ఏపీలో అర్నబ్ తుఫాన్ బీభత్సం సృష్టించింది. ముఖ్యంగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాతో పాటు శ్రీకాకుళం జిల్లా, విశాఖ జిల్లాపై తీవ్ర ప్రభావం చూపించింది. ఎడతెరపి లేని వర్షం, ఈదురుగాలులతో ప్రజా జీవనం అస్తవ్యస్తమైంది. భారీ చెట్లు నెలకొరిగాయి. విద్యుత్ స్తంభాలు నేల కూలాయి. భారీగా పంట నష్టం జరిగింది. ఏపీ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టింది. తుఫాన్ తీరం దాటిన రెండు గంటల్లోనే భారీ వర్షం సైతం లెక్క చేయకుండా.. అధికారులు, సిబ్బంది రంగంలోకి దిగారు. ముందుగా విరిగిన చెట్లు, స్తంభాలను తొలగించి.. విద్యుత్ సరఫరా పునరుద్ధరణపై దృష్టి సారించారు. అదే సమయంలో తుఫాన్ బాధితులకు సాయం అందించేందుకు కూడా ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేశారు.
Also Read : కష్టకాలంలో ఏపీకి అండగా తెలంగాణ, తమిళనాడు సీఎంలు..!
ప్రజలు కష్టాల వరదలో ఉంటే భుజం మీద చెయ్యి వేసి నేను ఉన్నాననే భరోసా ఇచ్చారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఇప్పటికే ఏరియల్ సర్వేతో పాటు నేరుగా రైతులతో చర్చించారు. వారికి ప్రభుత్వం సాయం చేస్తుందని హామీ ఇచ్చారు. వరద ఉద్ధృతి తగ్గే వరకు ప్రజలకు సహాయక చర్యలు అందాలని అధికారులను ఆదేశించారు. అదే సమయంలో ఏపీలో తుపాను వల్ల జరిగిన నష్టంపై కేంద్ర ప్రభుత్వానికి ప్రాధమిక నివేదిక అందించారు. సాయం చేయాలని కేంద్రాన్ని కోరారు. ఏపీలో సహాయక చర్యలకు తమ వంతు సాయం అందించేందుకు పొరుగున ఉన్న తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ముందుకు వచ్చారు. సిబ్బందిని పంపేందుకు అంగీకరించారు.
అయితే ఒక వైపు తుఫాన్ వల్ల ప్రజలు తీవ్రంగా నష్టపోయి తీవ్ర ఇబ్బందులు పడుతుంటే.. ఇలాంటి సమయంలో సాయం చేయాల్సిన నేతలు.. రాజకీయ విమర్శలు చేస్తున్నారు. ఏపీ సర్కార్ చేస్తున్న మంచిని ఏ మాత్రం అంగీకరించలేని వైసీపీ నేతలు.. ప్రభుత్వంపై బురద జల్లేందుకు మాత్రం వెనుకాడటం లేదు. సందట్లో సడేమియా అన్నట్లుగా కూటమి ప్రభుత్వంపై రాళ్లు వేసేందుకు తెగ ప్రయత్నం చేస్తున్నారు. అయితే వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలు వారికే బూమ్ రాంగ్ మాదిరిగా గట్టిగా తగులుతున్నాయి.
Also Read : ఏపీకి మరో ముప్పు.. ఆ జిల్లాలకు భారీ వర్షాల హెచ్చరిక..!
తుఫాన్ కారణంగా సముద్రంలో అలలు ఎగసిపడ్డాయి. దీని వల్ల కోనసీమలో ఉప్పాడ తీవ్ర ప్రాంతం తీవ్రంగా దెబ్బతిన్నది. అయితే.. ఇదే అవకాశం అన్నట్లుగా వైసీపీ అభిమాన సోషల్ మీడియా మేధావులు.. రంగంలోకి దిగారు. కోట్లు ఖర్చు పెట్టి వేసిన రహదారి ఏడాదిలోనే కొట్టుకుపోయిందంటే.. ఎంత నాసిరకంగా వేశారో అర్థమవుతుంది.. ఇదేనా పల్లె పండుగ నిధుల వినియోగం.. అని వీడియోలు పోస్టు చేస్తున్నారు. కొందరైతే.. రోడ్ల పేరుతో ప్రజల డబ్బులను స్వాహా చేశారంటూ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. అయితే ఈ వీడియోలకు, ఆరోపణలకు ప్రజలు గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు. తుఫాన్ వచ్చినప్పుడు హైవేలు కూడా కొట్టుకుపోతాయని.. ఆ విషయం కూడా తెలియకుండా ఎలా ఉన్నారని నిలదీస్తున్నారు.
ఇక కొందరైతే.. అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరలోనే రహదారులు నిర్మించడం, మరమ్మతులు చేపట్టడం చేశారని.. మరి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని కిలోమీటర్ల కొత్త రహదారి నిర్మించారో చెప్పగలరా అని నిలదీస్తున్నారు. ఇక కొందరైతే.. జగనన్న కాలనీ పేరుతో చెరువులను కబ్జా చేసి.. వాటిని పేదలకు పంచిపెట్టారు. మరి అవి మునిగిపోయిన వీడియోలు కావాలా.. అని సెటైర్లు వేస్తున్నారు. ఏది ఏమైనా.. మొత్తానికి ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల దూకుడుకు బ్రేకులు వేయలేని వైసీపీ.. ఇలా తుఫాన్ సహాయక చర్యలపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు.


