Wednesday, October 21, 2026 08:57 PM
Wednesday, October 21, 2026 08:57 PM

SBI ఖాతాదారుల డేటా లీక్ కలకలం.. అసలేం జరిగింది..?

దేశంలోనే అత్యంత పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాదారుల డేటా లీక్ అయిందనే వార్త దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. సిరియసిమ్ అనే హ్యాకర్ గ్రూప్ ఎస్బీఐకి చెందిన వేలాది మంది ఖాతాదారుల అత్యంత వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించి, డార్క్ వెబ్ ఫోరమ్స్‌లో విక్రయానికి పెట్టినట్లు ప్రాథమిక సమాచారం బయటకు వచ్చింది. ఈ సైబర్ సెక్యూరిటీ ఉల్లంఘనపై దేశంలోని అగ్రశ్రేణి సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ అయిన ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ తో పాటు డిఫెన్స్ సైబర్ ఏజెన్సీ, థ్రెట్ ఇంటెలిజెన్స్ విభాగాలు స్పందించి, ఎస్బీఐ యాజమాన్యానికి ముందస్తు హెచ్చరికలు జారీ చేశాయి.

Also Read : పల్నాడు పాలిటిక్స్‌లో హైటెన్షన్.. అజ్ఞాతంలోకి మాజీ ఎమ్మెల్యే..!

హ్యాకర్లు డార్క్ వెబ్‌లో భారీగా రికార్డులను ఉంచినట్లు క్లెయిమ్ చేసినప్పటికీ, ఎస్బీఐ తన ప్రాథమిక విశ్లేషణలో దాదాపు 3,897 మంది ఖాతాదారుల రికార్డులు మాత్రమే లీక్ అయినట్లు గుర్తించింది. లీక్ అయిన సమాచారంలో ఖాతాదారుల పేర్లు, మొబైల్ నంబర్లు, ఈమెయిల్ ఐడీలు, పుట్టిన తేదీలు, నివాస చిరునామాలతో పాటు లోన్ రికార్డులు మరియు కొన్ని మెటాడేటా ఫైల్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ డేటా లీక్ ఏ విధంగా జరిగింది, బ్యాంక్ అంతర్గత సర్వర్ల ద్వారా జరిగిందా లేదా ఏదైనా థర్డ్ పార్టీ లోన్ వెండర్ యాప్స్ ద్వారా బయటకు వెళ్ళిందా అనే కోణంలో సైబర్ సెక్యూరిటీ నిపుణులతో బ్యాంక్ సమగ్ర విచారణను జరిపిస్తోంది.

Also Read : సుప్రీం తీర్పు పై వైసీపీ ఫేక్ ప్రచారం..!

ఈ సైబర్ ఇన్సిడెంట్ వల్ల బ్యాంక్ రోజువారీ కార్యకలాపాలకు గానీ, సాధారణ సేవలకు గానీ ఎటువంటి విఘాతం కలగలేదని ఎస్బీఐ స్పష్టం చేసింది. బ్యాంక్ ఆర్థిక పనితీరుపై లేదా బిజినెస్ కంటిన్యూటీపై దీని ప్రభావం ఏమాత్రం లేదని, ఖాతాదారుల అకౌంట్లు సురక్షితంగానే ఉన్నాయని యాజమాన్యం భరోసా ఇచ్చింది. అయితే, కస్టమర్ల వ్యక్తిగత సమాచారం డార్క్ వెబ్‌లో ఉన్నందున బ్యాంక్ అధికారుల పేరుతో వచ్చే నకిలీ ఫోన్ కాల్స్, ఓటీపీల అభ్యర్థనల పట్ల ఖాతాదారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

రాచమల్లు.. బరితెగింపు అంటే...

"రాజకీయాల్లో మరీ బరితెగించారు.. ఎంత దారుణమంటే.....

బ్రేకింగ్: ఏపీ ఎన్నికల...

ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో అత్యున్నత...

మంత్రి నియోజకవర్గంలో కూటమికి...

మంత్రి గుమ్మడి సంద్యారాణి ప్రాతినిధ్యం వహిస్తున్న...

పల్నాడు పాలిటిక్స్‌లో హైటెన్షన్.....

పల్నాడు జిల్లా నరసరావుపేట రాజకీయాల్లో మరోసారి...

తాడేపల్లిలో జగన్ ఎమర్జెన్సీ...

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ...

సుప్రీం తీర్పు పై...

ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల చుట్టూ జరుగుతున్న...

పోల్స్