Saturday, October 24, 2026 01:34 PM
Saturday, October 24, 2026 01:34 PM

జగన్ పై చంద్రబాబు సంచలన కామెంట్స్..!

ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల సమరం కీలక దశకు చేరుకున్న వేళ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష వైసీపీ, ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ లక్ష్యంగా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఉండవల్లిలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన చంద్రబాబు, గత కాంగ్రెస్ పార్టీ లేదా దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి మనస్తత్వంతో పోల్చితే వైఎస్ జగన్ మనస్తత్వం పూర్తిగా భిన్నమైనదని మరియు అది రాష్ట్రానికే ప్రమాదకరమని వ్యాఖ్యానించారు. ప్రజా వ్యతిరేకతను తట్టుకోలేక, దానిని తగ్గించుకోవడం కోసమే గొడ్డలి పార్టీ క్షేత్రస్థాయిలో హింసను ప్రేరేపిస్తోందని మండిపడ్డారు.

Also Read : రెబల్స్‌పై టీడీపీ సర్జికల్ స్ట్రైక్.. రాష్ట్రవ్యాప్తంగా నిఘా నీడలో అసమ్మతి నేతలు..!

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను అడ్డుకునేందుకు వైఎస్సార్‌సీపీ ప్రోత్సహించిన హింసాత్మక ఘటనలకు సంబంధించిన వీడియోలను చంద్రబాబు ఈ సందర్భంగా మీడియాకు ప్రదర్శించారు. అనంతరం వైఎస్సార్‌సీపీ హింసా రాజకీయాలను ఎండగడుతూ రూపొందించిన “అదే హింస.. అవే అబద్దాలు.. అవే అరాచకాలు..” అనే ప్రత్యేక బుక్‌లెట్‌ను సీఎం చంద్రబాబు విడుదల చేశారు. జగన్ మోహన్ రెడ్డి ఒక క్రిమినల్ లిటిగెంట్‌ లా వ్యవహరిస్తూ, అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తూ రాష్ట్రంలో క్రిమినల్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆరోపించారు.

Also Read : కర్నాటక కి లోకేష్‌ మాస్టర్‌ స్ట్రోక్‌

ఎన్నికల్లో వైసీపీ అవలంబిస్తున్న హిట్ అండ్ రన్ విధానాన్ని ప్రజలంతా గమనిస్తున్నారని అన్నారు. 2019-24 మధ్య జరిగిన వైసీపీ ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలో విధ్వంసం పరాకాష్టకు చేరిందని చంద్రబాబు తీవ్రంగా విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే పాలన తిరిగి గాడిలో పడిందని స్పష్టం చేశారు. ఒకప్పుడు దేశంలో లేదా రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్యలు అనేవి బాహ్య శక్తుల నుంచి వచ్చేవని, కానీ దురదృష్టవశాత్తూ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో శాంతిభద్రతల సమస్య ఒక రాజకీయ పార్టీ వల్లే వస్తోందని వైసీపీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. రౌడీయిజం, నేరాలు చేసే వారిని ఏ సమాజం కూడా హర్షించదని హితవు పలికారు.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

రెబల్స్‌పై టీడీపీ సర్జికల్...

ఆంధ్రప్రదేశ్‌ స్థానిక సంస్థల ఎన్నికల సమరం...

ఏపీ పరిషత్ సమరం.....

ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగనున్న పరిషత్ ఎన్నికల...

బొత్సకు జడ్పీ పీఠం...

విజయనగరం జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో...

కదిరి వైసీపీలో భగ్గుమన్న...

శ్రీసత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గ వైఎస్సార్...

బ్రేకింగ్ : మరోసారి...

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల వేడి...

మేఘన ప్రాణాలకు ముప్పు.....

వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి...

పోల్స్