Friday, October 23, 2026 05:33 PM
Friday, October 23, 2026 05:33 PM

జగన్.. ఈ ప్రశ్నలకు జవాబు ఉందా..?

తెలుగు వారికి మోహన్ బాబు హీరోగా వచ్చిన పెదరాయుడు సినిమా ఇప్పటికీ గుర్తే. ఎప్పుడే 1996లో విడుదలైన ఈ సినిమాలో మోహన్ బాబు పక్కనే ఉండే ఎమ్మెస్ నారాయణ చెప్పిన డైలాగులు ఇప్పటికీ మీమర్స్ వాడుతున్నారు. నీ దయవల్ల అసాధ్యం అనుకున్న రెండు ఈరోజు చూశాను.. అది పెదరాయుడు నోటి వెంట క్షమించు అనే మాట, పెదరాయుడు కళ్లల్లో నీళ్లు.. చాలమ్మా.. చాలు.. అంటూ సౌందర్యతో ఎమ్మెస్ చెప్పే డైలాగ్ బాగా ఫేమస్. ఇప్పుడు ఇలాంటి పదాలే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నోటి నుంచి వస్తున్నాయి. అవేమిటంటే.. ప్రజాస్వామ్యం, రిగ్గింగ్, దాడులు, ఏకగ్రీవాలు.. అనే మాటలు జగన్ చెబుతున్నారేమిటా అని అంతా ఆశ్చర్యపోతున్నారు.

Also Read : మేయర్ ఖర్చు భారం మొత్తం అవినాష్ పైనే..?

నాలుగు రోజుల తర్వాత బెంగళూరు యలహంక ప్యాలెస్ నుంచి తాడేపల్లి ప్యాలెస్ వచ్చిన వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హడావుడిగా.. తన అనుకూల మీడియా మిత్రులతోనే ప్రెస్ మీట్ పెట్టారు. అందులో జగన్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అవేమిటంటే.. మంచి చేసి ఉంటే చంద్రబాబుకు ఎందుకు భయం..? అని ప్రశ్నించారు. పనితీరును చూపించి ఓట్లు అడిగే ధైర్యం లేకే చంద్రబాబు భయపడుతున్నారని వైఎస్ జగన్ విమర్శించారు. కోవిడ్ సమయంలో కూడా తాము ఎన్నికలను ధైర్యంగా ఎదుర్కొన్నామన్నారు. చంద్రబాబు సూపర్‌ సిక్స్‌ హామీలపై ప్రజలు నిలదీస్తున్నారని, అందుకే కూటమి ప్రభుత్వం దౌర్జన్యాలు, అన్యాయాలకు పాల్పడుతోందని మండిపడ్డారు.

అయితే జగన్ చేసిన వ్యాఖ్యలను టీడీపీ నేతలు తప్పుబడుతున్నారు. కోవిడ్ కారణంగా ఎన్నికలు వాయిదా వేస్తున్నట్లు నాటి ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ప్రకటించిన వెంటనే.. అది కరోనా వైరసా.. లేక కమోనా వైరసా.. అంటూ వైరస్‌కు కూడా కులం అంటగట్టిన విషయం మర్చిపోయారా.. అని నిలదీస్తున్నారు. పనితీరును చూపించి ఓట్లు అడిగే ధైర్యం లేకనే.. నాడు దాడులు చేసిన ఏకగ్రీవాలు చేసుకున్నావా.. అని ప్రశ్నిస్తున్నారు. 75 ఏళ్ల అంజిరెడ్డి తాత పైన చేసిన దాడి వీడియోలు ఇప్పటికీ సోషల్ మీడియాలో ఉంటాయని.. చేసిన అరాచకాలకు ఆ వీడియోనే ప్రత్యక్ష సాక్షి అని వ్యాఖ్యానించారు. మాచర్ల మునిసిపాలిటీలో అన్ని వార్డులు ఎలా ఏకగ్రీవం చేశారో.. దాని వెనుక పిన్నెల్లి బెదిరింపులు లేవా.. అనే ప్రశ్నకు జవాబు చెప్పాలంటున్నారు.

