ఆధునిక కాలంలో మారుతున్న జీవనశైలి, శారీరక శ్రమ లేకపోవడం వల్ల క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఈ క్రమంలో ఫిట్నెస్ను కాపాడుకోవడానికి, క్యాన్సర్ ముప్పును తగ్గించుకోవడానికి ప్రతిరోజూ 10,000 అడుగులు నడవాలనే నియమం ప్రపంచవ్యాప్తంగా ఒక ట్రెండ్గా మారింది. అయితే, క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడానికి నిజంగానే పది వేల అడుగులు నడవాలా..? దీని వెనుక ఉన్న శాస్త్రీయత ఏంటి..? అనే అంశంపై ప్రముఖ ఆంకాలజిస్టులు సరికొత్త అభిప్రాయాలను పంచుకున్నారు.
Also Read : రీల్లో జయమ్మ.. రియల్లో అన్నపూర్ణ: 400 కుటుంబాలకు రష్మిక అండ
నిజానికి, రోజుకు 10,000 అడుగులు నడవాలనే సంఖ్యకు ఎటువంటి బలమైన వైద్య లేదా శాస్త్రీయ ఆధారాలు లేవని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. 1965లో జపాన్కు చెందిన ఒక కంపెనీ తమ పెడోమీటర్ అమ్మకాలను పెంచుకోవడానికి కనుగొన్న ఒక మార్కెటింగ్ వ్యూహం మాత్రమే ఈ 10,000 అడుగుల నియమం. కేవలం ఆ సంఖ్యను చేరుకోవడమే ముఖ్యం కాదు.. మనం రోజువారీగా ఎంత శారీరక శ్రమ చేస్తున్నామనేదే ఇక్కడ అత్యంత కీలకమని వైద్యులు చెబుతున్నారు.
Also Read : శబరిమలలో ఆంక్షలు.. అయ్యప్ప భక్తులకు అలర్ట్..!
తాజా అంతర్జాతీయ పరిశోధనల ప్రకారం, క్యాన్సర్, గుండె జబ్బుల ముప్పు తగ్గడానికి పది వేల అడుగుల వరకు నడవాల్సిన అవసరం లేదు. ప్రతిరోజూ సుమారు 4,000 నుండి 7,500 అడుగులు క్రమం తప్పకుండా నడిచినా శరీరంలో క్యాన్సర్ కణాల వృద్ధిని అడ్డుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు. రోజుకు కనీసం 4,000 అడుగులతో ప్రారంభించి, క్రమంగా 7,500 అడుగుల వరకు నడకను పెంచితే.. అది శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడానికి, ఊబకాయాన్ని తగ్గించడానికి ఎంతగానో సహాయపడుతుంది. రొమ్ము క్యాన్సర్, ప్రేగు క్యాన్సర్ వంటి దాదాపు 13 రకాల క్యాన్సర్ల ముప్పును తగ్గించడంలో క్రమబద్ధమైన నడక అద్భుతంగా పనిచేస్తుందని ఆంకాలజిస్టులు వివరిస్తున్నారు.


