ప్రముఖ బాలీవుడ్ సెలబ్రిటీ టాక్ షో కాఫీ విత్ కరణ్ సీజన్ 9 లో తన భర్త విజయ్ దేవరకొండతో కలిసి పాల్గొన్న నటి రష్మిక మందన్నా.. షో ప్రసారమైన తర్వాత సోషల్ మీడియాలో వ్యక్తమవుతున్న విమర్శలపై తీవ్రంగా స్పందించారు. ఈ షోలో రష్మిక తానే స్వయంగా విజయ్‌కు ఏడాది పాటు వరుసగా పెళ్లి ప్రపోజల్స్ చేశానని, దానికి విజయ్ స్పందిస్తూ “నువ్వు వందసార్లు అడిగితేనే ఒప్పుకుంటా” అని సరదాగా అన్నట్లు ఒక ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు. అయితే, ఈ ముచ్చటను కొందరు నెటిజన్లు తప్పుగా అర్థం చేసుకుని, విజయ్ దేవరకొండపై అహంకారి అంటూ, రష్మికను తక్కువ చేసి మాట్లాడారంటూ నెగిటివ్ కామెంట్లు, ట్రోలింగ్ మొదలుపెట్టారు.
Also Read : తాడిపత్రిలో పీక్కు చేరిన పొలిటికల్ హీట్..!
ఈ నేపథ్యంలో రష్మిక ఇన్‌స్టాగ్రామ్‌లో మై లవ్లీ పీపుల్ ఆఫ్ ది ఇంటర్నెట్.. అంటూ ఒక సుదీర్ఘమైన నోట్‌ను షేర్ చేస్తూ ట్రోలర్ల నోళ్లు నొక్కారు. నెటిజన్ల నుంచి వస్తున్న పనికిరాని సలహాలు, కామెంట్లపై రష్మిక తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. “సాధారణంగా నేను ఇలాంటి విషయాలపై స్పందించను, ఎందుకంటే ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయి. కానీ మా ఇంటర్వ్యూ తర్వాత నెటిజన్లు ప్రవర్తిస్తున్న తీరు అభిప్రాయాలు చెప్పేలా లేదు, కేవలం ఒకరిపై కోపాన్ని వెళ్లగక్కే గుంపులా కనిపిస్తోంది” అని ఆమె ఘాటుగా పేర్కొన్నారు. ఆ ఇంటర్వ్యూలో తాము మాట్లాడుకున్న అసలు పాయింట్‌ను వదిలేశారని విమర్శించారు.
“నేను ఎన్నిసార్లు అడిగాను, విజయ్ ఎంత సమయం తీసుకున్నాడు అనే నంబర్ల దగ్గరే కొందరు స్ట్రక్ అయిపోయారు. అవును.. ఆ సంభాషణ నిజంగానే జరిగింది. కానీ మాలో ఎవరూ ఒక గ్రాండ్ ప్రపోజల్ కోసం ఎదురుచూడలేదు” అని రష్మిక క్లారిటీ ఇచ్చారు. తామిద్దరి మధ్య జరిగిన సంభాషణ పరస్పరం ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి సంబంధించినదని రష్మిక స్పష్టం చేశారు. జీవితంలో వచ్చే ఒడిదుడుకులు, ఒత్తిడి, సంతోషాలను ఎదుర్కొంటూ కలిసి బతకడానికి ఒకరికొకరు సమయం, స్పేస్ ఇచ్చుకున్నామని వివరించారు.
Also Read : పోస్టల్ బ్యాలెట్లపై ఎస్ఈసీ కీలక ఉత్తర్వులు..!
“ఇదే మాకు సరైన సమయం అనిపించింది. అందుకే మేము ఒకరినొకరం ఎంచుకున్నాం. ప్రేమను నమ్మే వారిని కాపాడటానికే నేను ఈ పోస్ట్ రాస్తున్నాను” అని రష్మిక ఎమోషనల్ అయ్యారు. జీవితాంతం ఇతరులపై విషం చిమ్మే వారికి తన పోస్ట్ ద్వారా గట్టి సమాధానమే ఇచ్చారు. తమ వ్యక్తిగత జీవితాన్ని, టైమ్‌లైన్‌ను జడ్జ్ చేయడం ఆపాలని, అనవసరమైన వ్యాఖ్యలు చేయవద్దని నేషనల్ క్రష్ నెటిజన్లను హెచ్చరించారు.


