పెట్టుబడుల వేటలో ఆంధ్రప్రదేశ్ దూసుకుపోతోంది. దేశానికి ఐటి క్యాపిటల్.. ఇండియా సిలికాన్ వ్యాలీ కర్నాటకను.. ఏపీ ఓవర్ టేక్ చేసింది. 2023-24 ఆర్దిక సంవత్సరంలో దేశం మొత్తం మీద వచ్చిన ప్రాజెక్టుల్లో ఏపీ వాటా 3 శాతం మాత్రమే. 2025 – 26 ఆర్దిక సంవత్సరం నాటికి 15.36 వాటాతో.. పరిశ్రమలను ఆకట్టుకోవడంలో ఆంధ్రప్రదేశ్ దేశంలో మహారాష్ట్ర తర్వాత రెండో స్థానంలో నిలిచింది.
Also Read : జగన్.. ఈ ప్రశ్నలకు జవాబు ఉందా..?
ఇదే సమయంలో కర్నాటక రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడుల్లో తగ్గుదల కనిపించింది. 2024లో 8.25 శాతంగా ఉన్న పెట్టుబడులు.. 2026 నాటికి 5.67 శాతానికి తగ్గిపోయాయి. దేశవ్యాప్తంగా నాలుగో ర్యాంకు నుంచి ఆరో ర్యాంకుకి పడిపోయింది. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి ఊపందుకొంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో.. మంత్రి లోకేశ్ చొరవతో ఏపీకి భారీ పెట్టుబడులు వస్తున్నాయి.
గూగుల్ డేటా సెంటర్, ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ వంటి అంతర్జాతీయ సంస్థలు భారత్‌లో భారీ పెట్టుబడులు పెట్టాలనే ఆలోచన చేస్తున్నాయని తెలిసిన వెంటనే మంత్రి లోకేశ్ రంగంలోకి దిగిపోయారు. అమెరికా వెళ్లి గూగుల్ ప్రతినిధులను కలిసి విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటు చేయడానికి ఒప్పించారు. మిట్టల్ గ్రూప్ సీఈవోతో మాట్లాడి.. అనకాపల్లి జిల్లాలో లక్షన్నర కోట్ల ఇన్వెస్ట్‌మెంట్‌తో గ్రీన్ ఫీల్డ్ స్టీల్ ప్లాంట్, పోర్టు నిర్మాణానికి ఒప్పందం చేసుకున్నారు.
Also Read : బొత్సకు జడ్పీ పీఠం భయం.. ఎందుకీ నిర్ణయం..?
దక్షిణ కొరియా, తైవాన్ వంటి దేశాల్లో పర్యటిస్తూ.. మంత్రి నారా లోకేశ్ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు బ్రాండ్ ఇమేజ్.. మంత్రి లోకేశ్ కృషి ఫలితంగా.. ఏపీకి లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి. 2025లో దేశానికి వచ్చిన మొత్తం ఫారిన్ ఇన్వెస్ట్‌మెంట్స్‌లో ఒక్క ఏపీకే 23 శాతం వచ్చాయి. ఐటీ, మెటల్స్, ఎలక్ట్రానిక్స్, రెన్యువబుల్ ఎనర్జీ, డ్రోన్, డిఫెన్స్ వంటి రంగాలకు రాష్ట్రం ప్రధాన హబ్‌గా ఎదుగుతోంది. నవంబర్‌లో విశాఖలో జరిగే సీఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్‌లో పరిశ్రమల ఏర్పాటుకి సంబంధించిన పెద్ద ఎత్తున ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. పారిశ్రామిక సదస్సు తర్వాత.. ఈ ఏడాది ఇన్వెస్ట్‌మెంట్స్‌లో ఏపీ మహారాష్ట్రను కూడా మించిపోయి టాప్ ప్లేస్‌కి చేరుకోవచ్చని అంచనా వేస్తున్నారు.