స్థానిక సంస్థల ఎన్నికల ఏకగ్రీవాల్లో అప్పటి వైసీపీ అరాచకాలను లెక్కలతో సహా బయటపెట్టారు. ఎంపీటీసీ ఏకగ్రీవాలు.. 2014లో 2 శాతం మాత్రమే ఉంటే.. అంది 2020లో ఏకంగా 24 శాతం.. అంటే 2,362 చోట్ల ఏకగ్రీవాలు ఎలా జరిగాయో జవాబు చెప్పాలన్నారు. అలాగే జెడ్పీటీసీ ఏకగ్రీవాలు కూడా.. 2014లో కేవలం ఒక్క చోట మాత్రమే.. అంటే 0.09 శాతం ఉంటే.. 2020లో మాత్రం 19 శాతం.. అంటే 126 చోట్ల ఏకగ్రీవంగా వైసీపీ ఎలా సొంతం చేసుకుందో వైసీపీ నేతలు సమాధానం చెప్పాలని నిలదీస్తున్నారు. 2020లో కడప జిల్లాలో ప్రజాస్వామ్య ఖూనీ చేశారని.. 553 ఎంపీటీసీ స్థానాలకు ఏకంగా 439 చోట్ల.. అంటే 79 శాతం ఏకగ్రీవం అయ్యాయని.. జెడ్పీటీసీ స్థానాల్లో కూడా 50 స్థానాలకు 38 ఏకగ్రీవాలు.. అంటే 76 శాతం ఎలా సాధ్యమో.. జగన్ చెప్పాలంటున్నారు.

Also Read : కదిరి వైసీపీలో భగ్గుమన్న వర్గపోరు..!

నాటి దాడుల‌కు ప్ర‌ధాన కార‌ణం జగన్, అత‌ని క‌నుస‌న్న‌ల్లో ప‌నిచేసిన పోలీసులు, అధికారులు అనే విషయం ఏపీ మొత్తానికి తెలుసన్నారు. పోలింగ్ కేంద్రాల రిగ్గింగ్ ద‌గ్గ‌ర్నుంచి నామినేష‌న్ల రిగ్గింగ్ వ‌ర‌కు వైసీపీ నేతలు దిగ‌జారారని.. అందుకు పోలింగ్ బూత్ లోనే పిన్నెల్లి చేసిన అరాచకాల వీడియో ప్రత్యక్ష ఉదాహరణ అని గుర్తు చేశారు. 2020 స్థానిక సంస్థల ఎన్నికల్లో, తర్వాత జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ప్ర‌జాస్వామ్యాన్ని ఖూనీ చేసిన ఘనత వైఎస్ జగన్ అండ్ కో‌కు దక్కుతుందని.. ఏపీలో ఎన్నికల వ్యవస్థను దిగజార్చిన చరిత్ర జగన్ సొంతమని ఘాటు వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన అరాచకాలకు నిదర్శనమే.. 2024 ఎన్నికల ఫలితాలని ఎద్దేవా చేశారు. ఇక నుంచి ప్రజాస్వామ్యం, ఖూనీ వంటి పదాలు జగన్ అనకుండా ఉంటే బాగుంటుందని హితవు పలికారు.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

కదిరి వైసీపీలో భగ్గుమన్న...

శ్రీసత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గ వైఎస్సార్...

బ్రేకింగ్ : మరోసారి...

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల వేడి...

మేఘన ప్రాణాలకు ముప్పు.....

వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి...

మేయర్ ఖర్చు భారం...

విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల వేళ...

వైసీపీ నేతలకు రాచమర్యాదలు.....

శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం సబ్ డివిజన్...

వైసీపీ నేతలు ఇప్పుడైనా...

ఆంధ్రప్రదేశ్‌ స్థానిక సంస్థల ఎన్నికల వేళ...

పోల్స్