారం సీట్ల రిజర్వేషన్‌కు మాత్రమే హామీ ఇస్తాయని, కానీ ఒక ప్రత్యేక స్థానాన్ని రిజర్వ్ చేయాలని పట్టుబట్టే హక్కు ఎవరికీ లేదని తేల్చిచెప్పింది. రిజర్వేషన్ల రొటేషన్ విధానాన్ని ఏ పద్ధతిలో, ఏ కాలపరిమితిలో అమలు చేయాలనేది పూర్తిగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాల విచక్షణాధికారమని కోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వ నిర్ణయం రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధంగా లేదని పేర్కొంటూ పిటిషన్‌ను డిస్మిస్ చేసిన ధర్మాసనం, రొటేషన్ విధానాన్ని పునఃపరిశీలించాలని కోరుతూ చట్టప్రకారం ప్రభుత్వానికి వినతిపత్రం ఇచ్చుకునే స్వేచ్ఛ పిటిషనర్‌కు ఉంటుందని తెలిపింది.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

మళ్ళీ మొదటికి వచ్చిన...

కృష్ణా జిల్లా మిల్క్ ప్రొడ్యూసర్స్ కోఆపరేటివ్...

ఎన్విడియా వివాదం వేళ...

అంతర్జాతీయ టెక్నాలజీ, చిప్‌సెట్ రంగాల్లో ప్రముఖ...

కోస్తాంధ్ర తీరాన్ని ఈనెల...

ఇప్పటికే 2 తుపాన్లతో అల్లాడుతున్న ఏపీ...

ఏపీ లిక్కర్ స్కామ్...

ఏపీ రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతున్న...

మేయర్ కుర్చీ.. సీనియర్లకు...

ఒక్క మేయర్ కుర్చీ.. మూడు పార్టీల...

ఎమ్మెల్యే గారూ.. ఓసారి...

మా ఎమ్మెల్యే ఎక్కడున్నారో మీరైనా చెప్పండయ్యా.....

పోల్స్