Friday, October 30, 2026 09:21 PM
Friday, October 30, 2026 09:21 PM

మారుతి సుజుకి క్రేజీ మేడ్ ఇన్ ఇండియా రికార్డ్..!

భారతదేశ ఆటోమొబైల్ రంగానికి సంబంధించి ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఒక చారిత్రాత్మకమైన మైలురాయిని అధిగమించింది. మన దేశంలోనే తయారుచేసిన మారుతి సుజుకి మొదటి గ్లోబల్ ఎలక్ట్రిక్ వెహికల్ ‘ఈ-విటారా’ అంతర్జాతీయ మార్కెట్లో రికార్డులు సృష్టిస్తోంది. ఆగస్టు 2025 నుండి అంతర్జాతీయ షిప్‌మెంట్స్ ప్రారంభించిన మారుతి సుజుకి, కేవలం ఏడాదన్నర లోపే ఏకంగా 50,000 కి పైగా ఎలక్ట్రిక్ కార్ల ఎగుమతులను పూర్తి చేసింది.

Also Read :కష్టకాలంలో ఏపీకి అండగా తెలంగాణ, తమిళనాడు సీఎంలు..!

గుజరాత్‌లోని హంసల్‌పూర్ ప్లాంట్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తయారవుతున్న ఈ ‘ఈ-విటారా’ ఎలక్ట్రిక్ కార్లు ప్రొడక్షన్ పరంగా సరికొత్త రికార్డులను నమోదు చేస్తున్నాయి. కేవలం ఒకే లొకేషన్‌లో ఏడాదికి 10 లక్షల వాహనాలను తయారుచేసే కెపాసిటీ ఉన్న ఈ హంసల్‌పూర్ ఫెసిలిటీ.. గ్లోబల్ వైడ్‌గా సుజుకి సంస్థకు ఉన్న ప్లాంట్లలోనే అతిపెద్ద హబ్‌గా అవతరించింది. ఇందుకోసం మారుతి సుజుకి ఏకంగా రూ. 25,288.7 కోట్ల భారీ ఇన్వెస్ట్‌మెంట్‌ను ఇక్కడ పెట్టింది. ప్రస్తుతం ఇక్కడి నుంచి బ్రిటన్, నార్వే, జర్మనీ, జపాన్, స్విట్జర్లాండ్ వంటి ప్రపంచంలోని దాదాపు 50 దేశాలకు ఈ-విటారా కార్లను ఎగుమతి చేస్తున్నారు.

Also Read : వైసీపీ తుఫాన్ రాజకీయాలు మొదలు..!

సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ అధికారిక డేటా ప్రకారం.. ఏప్రిల్ నుండి సెప్టెంబర్ 2026 మధ్యకాలంలో భారత్ నుంచి జరిగిన మొత్తం ఎలక్ట్రిక్ ప్యాసింజర్ కార్ల ఎగుమతులలో ఒక్క మారుతి సుజుకి సంస్థే ఏకంగా 93 శాతం వాటాను దక్కించుకుని నంబర్ వన్ ఈవీ ఎక్స్‌పోర్టర్‌గా నిలిచింది. యూరప్ మార్కెట్లే దీనికి అతిపెద్ద డెస్టినేషన్‌గా ఉన్నాయి. కేవలం 14 నెలల వ్యవధిలోనే భారత్ లో తయారైన ఎలక్ట్రిక్ కార్లు యూరప్, జపాన్ వంటి కఠినమైన రెగ్యులేటరీ మరియు క్వాలిటీ డిమాండ్స్ ఉన్న దేశాలను మెప్పించడం విశేషం. ప్రపంచవ్యాప్తంగా 100 కి పైగా దేశాలలో ఈ మోడల్‌ను లాంచ్ చేయడమే మారుతి సుజుకి తదుపరి లక్ష్యంగా పెట్టుకుంది.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

వైసీపీ తుఫాన్ రాజకీయాలు...

ఏపీలో అర్నబ్ తుఫాన్ బీభత్సం సృష్టించింది....

మున్సిపల్ పోరు వేళ...

ఏపీలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల పోలింగ్...

టోల్‌ప్లాజా వాహనదారులకు కేంద్రం...

జాతీయ రహదారులపై ప్రయాణించే స్థానిక వాహనదారులకు...

ఏపీ ఎన్నికల సంఘం...

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను...

ఏపీకి మరో ముప్పు.....

ఆంధ్రప్రదేశ్‌ను ఇటీవల వణికించిన అర్నబ్ తుఫాను...

ఏపీ, తెలంగాణ.. సర్...

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా దేశంలోని 6...

పోల్స్