Wednesday, October 14, 2026 10:05 AM
Wednesday, October 14, 2026 10:05 AM

వివేకా కేసులో.. వచ్చే వారం నుంచి కీలక అరెస్టులు..?

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో మనీలాండరింగ్ కోణంలో దర్యాప్తు జరుపుతున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తన విచారణను వేగవంతం చేసింది. ఇందులో భాగంగా వైఎస్సార్‌సీపీ కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి బుధవారం హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్‌ ఈడీ ప్రాంతీయ కార్యాలయంలో విచారణకు హాజరుకానున్నారు. వివేకా హత్యకు ముందు, ఆ తర్వాత జరిగిన ఆర్థిక లావాదేవీలపై మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద అధికారులు ఆయనను సుదీర్ఘంగా ప్రశ్నించనున్నారు.

Also Read : ఏ1, ఏ2ల నోట Gen Z మాట.. నవ్వుకుంటున్న యువత

ఇప్పటికే ఈ కేసులో నిందితులుగా ఉన్న దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, అవినాష్ తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిలను ఈడీ అధికారులు వరసగా పిలిపించి స్టేట్‌మెంట్లు రికార్డు చేశారు. ఈ కేసులో అప్రూవర్‌గా మారిన షేక్ దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా ఈడీ ప్రధానంగా రూ. 40 కోట్ల సుపారీ డీల్‌పై దృష్టి సారించింది. హత్యకు ముందు హవాలా మార్గంలో ఎవరెవరికి డబ్బులు చేరాయి..? ఎక్కడి నుంచి నిధులు మళ్లాయి..? అనే అంశాలపై ఆరా తీస్తున్నారు.

గతంలో అవినాష్ రెడ్డి నివాసాలు, కార్యాలయాల్లో నిర్వహించిన సోదాల్లో లభించిన కీలక పత్రాలు, డిజిటల్ పరికరాలు, అలాగే స్వాధీనం చేసుకున్న రూ. 24 లక్షల నగదుకు సంబంధించిన ఆధారాలను ముందుంచి ఈడీ అధికారులు ఈరోజు ప్రశ్నించే అవకాశం ఉంది. విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ కేసులో ఈడీ అడుగులు అత్యంత వ్యూహాత్మకంగా ఉన్నాయని తెలుస్తోంది. కీలక నిందితులు, అనుమానితుల నుంచి బ్యాంక్ అకౌంట్ స్టేట్‌మెంట్లు, హవాలా లావాదేవీల వివరాలు సేకరించిన అధికారులు, వీటన్నింటినీ క్రోడీకరిస్తున్నారు.

Also Read : నానా పటేకర్ ప్రాణం తీసిన కరోనరీ ఆర్టరీ బ్లాకేజ్ ఎంత డేంజర్ అంటే..?

నేడు ఎంపీ అవినాష్ రెడ్డి విచారణ ముగిసిన తర్వాత, ఆయన ఇచ్చిన సమాచారాన్ని మిగిలిన వారి స్టేట్‌మెంట్లతో సరిపోల్చనున్నారు. ఈ విచారణ ప్రక్రియ ఒక కొలిక్కి వచ్చిన వెంటనే, ఆధారాలు ధృవీకరించుకుని వచ్చే వారం నుంచి ఈ కేసులో కీలక అరెస్టులు చేసేందుకు ఈడీ రంగం సిద్ధం చేస్తోందని ఢిల్లీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. దీంతో వివేకా కేసులో రానున్న రోజుల్లో ఎలాంటి సంచలనాలు నమోదు కానున్నాయోనన్న ఉత్కంఠ రాజకీయాల వర్గాల్లో నెలకొంది.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

వైసీపీని తుడిచేస్తున్న చిన్న...

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీకి...

తెలంగాణ బీజేపీలో కాక్రోచ్...

ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్...

విశాఖ మేయర్ రిజర్వేషన్...

బీజేపీ నేతల ఒత్తిళ్లతోనే విశాఖపట్నం నగర...

జగన్ ను భయపెడుతోన్న...

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల వేడి...

ఏపీ జడ్పీ ఛైర్మన్...

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు...

మంగళగిరి మేయర్‌ పీఠం...

మంగళగిరి–తాడేపల్లి మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌ పదవి...

పోల్స్