Saturday, November 7, 2026 01:41 PM
Saturday, November 7, 2026 01:41 PM

ఆ రూ.14.20 కోట్ల ప్లేయర్‌ను వదలొద్దు..!

ఐపీఎల్ 2027 సీజన్‌కు సంబంధించి రిటెన్షన్ విండో ముగింపు దశకు చేరుకుంటున్న వేళ, ఐదుసార్లు ఛాంపియన్ చెన్నై కీలక నిర్ణయాలపై కసరత్తు చేస్తోంది. ఇటీవల సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో భారీ ట్రేడింగ్ జరిపి లియామ్ లివింగ్ స్టోన్, జాక్ ఎడ్వర్డ్స్‌లను జట్టులోకి తెచ్చుకున్న సీఎస్‌కేకు భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ఒక ఆసక్తికరమైన సలహా ఇచ్చాడు. గత వేలంలో ఏకంగా రూ.14.20 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన యువ ఆల్‌రౌండర్ ప్రశాంత్ వీర్‌ను జట్టులోనే ఉంచుకోవాలని ఆయన అభిప్రాయపడ్డాడు.

Also Read : జగన్‌కు కేసుల భయం.. రాయభారం ఫలిస్తుందా..?

గత ఐపీఎల్ 2026 సీజన్ వేలంలో ప్రశాంత్ వీర్‌ను భారీ ధరతో కొనుగోలు చేసినప్పటికీ, అతనికి కేవలం ఆరు మ్యాచ్‌ల్లోనే ఆడే అవకాశం లభించింది. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లో ఆశించినన్ని అవకాశాలు రాకపోవడంతో అతని భవిష్యత్తుపై సందిగ్ధత నెలకొంది. అయినప్పటికీ ఇర్ఫాన్ పఠాన్ స్పందిస్తూ.. అతను ఖరీదైన ప్లేయర్ అన్న మాట నిజమే, కానీ అతనికున్న ఆల్‌రౌండ్ నైపుణ్యాల దృష్ట్యా మరో సీజన్ పాటు సీఎస్‌కే జర్సీలో చూడటానికి నేను మొగ్గు చూపుతాను అని పేర్కొన్నాడు.

Also Read : చీరాలలో వైసీపీ కొంపముంచిన ఆమంచి..!

ఇదే సమయంలో రూ.5.2 కోట్లు పెట్టి కొన్న లెగ్ స్పిన్నర్ రాహుల్ చాహర్‌ను మాత్రం సీఎస్‌కే వదిలేయాలని పఠాన్ సూచించాడు. మరోవైపు కోల్‌కతా నైట్ రైడర్స్ ఎదుర్కొంటున్న గ్రీన్-పతీరణ సందిగ్ధతపై కూడా ఇర్ఫాన్ మాట్లాడారు. గత వేలంలో రూ.25.20 కోట్లకు కొన్న ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కెమరూన్ గ్రీన్‌ను అతని అరుదైన ప్రతిభ కారణంగా కేకేఆర్ ఖచ్చితంగా రిటైన్ చేసుకోవాలని, కానీ రూ.18 కోట్లు పెట్టి కొని గాయాల బారిన పడుతున్న లంక పేసర్ మతీష పతీరణను మాత్రం ఫిట్‌నెస్ సమస్యల వల్ల వదిలించుకోవడమే మంచిదని పేర్కొన్నాడు. ఐపీఎల్ రిటెన్షన్ గడువు నవంబర్ 17తో ముగియనుండటంతో, లీగ్‌లోని ప్రధాన జట్లు ఇర్ఫాన్ పఠాన్ చెప్పినట్లు బోల్డ్ నిర్ణయాల వైపు వెళ్తాయా లేదా అనేది చూడాలి.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

తెలంగాణ పల్లెలకు డిజిటల్...

తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాలను డిజిటల్‌గా బలోపేతం...

వివాదాస్పదంగా మారిన మేడం...

పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం గిరిజన...

చీరాలలో వైసీపీ కొంపముంచిన...

బాపట్ల జిల్లా చీరాల మున్సిపల్ ఎన్నికల...

అనంతపురంలో టెన్షన్ టెన్షన్.....

రాష్ట్రవ్యాప్తంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ పరిషత్ ఎన్నికల...

అసెంబ్లీ కంటే ఘోరం.....

ఏపీలో మునిసిపల్, కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు...

ఓటర్లకు ఈసీ బిగ్...

ఓటర్ల జాబితా నుంచి పేర్లు గల్లంతైన...

పోల్స్