Wednesday, October 21, 2026 08:53 PM
Wednesday, October 21, 2026 08:53 PM

బ్రేకింగ్: ఏపీ ఎన్నికల కమీషన్ సంచలన నిర్ణయం..!

ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేయడంతో రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని 19 మున్సిపాలిటీల్లో నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు, ఈ నెల 25వ తేదీ వరకు అభ్యర్థుల తుది జాబితాను ప్రకటించవద్దని స్పష్టం చేసింది. న్యాయస్థానం ఆదేశాల నేపథ్యంలో, ఈ 19 మున్సిపాలిటీల్లో నామినేషన్ల ఉపసంహరణతో పాటు అభ్యర్థుల తుది జాబితా ప్రకటనను ఎస్‌ఈసీ తాత్కాలికంగా హోల్డ్‌లో పెట్టింది.

Also Read : మంత్రి నియోజకవర్గంలో కూటమికి రెబల్స్ తలనొప్పి..!

అలాగే, నామినేషన్ల దాఖలుకు నో డ్యూస్ సర్టిఫికెట్లు అవసరం లేదని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఎన్నికలు అత్యంత పారదర్శకంగా, శాంతియుత వాతావరణంలో జరగాలని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. నామినేషన్లు వేయలేకపోయిన అభ్యర్థుల విజ్ఞప్తులను, అందుబాటులో ఉన్న ఆధారాలను బట్టి కేస్-టు-కేస్ ప్రాతిపదికన రాష్ట్ర ఎన్నికల సంఘమే స్వయంగా పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని సూచించింది. హింస జరిగినట్లు ఫిర్యాదులు వచ్చిన సదరు 19 మున్సిపాలిటీల్లో నామినేషన్ల గడువు పెంపు లేదా మళ్లీ నామినేషన్లు వేసే అవకాశంపై సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను పూర్తిగా పరిశీలించిన తర్వాతే ఎస్‌ఈసీ తదుపరి చర్యలు తీసుకోనుంది.

Also Read : తాడేపల్లిలో జగన్ ఎమర్జెన్సీ మీటింగ్.. సంచలన నిర్ణయం..?

మరోవైపు విపక్ష వైసీపీ అభ్యర్థుల భద్రతపై కూడా సుప్రీంకోర్టు గట్టి ఆదేశాలు జారీ చేసింది. పోటీ చేసే అభ్యర్థులందరికీ తగిన రక్షణ కల్పించాలని సంబంధిత జిల్లాల ఎస్పీలను న్యాయస్థానం ఆదేశించింది. అంతేకాకుండా, స్థానిక సంస్థల పరిధిలో ఇబ్బందులు ఉంటే జిల్లా కేంద్రాల్లో కలెక్టర్లే నేరుగా నామినేషన్లను స్వీకరించాలని ఆదేశించడంతో ఎన్నికల ప్రక్రియలో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. సుప్రీంకోర్టు తుది ఆదేశాల కాపీని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ఆయా మున్సిపాలిటీల్లో ఎన్నికల తదుపరి షెడ్యూల్‌పై ఎస్‌ఈసీ ఒక స్పష్టత ఇవ్వనుంది.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

రాచమల్లు.. బరితెగింపు అంటే...

"రాజకీయాల్లో మరీ బరితెగించారు.. ఎంత దారుణమంటే.....

మంత్రి నియోజకవర్గంలో కూటమికి...

మంత్రి గుమ్మడి సంద్యారాణి ప్రాతినిధ్యం వహిస్తున్న...

SBI ఖాతాదారుల డేటా...

దేశంలోనే అత్యంత పెద్ద ప్రభుత్వ రంగ...

పల్నాడు పాలిటిక్స్‌లో హైటెన్షన్.....

పల్నాడు జిల్లా నరసరావుపేట రాజకీయాల్లో మరోసారి...

తాడేపల్లిలో జగన్ ఎమర్జెన్సీ...

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ...

సుప్రీం తీర్పు పై...

ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల చుట్టూ జరుగుతున్న...

పోల్స్