భారత టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ యువ బ్యాటింగ్ సంచలనం వైభవ్ సూర్యవంశీ టీమ్ ఎంట్రీపై కీలక వ్యాఖ్యలు చేశారు. న్యూజిలాండ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభం కానున్న నేపథ్యంలో జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో అతను మాట్లాడాడు. ప్రస్తుతం జట్టులో ఉన్న ఓపెనర్లు అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ అత్యంత స్థిరమైన ప్రదర్శనతో దూసుకుపోతున్నారని, అందువల్ల వైభవ్ సూర్యవంశీ ఇప్పుడే నేరుగా ప్లేయింగ్ ఎలెవెన్‌లోకి వాక్ ఇన్ అవ్వడం సాధ్యం కాదని అయ్యర్ స్పష్టం చేశాడు.
Also Read : SBI ఖాతాదారుల డేటా లీక్ కలకలం.. అసలేం జరిగింది..?
భారత్ ఈ ఏడాది టీ20 వరల్డ్ కప్ టైటిల్‌ను విజయవంతంగా డిఫెండ్ చేసుకోవడంలో అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ కీలక పాత్ర పోషించారని శ్రేయస్ అయ్యర్ గుర్తు చేశాడు. వైభవ్ సూర్యవంశీ లాంటి అద్భుతమైన టాలెంట్ ఉన్న ఆటగాడు డ్రెస్సింగ్ రూమ్ వాతావరణంలో సంతోషంగా గడపడం, సీనియర్ల నుంచి నేర్చుకోవడం ప్రస్తుతానికి చాలా ముఖ్యమని కెప్టెన్ అభిప్రాయపడ్డాడు. “అతను ఇంకా చాలా చిన్నవాడు. భవిష్యత్తులో అతనికి బోలెడన్ని అవకాశాలు వస్తాయి. అంతేకానీ ఓపెనర్లు సెటిల్ అయి, వరల్డ్ కప్ గెలిపించి ఉన్న తరుణంలో అతను ఇప్పుడే జట్టులోకి వచ్చేయడం కుదరదు” అని అయ్యర్ కుండబద్దలు కొట్టాడు.
Also Read : సుప్రీం తీర్పు పై వైసీపీ ఫేక్ ప్రచారం..!
అయితే, వైభవ్‌కు ఈ విదేశీ పర్యటన ద్వారా లభిస్తున్న ఎక్స్పోజర్ అతని కెరీర్‌కు ఎంతో ప్లస్ అవుతుందని అయ్యర్ పేర్కొన్నాడు. న్యూజిలాండ్ లాంటి ఫాస్ట్ బౌలింగ్‌కు అనుకూలించే విదేశీ పిచ్‌లు, అక్కడి చలి వాతావరణంలో ఎలా ఆడాలో అతనికి ఒక స్పష్టమైన అవగాహన వస్తుందని చెప్పాడు. దీనివల్ల నెక్స్ట్ టైమ్ ఇక్కడికి వచ్చినప్పుడు అతను పూర్తి సన్నద్ధతతో ఉండటమే కాకుండా, తొలిసారి పర్యటించే ఇతర యువ ఆటగాళ్లకు కూడా గైడెన్స్ ఇవ్వగలడని అయ్యర్ విశ్వాసం వ్యక్తం చేశాడు.


