Friday, November 13, 2026 01:23 PM
Friday, November 13, 2026 01:23 PM

గుజరాత్ ను వీడి హార్దిక్ తప్పు చేసాడా..?

ఐపీఎల్ 2027 రిటెన్షన్ గడువు దగ్గరపడుతున్న వేళ స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్‌ను వీడి పంజాబ్ కింగ్స్ జట్టులోకి మారడం క్రీడా వర్గాల్లో చర్చనీయాంశమైంది. అర్ష్‌దీప్ సింగ్‌తో జరిగిన ట్రేడ్ ఒప్పందంలో భాగంగా హార్దిక్ పంజాబ్ గూటికి చేరగా, గత మూడు సీజన్లుగా ముంబై కెప్టెన్‌గా ఉన్న అతని ప్రయాణం ముగిసింది. గతంలో గుజరాత్ టైటాన్స్‌ను ఛాంపియన్‌గా నిలిపి, ఆపై రన్నరప్‌గా తీర్చిదిద్దిన హార్దిక్, తిరిగి ముంబై ఇండియన్స్‌కు రావడం ఒక భావోద్వేగపూరితమైన తప్పిదమని భారత మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ అభిప్రాయపడ్డాడు.

Also Read : ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే.. మధ్యలో చైర్మన్..!

గుజరాత్‌లో ఒక రాజులా వెలిగిన హార్దిక్, ఆ జట్టును వీడి ముంబైకి రావడం వల్ల తన ఫామ్‌తో పాటు కెప్టెన్సీ ప్రతిష్టను కూడా కోల్పోయాడని, ఆ చేదు అనుభవాన్ని ఎంత త్వరగా మర్చిపోతే అంత మంచిదని కైఫ్ సూచించారు. పంజాబ్ కింగ్స్ జట్టులో శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో హార్దిక్ పాండ్యా కేవలం ఒక ఆటగాడిగా ఆడటం అతనికి ఎంతో మేలు చేస్తుందని కైఫ్ పేర్కొన్నాడు. ఐపీఎల్‌లో ఆల్‌రౌండర్‌గా రాణిస్తూనే కెప్టెన్సీ ఒత్తిడిని తట్టుకోవడం అందరికీ సాధ్యం కాదని, ఇప్పుడు సారథ్య బాధ్యతలు లేకపోవడం వల్ల హార్దిక్ పూర్తిగా తన బ్యాటింగ్, బౌలింగ్, ఫినిషింగ్ నైపుణ్యాలపై దృష్టి పెట్టవచ్చని పేర్కొన్నాడు.

Also Read : పీరియడ్స్ ముందు మహిళలు అస్సలు నిర్లక్ష్యం చేయకూడనివి ఇవే..!

హార్దిక్ ఒక అద్భుతమైన ఆటగాడని, కెప్టెన్సీ భారం తగ్గడం వల్ల అతను తిరిగి తన పాత ఫామ్‌ను అందుకునే అవకాశం ఉందని కైఫ్ అభిప్రాయపడ్డాడు. మరోవైపు, పంజాబ్ కింగ్స్ సహ యజమాని నెస్ వాడియా సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ, సారథ్య బాధ్యతలు లేకపోవడం వల్ల హార్దిక్ తన అత్యుత్తమ ప్రదర్శనను బయటకు తీయగలడని ఆశాభావం వ్యక్తం చేశాడు. ‘శ్రేయస్ నా కెప్టెన్, రికీ నా కోచ్, పంజాబ్ నేను ఆడే జట్టు’ అంటూ హార్దిక్ పెట్టిన పోస్టుపై స్పందించిన వాడియా, మైదానంలో శ్రేయస్ అయ్యర్‌కు, మైదానం వెలుపల తన గురువు లాంటి కోచ్ రికీ పాంటింగ్‌కు హార్దిక్ అనుభవం ఎంతో ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డాడు.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

లోకల్ వార్‌లో మంత్రుల...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో స్థానిక సంస్థల ఎన్నికలు...

లోకేష్ వర్సస్ వైసీపీ.....

మంగళగిరి-తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ఆసక్తికరంగా...

ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే.....

పల్నాడు రాజకీయాలు హాట్ హాట్‌గా మారాయి....

పారిశ్రామిక రంగంలో గేమ్...

విశాఖపట్నంలో జరుగుతున్న 31వ సీఐఐ భాగస్వామ్య...

ఈసీ టార్గెట్ ఆ...

ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగనున్న మిగిలిన పట్టణ...

ఏపీ లిక్కర్ స్కాంలో...

వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో జరిగినట్లు ఆరోపణలు...

పోల్స్