Monday, November 2, 2026 06:14 PM
Monday, November 2, 2026 06:14 PM

దిల్లీ ఫ్యాన్స్‌కు షాక్ ఇచ్చిన బీసీసీఐ..!

సొంత గడ్డపై టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఆటను కళ్లారా చూడాలనుకున్న దిల్లీ అభిమానుల ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. ఈ ఏడాది డిసెంబర్ 13 నుంచి భారత్, శ్రీలంక జట్ల మధ్య ప్రారంభం కాబోయే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో తొలి మ్యాచ్ వేదిక మారడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ మ్యాచ్ దిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరగాల్సి ఉంది. అరుణ్ జైట్లీ స్టేడియంలో పిచ్‌లతో పాటు ఔట్‌ఫీల్డ్‌ను పూర్తిగా మార్చేందుకు దిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ వారం రోజుల క్రితమే భారీ పునర్నిర్మాణ పనులను ప్రారంభించింది.

Also Read : జగన్‌కు ఊహించని షాక్.. ఇలా తగులుకున్నా వేంట్రా..!

ప్రస్తుతం దేశంలోని ముల్లాన్‌పూర్, లక్నో వంటి దాదాపు 75 శాతం మైదానాల్లో ఉన్నట్లుగానే ఇక్కడ కూడా సరికొత్తగా ఇసుక ఆధారిత ఔట్‌ఫీల్డ్ ను ఏర్పాటు చేస్తున్నారు. దీనివల్ల వర్షం పడినా మైదానంలో నీటి గుంతలు పడకుండా, కేవలం అరగంట వ్యవధిలోనే మ్యాచ్‌ను మళ్లీ ప్రారంభించేందుకు వీలైన అంతర్జాతీయ స్థాయి డ్రైనేజీ వ్యవస్థ అందుబాటులోకి రానుంది. ఈ అధునాతన పనులు పూర్తి కావడానికి కనీసం నాలుగు నెలల సమయం పడుతుందని డీడీసీఏ వర్గాలు వెల్లడించాయి.

Also Read : ఫస్ట్ సినిమా రాకముందే.. చరణ్ సరసన ఛాన్స్?

దీనికి తోడు దిల్లీలో కాలుష్యాన్ని అదుపు చేసేందుకు ప్రభుత్వం నవంబర్ 1 నుంచి శీతాకాల ఆంక్షలను అమలుల్లోకి తెచ్చింది. దీనివల్ల నిర్మాణ పనుల వేగం మరింత తగ్గే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో, డిసెంబర్ నాటికి స్టేడియం సిద్ధమవడం అసాధ్యమని తేలడంతో భారత్-శ్రీలంక వన్డే వేదికను మార్చక తప్పడం లేదు. నవంబర్ 2026 నాటి అంచనాల ప్రకారం.. ఈ స్టేడియంలో ఐపీఎల్ 2027 సీజన్ కంటే ముందు ఎలాంటి మ్యాచ్‌లు జరిగే అవకాశం లేదు. ఈ స్టేడియం అందుబాటులో లేకపోవడం వల్ల ఇప్పటికే దిల్లీ దేశీయా సీజన్‌పై తీవ్ర ప్రభావం పడింది. దిల్లీ ఆడాల్సిన హోమ్ రంజీ ట్రోఫీ మ్యాచ్‌లను పాలమ్‌లోని ఎయిర్ ఫోర్స్ కాంప్లెక్స్ గ్రౌండ్‌కు తరలించారు. కాగా, దిల్లీ నుంచి తరలిపోతున్న భారత్-శ్రీలంక తొలి వన్డే మ్యాచ్‌కు ఆతిథ్యం ఇచ్చే రేసులో గుజరాత్‌లోని అహ్మదాబాద్ ముందు వరుసలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

తెలంగాణాపై గురిపెట్టిన అమిత్...

తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా గ్రేటర్ హైదరాబాద్...

ఐఏఎస్ అధికారుల చేతికి...

తిరుమల తిరుపతి దేవస్థానం పాలనా వ్యవహారాలపై...

సాయిరెడ్డి కొత్త పార్టీ...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సరికొత్త ప్రత్యామ్నాయ వేదికగా...

30 ఏళ్ల తర్వాత...

కడప జిల్లా రాజకీయాల్లో పులివెందుల నియోజకవర్గం...

ఆ విద్యార్థులకు ధైర్యం...

రాప్తాడు పాఠశాలలో చోటుచేసుకున్న దారుణ ఘటన...

హైదరాబాద్ కి పొంచి...

ఎల్ నినో ప్రభావం.. తగ్గిన వర్షపాతం...

పోల్స్