Wednesday, October 14, 2026 12:30 PM
Wednesday, October 14, 2026 12:30 PM

కూటమిలో ముదురుతున్న స్థానిక సీట్ల సస్పెన్స్..!

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ముంగిట అధికార ఎన్డీయే కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు వ్యవహారం అత్యంత ఉత్కంఠ భరితంగా మారింది. క్షేత్రస్థాయిలో మారిన రిజర్వేషన్ల లెక్కలు, గెలుపు గుర్రాల ఎంపిక కారణంగా మూడు పార్టీల మధ్య చర్చలు సుదీర్ఘంగా సాగుతున్నప్పటికీ ఇంకా పూర్తిస్థాయి స్పష్టత రాలేదు. నిన్న మంగళవారం మధ్యాహ్నం నుంచి ప్రారంభమైన పొత్తుల చర్చలు అర్ధరాత్రి వరకు సాగాయి. టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మంత్రి నిమ్మల రామానాయుడులు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నివాసానికి వెళ్లి సుదీర్ఘంగా చర్చించగా, మరోవైపు బీజేపీ రాష్ట్ర నేతలు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసి తాము ఆశిస్తున్న స్థానాల జాబితాను సమర్పించారు.

Also Read : విశాఖ మేయర్ రిజర్వేషన్ ఎవరికోసమో..?

రాజకీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం, ఈ స్థానిక ఎన్నికల్లో జనసేన పార్టీ దాదాపు 35% నుండి 40% వరకు స్థానాలను ఆశిస్తూ అర్బన్ లోకల్ బాడీస్ పై గట్టి పట్టుబడుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మొత్తం 17 మున్సిపల్ కార్పొరేషన్లలో విశాఖపట్నం, విజయవాడ వంటి నగరాలతో సహా సుమారు 6 నుండి 7 మేయర్ స్థానాలను జనసేన డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి తోడు పలు మున్సిపాలిటీల్లో చైర్‌పర్సన్ స్థానాలను కోరుతుండగా, బీజేపీ కూడా తమకు పట్టున్న కొన్ని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో చెప్పుకోదగ్గ సంఖ్యలోనే కార్పొరేటర్ స్థానాలతో పాటు కనీసం ఒక మేయర్ పీఠాన్ని ఆశిస్తోంది.

Also Read : వైసీపీని తుడిచేస్తున్న చిన్న శ్రీను.. ఉత్తరాంధ్రలో భారీ దెబ్బ..!

ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు క్యాంపు కార్యాలయంలో అర్ధరాత్రి దాటే వరకు రిజర్వేషన్ల వారీగా ఏ పార్టీకి ఏ సీట్లు కేటాయించాలనే అంశంపై తీవ్ర కసరత్తు చేశారు. నిన్నటి చర్చల్లో కొన్ని స్థానాలపై ప్రతిష్టంభన ఏర్పడటంతో, ఈరోజు మరోసారి కూటమి నేతలు సమావేశం కావాలని నిర్ణయించారు. ఈరోజు సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, బీజేపీ ముఖ్య నేతలు నేరుగా ముఖాముఖి భేటీ కానున్నారు. రిజర్వేషన్ల అధికారిక జాబితా, క్షేత్రస్థాయి బలాబలాలను బట్టి నేటి సమావేశంలో సీట్ల కేటాయింపును పూర్తిగా కొలిక్కి తెచ్చి అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉందని కూటమి వర్గాలు చెబుతున్నాయి.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

రాహుల్ దెబ్బ.. కేంద్రంలో...

కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో విపక్ష నాయకుడు...

ఫ్యాక్షన్ గడ్డపై సతీమణుల...

రాయలసీమ రాజకీయాల్లో ఎప్పుడూ అత్యంత వేడి...

వివేకా కేసులో.. వచ్చే...

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి...

వైసీపీని తుడిచేస్తున్న చిన్న...

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీకి...

తెలంగాణ బీజేపీలో కాక్రోచ్...

ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్...

విశాఖ మేయర్ రిజర్వేషన్...

బీజేపీ నేతల ఒత్తిళ్లతోనే విశాఖపట్నం నగర...

పోల్స్