Saturday, October 24, 2026 01:49 PM
Saturday, October 24, 2026 01:49 PM

ఏపీ పరిషత్ సమరం.. కూటమి సీట్ల పంచాయితీ తేలినట్లే..?

ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగనున్న పరిషత్ ఎన్నికల నేపథ్యంలో అధికార కూటమి.. సీట్ల సర్దుబాటుపై తీవ్రంగా కసరత్తు చేస్తోంది. రాష్ట్రస్థాయిలో మూడు పార్టీల ముఖ్య నేతలు వరుస భేటీలు నిర్వహిస్తూ, ఏ పార్టీకి ఎన్ని స్థానాలు కేటాయించాలనే అంశంపై ఒక స్పష్టమైన రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేస్తున్న నేపధ్యంలో.. ఆసక్తి పెరుగుతోంది. ఈ సీట్ల పంపకాలపై నేడో, రేపో తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ చర్చల్లో భాగంగా భారతీయ జనతా పార్టీకి కేటాయించే స్థానాలపై ఇప్పటికే ఒక ప్రాథమిక స్పష్టత వచ్చినట్లు సమాచారం.

Also read : కర్నాటక కి లోకేష్‌ మాస్టర్‌ స్ట్రోక్‌

బీజేపీకి సుమారు 30 జిల్లా పరిషత్ స్థానాలు, 30 ఎంపీపీ పదవులు, అలాగే 100కు పైగా ఎంపీపీ స్థానాలను కేటాయించే అంశంపై కూటమి నేతల మధ్య చర్చలు సఫలమైనట్లు వినికిడి. మరోవైపు, జనసేన పార్టీకి కేటాయించాల్సిన స్థానాలపై చర్చలు ఇంకా కొనసాగుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేనకు కనీసం 30 శాతం స్థానాలను కేటాయించాలని ఆ పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనపై మిగిలిన కూటమి భాగస్వామ్య పక్షాలు సానుకూలంగా స్పందిస్తూన్నట్లు వార్తలు వస్తున్నాయి.

Also read : బొత్సకు జడ్పీ పీఠం భయం.. ఎందుకీ నిర్ణయం..?

క్షేత్రస్థాయి సమీకరణాలను బట్టి తుది నిర్ణయం తీసుకునేందుకు ముమ్మరంగా కసరత్తు చేస్తున్నాయి. కీలక జిల్లాల్లో సర్వేల ఆధారంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంటున్నాయి. రాష్ట్రస్థాయిలో ఈ సీట్ల పంపకాల ప్రక్రియ అధికారికంగా ముగిసిన వెంటనే, జిల్లాల వారీగా అభ్యర్థుల సర్దుబాటు ప్రక్రియ ప్రారంభం కానుంది. అపార్థాలకు తావులేకుండా తిరుగుబాటు అభ్యర్థుల ఉపసంహరణ, సమన్వయం కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కూటమి సమన్వయ కమిటీలు రంగంలోకి దిగనున్నాయి.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

జగన్ పై చంద్రబాబు...

ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల సమరం...

రెబల్స్‌పై టీడీపీ సర్జికల్...

ఆంధ్రప్రదేశ్‌ స్థానిక సంస్థల ఎన్నికల సమరం...

బొత్సకు జడ్పీ పీఠం...

విజయనగరం జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో...

కదిరి వైసీపీలో భగ్గుమన్న...

శ్రీసత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గ వైఎస్సార్...

బ్రేకింగ్ : మరోసారి...

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల వేడి...

మేఘన ప్రాణాలకు ముప్పు.....

వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి...

పోల్స్