Saturday, November 7, 2026 11:00 AM
Saturday, November 7, 2026 11:00 AM

అనంతపురంలో టెన్షన్ టెన్షన్.. తోపుదుర్తి సోదరుల సంచలన నిర్ణయం..!

రాష్ట్రవ్యాప్తంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ పరిషత్ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతున్న వేళ ఉమ్మడి అనంతపురం జిల్లాలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. జిల్లాలోని కౌంటింగ్ కేంద్రం వద్ద పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు. రాప్తాడు నియోజకవర్గ పరిధిలోని ఆత్మకూరు జెడ్పీటీసీ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి తరఫున కౌంటింగ్ ఏజెంట్లుగా మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి సోదరులు రంగంలోకి దిగడంతో కౌంటింగ్ హాల్ లోపల, వెలుపల తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

Also Read : జగన్‌కు కేసుల భయం.. రాయభారం ఫలిస్తుందా..?

ఆత్మకూరు జెడ్పీటీసీ కౌంటింగ్ ఏజెంట్లుగా తోపుదుర్తి రాజశేఖర్ రెడ్డి, తోపుదుర్తి చంద్రశేఖర్ రెడ్డి, అలాగే నయనతరెడ్డి నామినేట్ అయ్యారు. రాప్తాడు రాజకీయాల్లో కీలక నేతలుగా ఉన్న తోపుదుర్తి సోదరులు కౌంటింగ్ హాల్‌లోకి ఏజెంట్లుగా రావడంపై స్థానిక కూటమి నాయకత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. కౌంటింగ్ కేంద్రం లోపల వైఎస్సార్‌సీపీ ఏజెంట్లు ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టే చర్యలకు పాల్పడే అవకాశం ఉందంటూ రాప్తాడు కూటమి ఎమ్మెల్యే పరిటాల సునీత స్పష్టం చేశారు.

Also Read : విరాట్ కోహ్లీ డొమెస్టిక్ రీఎంట్రీ.. ఢిల్లీ కోచ్ సంచలన కామెంట్స్..!

ఈ విషయమై ఆమె వెంటనే అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ దృష్టికి తీసుకువెళ్లి, కౌంటింగ్ కేంద్రం వద్ద కఠినమైన భద్రతా చర్యలు తీసుకోవాలని కోరారు. పరిటాల సునీత ఫిర్యాదుతో అలర్ట్ అయిన పోలీస్ యంత్రాంగం కౌంటింగ్ హాల్ వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేసింది. కౌంటింగ్ కేంద్రం పరిసరాల్లో అదనపు బలగాలను మోహరించడంతో పాటు, ఏజెంట్ల కదలికలపై నిఘా ఉంచేందుకు వీలుగా సీసీటీవీ కెమెరాల పర్యవేక్షణను పెంచారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, కౌంటింగ్ ప్రక్రియకు ఎలాంటి ఆటంకం కలగకుండా పోలీసులు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నారు. రాప్తాడు పరిధిలోని పరిషత్ ఫలితాలు వెలువడనున్న తరుణంలో జిల్లా అంతటా ఈ పరిణామాలు తీవ్ర ఉత్కంఠను రేపుతున్నాయి.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

చీరాలలో వైసీపీ కొంపముంచిన...

బాపట్ల జిల్లా చీరాల మున్సిపల్ ఎన్నికల...

అసెంబ్లీ కంటే ఘోరం.....

ఏపీలో మునిసిపల్, కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు...

ఓటర్లకు ఈసీ బిగ్...

ఓటర్ల జాబితా నుంచి పేర్లు గల్లంతైన...

అనంతపురంలో ఏం జరుగుతోంది.....

తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా భావించే అనంతపురం...

పోలవరం ఇప్పట్లో కష్టమేనా..?...

ఆంధ్రప్రదేశ్ జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు...

గుంటూరులో అర్ధరాత్రి హైడ్రామా.....

గుంటూరు సమీపంలోని నల్లపాడు వద్ద స్థానిక...

పోల్స్