Monday, October 26, 2026 01:01 PM
Monday, October 26, 2026 01:01 PM

తెలంగాణా బీజేపిలో ఏం జరుగుతోంది..?

తెలంగాణ రాష్ట్ర బీజేపీ అగ్ర నాయకత్వం హుటాహుటిన దేశ రాజధాని ఢిల్లీకి పయనమైంది. బీజేపీ అధిష్టానం నుంచి వచ్చిన అత్యవసర పిలుపు మేరకు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, పార్టీ జాతీయ అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్ ఆదివారం ఢిల్లీకి చేరుకున్నారు. ఈ రోజు సాయంత్రం కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్‌లతో ఈ ముగ్గురు నేతలు ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. రాష్ట్రంలో రానున్న రోజుల్లో పార్టీ చేపట్టబోయే ప్రజా పోరాటాలు, సంస్థాగత మార్పులపై ఈ భేటీలో హైకమాండ్ దిశానిర్దేశం చేయనుంది.

Also Read : విడదల రజినికి ఊహించని షాక్.. పాపం..!

రాబోయే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలను కమలనాథులు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో సాధించిన సానుకూల ఫలితాలను ఈసారి మరింత మెరుగుపరుచుకుని, హైదరాబాద్ గడ్డపై భేషరతుగా పీఠం కైవసం చేసుకోవడమే లక్ష్యంగా బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. నగరంలో బలమైన క్యాడర్ కలిగిన బండి సంజయ్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి లాంటి నేతలను ముందుంచి, గ్రేటర్ వ్యాప్తంగా భారీ ఎత్తున రోడ్‌షోలు, ప్రజా సమస్యలపై ఆందోళన కార్యక్రమాలను రూపొందించేలా ఢిల్లీ పెద్దలు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు భోగట్టా.

Also Read : డాలర్ కలకు గుడ్‌బై! టెకీల చూపు భారత్‌ వైపు!

ఇక ఈ తాజా సమీకరణాల వెనుక ప్రధానంగా ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక టార్గెట్ స్పష్టంగా కనిపిస్తోంది. ఇక్కడ ఉపఎన్నిక అనివార్యం కాబోతుండటంతో.. ఎలాగైనా ఖైరతాబాద్‌లో కాషాయ జెండా ఎగరేయాలని బీజేపీ పట్టుదలతో ఉంది. ఇప్పటికే బండి సంజయ్ ఈ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించి, కాంగ్రెస్ ముస్లిం ఓట్ల సమీకరణాలతో గెలవాలని చూస్తోందని, కానీ ఇక్కడి మెజారిటీ హిందూ ఓటర్లను తమ వైపు తిప్పుకునే సత్తా బీజేపీకి ఉందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఖైరతాబాద్ ఉపఎన్నికలో విజయమే రాబోయే గ్రేటర్ ఎన్నికలకు దిక్సూచి అవుతుందని భావిస్తున్న కమలదళం, అందుకు తగ్గ ఆర్థిక, రాజకీయ వ్యూహాలపై అమిత్ షాతో సుదీర్ఘంగా చర్చించనున్నట్లు సమాచారం.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

దూసుకొస్తున్న అర్నాబ్.. కోస్తాంధ్రకు...

బంగాళాఖాతంలో ఏర్పడిన అర్నాబ్ తుఫాన్ ఆంధ్రప్రదేశ్...

కడపలో స్టోరీ క్లోజ్..?...

ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్, నగర పంచాయతీ చైర్‌పర్సన్...

విడదల రజినికి ఊహించని...

ఊహించని షాక్ తగిలింది. రెండు రోజుల...

డాలర్ కలకు గుడ్‌బై!...

ఓవైపు వీసా అనిశ్చితి, ఉద్యోగాల కోతలు.....

ఉమ్మడి ఆస్తిని నాది...

మాజీ సీఎం జగన్, ఆయన సోదరి...

షర్మిలకు జగన్ వివాదాస్పద...

బెంగళూరులోని వైయస్ కుటుంబానికి చెందిన ప్రతిష్టాత్మక...

పోల్స్