Thursday, November 12, 2026 04:01 PM
Thursday, November 12, 2026 04:01 PM

పారిశ్రామిక రంగంలో గేమ్ ఛేంజర్.. చంద్రబాబు బిగ్ స్టెప్..!

విశాఖపట్నంలో జరుగుతున్న 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సు వేదికగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన పెట్టుబడుల భద్రతా చట్టం ప్రతిపాదన ఇప్పుడు దేశవ్యాప్తంగా పారిశ్రామిక, ఆర్థిక వర్గాల్లో పెను సంచలనంగా మారింది. సాధారణంగా మన దేశంలో ఒక ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాలను, తర్వాత వచ్చే కొత్త ప్రభుత్వం రాజకీయ కక్షలతో రద్దు చేయడం లేదా రాయితీలను నిలిపివేయడం వల్ల పారిశ్రామికవేత్తలు తీవ్ర అభద్రతాభావానికి లోనవుతుంటారు.

Also Read : లోకేష్ కు పవన్ అభినందనలు.. విశాఖలో ఇంట్రస్టింగ్ సీన్..!

ఈ పాలసీ అనిశ్చితికి శాశ్వత ముగింపు పలుకుతూ, ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా పాత ప్రభుత్వ ఒప్పందాలకు చట్టబద్ధమైన రక్షణ కల్పించాలనే ఉద్దేశంతో చంద్రబాబు ఈ చారిత్రక అడుగు వేశారు. ప్రభుత్వం తీసుకురాబోతున్న ఈ చట్టం ప్రధానంగా రెండు కీలక సూత్రాలపై ఆధారపడి పనిచేస్తుంది. మొదటిది సావరిన్ గ్యారెంటీ. అంటే, ఒకసారి రాష్ట్ర ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకుని పరిశ్రమ స్థాపించిన తర్వాత, భవిష్యత్ ప్రభుత్వాలు రాజకీయ కారణాలతో ఆ ఒప్పందాలను ఏకపక్షంగా రద్దు చేయడానికి వీలుండదు. చట్టబద్ధమైన రక్షణ ఉండటం వల్ల పారిశ్రామికవేత్తలు నిర్భయంగా తమ ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్లవచ్చు.

రెండోది, అత్యంత కీలకమైనది ఎస్క్రో ఖాతా విధానం. పరిశ్రమలకు ప్రభుత్వం ప్రకటించిన రాయితీలు సకాలంలో అందక ఏళ్ల తరబడి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఇప్పటివరకు ఉండేది. దీనికి పరిష్కారంగా, రాష్ట్రానికి వచ్చే పన్ను ఆదాయంలో నుండి పరిశ్రమలకు చెల్లించాల్సిన రాయితీల మొత్తాన్ని నేరుగా ఒక ప్రత్యేక ఎస్క్రో ఖాతాలో జమ చేస్తారు. ఒప్పందం ప్రకారం గడువు రాగానే, ఎలాంటి రాజకీయ లేదా అధికారుల జోక్యం లేకుండా ఆటోమేటిక్‌గా బ్యాంకుల ద్వారా పరిశ్రమల ఖాతాల్లోకి ఆ నిధులు విడుదలవుతాయి.

Also Read : వేలానికి ముందు ఢిల్లీ క్యాపిటల్స్‌కు భారీ షాక్..!

మొదట ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఈ బిల్లును ఆమోదించి, రాష్ట్రపతి ఆమోదం కోసం కేంద్రానికి పంపుతామని చంద్రబాబు ప్రకటించారు. అంతేకాకుండా, దేశవ్యాప్తంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించేందుకు కేంద్ర స్థాయిలోనూ ఇటువంటి చట్టం తీసుకురావాలని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్‌ను కోరారు. నిజంగానే ఈ చట్టం అమల్లోకి వస్తే, భారత పారిశ్రామిక రంగంలో ఇది ఒక గేమ్ ఛేంజర్ అవుతుందనడంలో సందేహం లేదు. ఆంధ్రప్రదేశ్ వేసిన ఈ ముందడుగు ఇతర రాష్ట్రాలకు కూడా ఆదర్శంగా నిలిచి, దేశానికే ఒక దిక్సూచిగా మారబోతోంది.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

ఈసీ టార్గెట్ ఆ...

ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగనున్న మిగిలిన పట్టణ...

ఏపీ లిక్కర్ స్కాంలో...

వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో జరిగినట్లు ఆరోపణలు...

ఆ ఎమ్మెల్యేకు రాజకీయ...

తప్పు చేస్తే.. అందుకు శిక్ష వెంటనే...

లోకేష్ కు పవన్...

విశాఖపట్నంలో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న 31వ సీఐఐ...

ఏపీకి భారీ పెట్టుబడుల...

ఆంధ్రప్రదేశ్ క్లీన్ ఎనర్జీ రంగంలో మరో...

జెడ్పీటీసీ ఎన్నికల్లో వాళ్లే...

ఏపీలో జెడ్పీటీసీ ఎన్నికలు ముగిశాయి. మరో...

పోల్స్