Sunday, October 25, 2026 06:31 AM
Sunday, October 25, 2026 06:31 AM

ఈరోజు రాశి ఫలితాలు (25-10-2026)

శ్రీ పరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, ఆశ్వయుజ మాసం, శుక్ల పక్షం.. 25-10-2026 నాడు మీ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి అనుకుంటున్నారా, అయితే ఆ వివరాలు మీకోసం. మీ గ్రహాల ప్రభావం ఎలా ఉందో చెక్ చేసుకోండి..

మేషం

కొన్ని పనులు వాయిదా పడతాయి. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. నూతన ఋణాలు చేస్తారు. ఉద్యోగాలలో స్థానచలన సూచనలున్నవి. జీవిత భాగస్వామితో చిన్నపాటి మాటపట్టింపులుంటాయి. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారించడం మంచిది. దూరప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది.
—————————————

వృషభం

కొన్ని వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. నూతన విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. విలువైన వస్తు, వస్త్ర లాభాలు పొందుతారు. వ్యాపార, ఉద్యోగాలలో సమస్యలు తొలగుతాయి. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.
—————————————

మిధునం

దూరపు బంధువుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. రాజకీయ సంబంధిత సభ, సమావేశాలలో పాల్గొంటారు. మొండి బాకీలు వసూలవుతాయి.
—————————————

కర్కాటకం

గృహమున ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటుచేసుకుంటాయి. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమౌతాయి. వ్యాపారాలు గతం కంటే మెరుగవుతాయి. ఉద్యోగాలలో పనిభారం తగ్గుతుంది. ఆప్తుల నుండి శుభవార్తలు అందుతాయి. చిన్ననాటి మిత్రులతో విందువినోద కార్యక్రమాలలో పాల్గొంటారు.
—————————————

సింహం

కుటుంబ సభ్యులతో చర్చలు సఫలమౌతాయి. వ్యాపారమున స్వంత నిర్ణయాలతో ముందుకు సాగడం మంచిది. రావలసిన సొమ్ము సకాలంలో చేతికందుతుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. బంధువులతో మాటపట్టింపులు తొలగుతాయి.
—————————————

కన్య

ఆలయ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. చేపట్టిన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. విందువినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. చిన్ననాటి విషయాలు జ్ఞాప్తికి వస్తాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధువులతో సఖ్యత కలుగుతుంది.
—————————————

తుల

ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ఇంటాబయట సమస్యాత్మక వాతావరణం ఉంటుంది. చేపట్టిన పనులలో శ్రమకు తగిన ఫలితం కనిపించదు. వ్యాపార, ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులుంటాయి. దీర్ఘకాలిక ఋణ ఒత్తిడి పెరుగుతుంది. దూరప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది.
—————————————

వృశ్చికం

దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. నూతన వ్యక్తుల పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో మీ విలువ మరింత పెరుగుతుంది. నూతన వాహనయోగం ఉన్నది. భూవివాదాలు పరిష్కారమౌతాయి. విద్యార్థులకు అనుకూల ఫలితాలు ఉంటాయి.
—————————————

ధనస్సు

కొన్ని వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. సోదరులతో సఖ్యత లోపిస్తుంది. కుటుంబ సభ్యులతో కొద్దిపాటి సమస్యలు ఉంటాయి. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు తప్పవు. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. దైవచింతన పెరుగుతుంది. బంధు మిత్రులతో అకారణ వివాదాలుంటాయి.
—————————————

మకరం

చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో సమస్యలు పరిష్కారమౌతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ధన, వస్తువులు బహుమతులుగా పొందుతారు.
—————————————

కుంభం

వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహంగా సాగుతాయి. సంఘంలో గౌరవ మర్యాదలకు లోటుండదు. సన్నిహితులతో సఖ్యత కలుగుతుంది. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. విందువినోద కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన పనులలో యత్నకార్యసిద్ధి కలుగుతుంది.
—————————————

మీనం

వృత్తి వ్యాపారలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. చేపట్టిన వ్యవహారాలు మందగిస్తాయి. బంధువులతో తగాదాలు చికాకు పరుస్తాయి. ఉద్యోగాలలో అధికారులతో ఊహించని సమస్యలు కలుగుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. నూతన ఋణాలు చేస్తారు.
—————————————

గమనిక : ఈ ఆర్టికల్‌లో అందించిన జ్యోతిష్య సమాచారం, వార్షిక ఫలాలు, పరిహారాలన్నీ జ్యోతిష్యశాస్త్రం, హిందూ మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇది అందుబాటులో ఉన్న సమాచారం మేరకు అవగాహన కొరకు ఇవ్వబడింది. ఏదైనా నిర్ణయాలు తీసుకునే ముందు జ్యోతిష్య పండితులను సంప్రదించండి.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

ఉమ్మడి ఆస్తిని నాది...

మాజీ సీఎం జగన్, ఆయన సోదరి...

షర్మిలకు జగన్ వివాదాస్పద...

బెంగళూరులోని వైయస్ కుటుంబానికి చెందిన ప్రతిష్టాత్మక...

లోపల అసంతృప్తి.. పైకి...

కొందరు పార్టీ నిర్ణయానికి కట్టుబడి అధికారిక...

కారు పార్టీలో అంతర్గత...

కారు పార్టీలో అంతర్గత విభేదాలు.. ఆధిపత్య...

జగన్ పై చంద్రబాబు...

ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల సమరం...

రెబల్స్‌పై టీడీపీ సర్జికల్...

ఆంధ్రప్రదేశ్‌ స్థానిక సంస్థల ఎన్నికల సమరం...

పోల్స్