Wednesday, October 14, 2026 03:08 PM
Wednesday, October 14, 2026 03:08 PM

శబరిమలలో ఆంక్షలు.. అయ్యప్ప భక్తులకు అలర్ట్..!

శబరిమల మండల – మకరవిళక్కు సీజన్ నేపథ్యంలో కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. శబరిమల, పరిసర ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేయడంలో భాగంగా పలు కఠినమైన ఆంక్షలు విధిస్తూ పథనంతిట్ట జిల్లా కలెక్టర్ నిజాముద్దీన్ కీలక ఉత్తర్వులు జారీ చేశారు. ముఖ్యంగా ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ, డ్రోన్లపై నిషేధంతో పాటు మాంసాహారం, హోటళ్లపైనా ఆంక్షలు విధించారు.

శబరిమల సన్నిధానం, పంబ, నిలక్కల్ ప్రాంతాల్లో ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీపై జిల్లా కలెక్టర్ పూర్తి నిషేధం విధించారు. సన్నిధానంలోని నలంబలం లోపల భక్తులు విచ్చలవిడిగా కెమెరాలు, మొబైల్ ఫోన్లు ఉపయోగించడం వల్ల దర్శనానికి తీవ్ర ఆటంకం కలుగుతోందని, దీనివల్ల తోపులాటలు జరిగి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని అ నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో తెలిపారు. సంబంధిత అధికారుల నుంచి ముందస్తు అనుమతి పొంది, భద్రతా అధికారిక అవసరాల కోసం చేపట్టే ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీకి ఈ ఆంక్షల నుంచి మినహాయింపు ఉంటుందని తెలిపింది.

Also Read : వంశీ.. నువ్వు ఎవరి తాలుకానో తెలుసా..!

దీంతో పాటు యాత్రా సీజన్లో సన్నిధానం, పంబ, నీలక్కల్ సహా అటవీ ప్రాంతాల్లో అనధికారిక అవసరాల కోసం డ్రోన్ల వినియోగంపై పూర్తి నిషేధం విధించింది. జిల్లా పోలీస్ చీఫ్ నుంచి ముందస్తు అనుమతి పొందిన తర్వాత మాత్రమే అధికారిక అవసరాల కోసం డ్రోన్లను ఉపయోగించడానికి భద్రతా సంస్థలకు అనుమతి ఉంటుందని స్పష్టం చేసింది. సన్నిధానం, పంబ, నీలక్కల్ సహా చుట్టుపక్కల అటవీ ప్రాంతాలు అత్యంత సున్నితమైనవి. ఉత్సవ సమయంలో ఈ ప్రాంతాలకు భారీగా భక్తులు తరలి వస్తుంటారు. ఇలాంటి ప్రాంతాల్లో అనుమతి లేకుండా డ్రోన్లను నడపడం భక్తుల భద్రతకు, గోప్యతకు తీవ్ర ముప్పు కలిగిస్తుంది. అంతేకాకుండా డ్రోన్లు భద్రతా వ్యవస్థకు తీవ్ర సవాలుగా మారడంతో పాటు అటవీ ప్రాంతంలోని వన్యప్రాణులకు తీవ్ర అంతరాయం కలిగిస్తున్నాయని అధికారులు తెలిపారు.

ఇంకా ఈ ఏడాది నవంబర్ 11 నుంచి 2027 జనవరి 25 వరకు పంబ నుంచి సన్నిధానం వరకు ఉన్న యాత్రా మార్గంలో అనధికారికంగా రోడ్డు పక్కన వ్యాపారం చేయడాన్ని నిషేధించింది. వడసేరికర నుంచి అత్తతోడు వరకు ఉన్న మార్గాల పక్కన పశువులను కట్టేయడం, మేపడాన్ని కూడా కలెక్టర్ నిషేధించారు. అదనంగా యాత్రా సమయంలో లాహ – సన్నిధానం మధ్య నడిచే హోటళ్లలో ఒకేసారి నిల్వ చేయగల గ్యాస్ సిలిండర్ల గరిష్ట సంఖ్యను ఐదుకు పరిమితం చేశారు. ప్రజలు సంచరించే ప్రదేశాల్లో ప్రమాదకరమైన రీతిలో గ్యాస్ సిలిండర్లను నిల్వ చేయడాన్ని నిషేధించింది.

Also Read : వివేకా కేసులో.. వచ్చే వారం నుంచి కీలక అరెస్టులు..?

ముఖ్యంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి శబరిమలకు వెళ్లే రహదారుల పక్కన, నీలక్కల్ వద్ద, ఇతర పార్కింగ్ స్థలాల్లో నిలిపి ఉంచిన వాహనాల దగ్గర వంట చేయడాన్ని పూర్తిగా నిషేధించింది. ఈ సమయంలో లాహా నుంచి సన్నిధానం వరకు ఉన్న యాత్రా మార్గాల్లో ఉన్న హోటళ్లు మాంసాహారాన్ని నిల్వ చేయడం, వండటం, అమ్మడంపైనా ఆంక్షలు విధించారు. మండల యాత్ర ప్రారంభానికి కేవలం కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో జిల్లా యంత్రాంగం ఈ నిబంధనలను కఠినతరం చేసింది. భక్తులకు ప్రాధమిక సౌకర్యాలు కల్పిస్తూనే.. భద్రతా విషయాల్లో ఎటువంటి రాజీ ఉండదని అధికారులు స్పష్టం చేశారు. శబరిమల, దాని పరిసర ప్రాంతాల్లో వివిధ శాఖల సమన్వయంతో విస్తృతమైన ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. పర్యావరణ అనుకూల నిబంధనలను కచ్చితంగా పాటిస్తూ, సురక్షితమైన యాత్రను సులభతరం చేయడమే జిల్లా యంత్రాంగం యొక్క అంతిమ లక్ష్యమని అధికారులు చెప్పారు.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

జగన్ కు మ్యూజిక్...

వైఎస్సార్‌సీపీ అధినేత, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్...

రాహుల్ దెబ్బ.. కేంద్రంలో...

కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో విపక్ష నాయకుడు...

ఫ్యాక్షన్ గడ్డపై సతీమణుల...

రాయలసీమ రాజకీయాల్లో ఎప్పుడూ అత్యంత వేడి...

కూటమిలో ముదురుతున్న స్థానిక...

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్...

వివేకా కేసులో.. వచ్చే...

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి...

వైసీపీని తుడిచేస్తున్న చిన్న...

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీకి...

పోల్స్