ఈమధ్య కాలంలో తరచుగా ఏ1 జగన్ రెడ్డి, ఏ2 విజయసాయిరెడ్డి జెన్ జీ ఉద్యమం గురించి, కాక్రోచ్ ల గురించి మాట్లాడడం చూస్తున్నాం. తాము కూడా బొద్దింకలుగా మారతామని పదే పదే అనడంపై నిజమయిన జెన్ జీ వర్గం మండిపడుతోంది. 43 వేల కోట్లు కొల్లగొట్టిన ఇద్దరు అవినీతి సమ్రాట్టులు, చంచల్ గూడలో చిప్పకూడు తిని వచ్చినవారు.. అలాంటి ఇద్దరు అవినీతి అనకొండలు జెన్ జీ ఉద్యమం గురించి మాట్లాడడం విమర్శల పాలవుతోంది. విజయదశమి సందర్భంగా కొత్త పార్టీకి సంబంధించిన వివరాలు వెల్లడిస్తానని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎక్స్ వేదికగా ప్రకటించడం వరకూ బాగానే ఉంది. తన పార్టీలో అధికారం జెన్–జీది అనడంపై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి.
Also Read : వైసీపీని తుడిచేస్తున్న చిన్న శ్రీను.. ఉత్తరాంధ్రలో భారీ దెబ్బ..!
జెన్ జీలు చేపట్టిన ఉద్యమం అవినీతి, అక్రమాలకు వ్యతిరేకంగా సాగుతోంది. జగన్, విజయసాయికి .. కాక్రోచ్ లకు మధ్య చాలా తేడా కనిపిస్తుంది. కాక్రోచ్ ల ఉద్యమానికి ప్రజల నుంచి మద్దతు వస్తోంది. అలాంటి బొద్దింకల పేరు చెప్పి.. తామేదో సమాజం కోసం ఏదో చేస్తున్నామని జగన్, విజయసాయి భారీ బిల్డప్ ఇవ్వడంపై యువత మడిపడుతోంది. నిజానికి జెన్ జీ గురించి జగన్, విజయసాయి మాట్లాడడం విడ్డూరంగా ఉంది. తాము అధికారంలోకి ఉన్నప్పుడు యువత ఉద్యోగాల గురించి అంతగా పట్టించుకోని అవినీతి పరులు తాము మళ్ళీ అధికారంలోకి వస్తే జెన్ జీ యువతకు బంగారు భవిష్యత్ ఇస్తామని హామీలు గుప్పించడం దారుణంగా ఉంది.
Also Read : వంశీ.. నువ్వు ఎవరి తాలుకానో తెలుసా..!
ప్రస్తుతం ఉన్న యువత ఉద్యోగ భద్రత , పెరిగిపోతున్న జీవన వ్యయం , గృహ వసతి మరియు పర్యావరణ మార్పుల వంటి తీవ్రమైన అనిశ్చితుల మధ్య కెరీర్ను నిర్మించుకోవాల్సి వస్తోంది. అవన్నీ కాదని 70 ఏళ్ళకి దగ్గరలో ఉన్న విజయసాయి జెన్ జీ అంటూ అదే పనిగా మాట్లాడుతుంటే యువత నవ్వుకుంటోంది. మీ ఏజ్ ఏంటి? మీ గేజ్ ఏంటి అంటూ ప్రశ్నిస్తోంది. ఇవన్నీ చాలవన్నట్టుగా వైసీపీకి గతంలో జాతీయ మీడియా సలహాదారుగా ఉన్న ఓ పెద్దాయన బొద్దింకలన్నీ గమనిస్తూనే ఉన్నాయంటూ ముక్తాయింపు ఇవ్వడం హాస్యాస్పదంగా ఉంది. నిజానికి ఇది ఒక్క జెన్ జీకి సంబంధించిన ప్రశ్న మాత్రమే కాదు. భవిష్యత్ తరాలకు మనం ఎలాంటి సమాజాన్ని అందిస్తున్నామనే ప్రశ్న ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన అంశం.
Also Read : జగన్ ను భయపెడుతోన్న సొంత జిల్లా..!
సహజ వనరుల పరిరక్షణ నుంచి ఉద్యోగ అవకాశాల వరకు, కుటుంబ బంధాల నుంచి సామాజిక భద్రత వరకు అనేక విషయాల్లో ఇప్పటి నిర్ణయాలు రేపటి తరంపై ప్రభావం చూపుతాయి. అందుకే యువత మాట వినడం, వారి ఆలోచనలను అర్థం చేసుకోవడం, వారి సమస్యలకు పరిష్కార మార్గాలు చూపడం అవసరం. కానీ యువతతో అంతగా మమేకం కాని ఇద్దరు నేతలు వారికి ఏదో చేస్తామని ప్రకటించడం విమర్శలపాలవుతోంది. అవినీతి ఆరోపణలు లేదా కేసులు ఎదుర్కొంటున్న నేతలు సమాజంలోని జెన్ జీ గురించి మాట్లాడినప్పుడు, వారు ఆ అంశాన్ని ఎంతవరకు నిజాయితీగా పరిష్కరించగలరనే దానిపై నైతిక ప్రశ్నలు తలెత్తుతాయి.ఏ నేత ఏ అంశంపై మాట్లాడినా యువత వారి నైతికత గురించి ఆలోచిస్తారని గుర్తుంచుకోవాలి.
-జి.సత్యనారాయణ రాజు


