Saturday, October 24, 2026 04:49 PM
Saturday, October 24, 2026 04:49 PM

బాక్సాఫీస్ ను దున్నేస్తున్న సీనియర్ హీరోలు..!

భారత సినిమా మార్కెట్ ప్రస్తుతం ఊహించని స్థాయికి పెరిగింది. ఒకప్పుడు 50 కోట్లు దాటితేనే అద్భుతం అనుకున్న రోజులు పోయి, ఇప్పుడు ప్రతి పెద్ద సినిమాకు 100 కోట్ల గ్రాస్ వసూళ్లు అనేది కనీస బెంచ్‌మార్క్‌గా మారింది. ఈ రేసులో యంగ్ హీరోలతో పాటు సౌత్ ఇండియాకు చెందిన సీనియర్ మోస్ట్ సూపర్ స్టార్స్ కూడా బాక్సాఫీస్ వద్ద తమ సత్తా చాటుతున్నారు. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న లెక్కల ప్రకారం, ఆల్ టైమ్ అత్యధిక 100 కోట్ల గ్రాస్ సాధించిన సీనియర్ హీరోల జాబితా ఆసక్తికరంగా మారింది.

Also Read : ఏపీ పరిషత్ సమరం.. కూటమి సీట్ల పంచాయితీ తేలినట్లే..?

ఈ జాబితాలో ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ 11 చిత్రాలతో మొదటి స్థానంలో నిలిచి ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నారు. వయసుతో సంబంధం లేకుండా ఆయన సినిమాలు ఇప్పటికీ బాక్సాఫీస్ వద్ద వందల కోట్ల వసూళ్లను రాబడుతున్నాయి. తమిళ చిత్ర పరిశ్రమలోనే కాకుండా ఓవరాల్‌గా సౌత్ ఇండియాలోనే అత్యధిక 100 కోట్ల సినిమాలు ఉన్న సీనియర్ హీరోగా రజినీకాంత్ సరికొత్త రికార్డు క్రియేట్ చేశారు. తెలుగు చిత్ర పరిశ్రమ విషయానికి వస్తే, నటసింహం నందమూరి బాలకృష్ణ 5 సినిమాలతో సీనియర్ టాలీవుడ్ హీరోలలో అగ్రస్థానంలో నిలిచారు.

Also Read : 418 Movie Review: 418 గదిలో ఏముంది? భయపెట్టిందా.. నిరాశపరిచిందా?

ఇటీవలి కాలంలో ఆయన నటించిన చిత్రాలు వరుసగా 100 కోట్ల క్లబ్‌లో చేరడం విశేషం. ఇక మెగాస్టార్ చిరంజీవి 4 చిత్రాలతో అందులో.. రెండు సోలో సినిమాలు.. తరువాతి స్థానంలో ఉన్నారు. విక్టరీ వెంకటేష్ 2 చిత్రాలతో తన మార్క్ బాక్సాఫీస్ స్టామినాను నిరూపించుకున్నారు. మలయాళ చిత్ర పరిశ్రమ నుండి కంప్లీట్ యాక్టర్ మోహన్‌లాల్ 5 సినిమాలతో బాలయ్య సరసన నిలిచారు. కేరళ బాక్సాఫీస్ వద్ద మోహన్‌లాల్ మార్కెట్ రేంజ్ ఏంటో ఈ లెక్కలు చెబుతున్నాయి. ఇక ఉలగనాయగన్ కమల్ హాసన్ 2 సినిమాలతో ఈ క్లబ్‌లో కొనసాగుతున్నారు. కాగా, సీనియర్ టాప్ హీరోలైన మమ్ముట్టి, అక్కినేని నాగార్జున ఇంకా 100 కోట్ల క్లబ్‌లో ఖాతా తెరవాల్సి ఉంది. మొత్తానికి డిజిటల్ యుగంలో థియేట్రికల్ రన్ మారినప్పటికీ, సీనియర్ హీరోలు తమ క్రేజ్ మరియు కలెక్షన్ల వేటతో యంగ్ జనరేషన్‌కు గట్టి పోటీ ఇస్తుండటం గమనార్హం.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

లోపల అసంతృప్తి.. పైకి...

కొందరు పార్టీ నిర్ణయానికి కట్టుబడి అధికారిక...

కారు పార్టీలో అంతర్గత...

కారు పార్టీలో అంతర్గత విభేదాలు.. ఆధిపత్య...

జగన్ పై చంద్రబాబు...

ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల సమరం...

రెబల్స్‌పై టీడీపీ సర్జికల్...

ఆంధ్రప్రదేశ్‌ స్థానిక సంస్థల ఎన్నికల సమరం...

ఏపీ పరిషత్ సమరం.....

ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగనున్న పరిషత్ ఎన్నికల...

బొత్సకు జడ్పీ పీఠం...

విజయనగరం జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో...

పోల్స్