ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ ఎన్నికల చుట్టూ జరుగుతున్న పరిణామాలు ఇప్పుడు సుప్రీం కోర్ట్ వేదికగా ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. రాష్ట్రంలోని 19 మున్సిపాలిటీల్లో నామినేషన్ల గడువును సుప్రీంకోర్టు నేరుగా పొడిగించేసిందంటూ వైసీపీ శ్రేణులు, వారి అనుకూల మీడియా చేస్తున్న ప్రచారాన్ని న్యాయ వర్గాలు, కూటమి నేతలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన మార్గదర్శకాలను పూర్తిగా వక్రీకరిస్తూ, తమకు అనుకూలమైన తీర్పు వచ్చేసిందంటూ ప్రతిపక్ష పార్టీ సరికొత్త రాజకీయ డ్రామాలకు తెరతీసిందని వారు ఆరోపిస్తున్నారు.
Also Read : ఈ ఎన్నికలు జగన్కు రిఫరెండమే..!
నిజానికి సుప్రీంకోర్టు నామినేషన్ల గడువును పెంచుతూ ఆదేశాలు ఇచ్చినట్లు వైసీపీ ప్రచారం మొదలుపెట్టింది. అయితే సుప్రీం కోర్ట్ ఎలాంటి ప్రత్యక్ష ఆదేశాలు ఇవ్వలేదని, బార్ అండ్ బెంచ్, లైవ్ లా సోషల్ మీడియా పోస్ట్ లు గమనిస్తే పరిశీలిస్తే అసలు వాస్తవాలు స్పష్టమవుతాయని పరిశీలకులు సూచిస్తున్నారు. హింసతో పాటుగా నామినేషన్ లను అడ్డుకునే ప్రయత్నాలు జరిగాయని.. వైసీపీ అభ్యంతరాలు లేవనెత్తిన చోట్ల.. వారి ఫిర్యాదులను రేపటిలోగా మరోసారి పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని మాత్రమే సుప్రీంకోర్టు రాష్ట్ర ఎన్నికల సంఘానికి సూచించింది. సదరు వివాదాస్పద ప్రాంతాల్లో మళ్లీ నామినేషన్లు తీసుకోవాలా వద్దా అనే అంశాన్ని, గడువు పొడిగింపు నిర్ణయాన్ని సుప్రీంకోర్టు పూర్తిగా ఎస్ఈసీ విచక్షణకే వదిలివేసింది.
Also Read : ఈ ఎన్నికలు జగన్కు రిఫరెండమే..!
వాస్తవాలు ఇలా ఉంటే, క్షేత్రస్థాయిలో కూటమి హవాను తట్టుకోలేక, అభ్యర్థులు దొరకని తమ బలహీనతను కప్పిపుచ్చుకోవడానికి వైసీపీ కోర్టు ఆదేశాలను వక్రీకరిస్తోందని అధికార పక్షం మండిపడుతోంది. నామినేషన్ల ప్రక్రియపై గానీ, ఎన్నికల నిర్వహణపై గానీ సుప్రీంకోర్టు ఎటువంటి అభ్యంతరాలు వ్యక్తం చేయలేదని, కేవలం అభ్యర్థుల తుది జాబితా ప్రచురణను అక్టోబర్ 25 వరకు వాయిదా వేయమని మాత్రమే చెప్పిందని స్పష్టం చేస్తున్నారు. కోర్టు కేవలం ఫిర్యాదులను పరిశీలించమని చెబితే, ఏకంగా గడువు పెంచేసిందంటూ సొంత మీడియా ద్వారా వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను, తమ క్యాడర్ను తప్పుదోవ పట్టిస్తోందని కూటమి నేతలు విమర్శిస్తున్నారు.


