Saturday, October 24, 2026 02:30 PM
Saturday, October 24, 2026 02:30 PM

కారు పార్టీలో అంతర్గత విభేదాలు..!

కారు పార్టీలో అంతర్గత విభేదాలు.. ఆధిపత్య పోరు.. గ్రూపు రాజకీయాలకు అడ్డుకట్ట వేసేందుకు భారత రాష్ట్ర నమితి.. బీఆర్ఎస్ అధిష్టానం కార్యాచరణకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఈ దిశగా జిల్లా నాయకత్వాలకు స్పష్టమైన సందేశం ఇస్తున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. గత ఎన్నికల్లో ఒకే పార్టీలోని నేతలు పరస్పరం సహకరించుకోకపోవడం, ప్రత్యర్థి వర్గం అభ్యర్థుల ఓటమికి ప్రయత్నించడం పార్టీకి నష్టం కలిగించిందన్నది అధిష్ఠానం అంచనాగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ముందుగా ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలకు హెచ్చరికలు చేసిన కేటీఆర్, ఇదే విధానాన్ని ఇతర జిల్లాల్లోనూ అమలు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Also Read : నిప్పుతో చెలగాటం వద్దు ట్రంప్..!

వచ్చే ఏడాది ప్రారంభంలో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను బీఆర్ఎస్ కీలకంగా పరిగణిస్తున్నట్లు సమాచారం. వీటిని సాధారణ ఎన్నికలకు ముందు సన్నాహక పరీక్షగా భావిస్తూ, ఇప్పటి నుంచే నాయకుల మధ్య సమన్వయాన్ని పెంచుకోవడంపై దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తోంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నద్ధతపై ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలతో కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. పట్టభద్రులు ఓటర్ల నమోదు విషయంలో కొందరు నియోజకవర్గ ఇన్‌ఛార్జులు, సీనియర్ నాయకులు అలసత్వం ప్రదర్శిస్తున్నారన్న అంశాన్ని కేటీఆర్ ప్రస్తావించారు. ఈ సందర్భంగా పార్టీలోని గ్రూపు రాజకీయాలపైనా తీవ్రంగా స్పందించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

గత ఎన్నికల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలో నాయకుల మధ్య సమన్వయ లోపం, అంతర్గత విభేదాలు పార్టీ అభ్యర్థుల విజయావకాశాలను దెబ్బతీశాయని కేటీఆర్ ఉదాహరణలతో వివరించినట్లు తెలుస్తోంది. ఒకే పార్టీలో ఉంటూ మరో వర్గం అభ్యర్థి ఓటమికి ప్రయత్నిస్తే, చివరకు మొత్తం పార్టీనే నష్టపోతుందని కేటీఆర్ హెచ్చరించినట్లు సమాచారం. పార్టీ కోసం పనిచేయాల్సిన నాయకులు పరస్పర ఆధిపత్య పోరులో నిమగ్నమైతే, క్షేత్రస్థాయిలో కార్యకర్తలకు తప్పుడు సంకేతాలు వెళతాయని అధిష్ఠానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. వరంగల్ నేతలతో జరిగిన సమావేశంలో ఇచ్చిన సందేశం ఇతర జిల్లాల నాయకత్వాలకూ వర్తింపజేయాలని యోచిస్తోంది.

Also Read : అమ్మో బ్లింక్ ఇట్.. కస్టమర్ల మైండ్ బ్లాక్..!

ఉమ్మడి వరంగల్‌లో చేపట్టిన సమీక్ష తరహాలోనే మిగతా జిల్లాల నాయకులనూ విడివిడిగా పిలిచి మాట్లాడాలని బీఆర్ఎస్ నాయకత్వం భావిస్తోంది. తొలుత పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న ఉమ్మడి జిల్లాల నేతలతో సమావేశాలు నిర్వహించే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఆరు ఉమ్మడి జిల్లాల నాయకులతో చర్చలు పూర్తయ్యాక మరో నాలుగు జిల్లాల నాయకులతో కూడా కేటీఆర్ ప్రత్యేకంగా సమావేశమయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ సమావేశాల పూర్తి షెడ్యూల్, పాల్గొనే నాయకుల వివరాలు అధికారికంగా వెల్లడి కావాల్సి ఉంది. గ్రూపు రాజకీయాలను ప్రోత్సహించే వారిపై కఠినంగా వ్యవహరించాలన్న ఆలోచనలో అధిష్ఠానం ఉంది. చిన్న, పెద్దా అనే తేడా లేకుండా పార్టీ ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరించే వారిని ఉపేక్షించబోమన్న సంకేతాలు ఇవ్వాలని భావిస్తోంది.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

జగన్ పై చంద్రబాబు...

ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల సమరం...

రెబల్స్‌పై టీడీపీ సర్జికల్...

ఆంధ్రప్రదేశ్‌ స్థానిక సంస్థల ఎన్నికల సమరం...

ఏపీ పరిషత్ సమరం.....

ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగనున్న పరిషత్ ఎన్నికల...

బొత్సకు జడ్పీ పీఠం...

విజయనగరం జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో...

కదిరి వైసీపీలో భగ్గుమన్న...

శ్రీసత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గ వైఎస్సార్...

బ్రేకింగ్ : మరోసారి...

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల వేడి...

పోల్స్