బెంగళూరులోని వైయస్ కుటుంబానికి చెందిన ప్రతిష్టాత్మక ఎలహంక ప్యాలెస్ వేదికగా తన కుమార్తె అంజలి వివాహం జరపాలని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల భావించినట్లు వస్తున్న వార్తలు, అలాగే దీనిపై పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పందిస్తూ రాసిన లేఖ రాజకీయ, కుటుంబ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ వివాహ వేదిక అంశంపై అక్టోబర్ 9వ తేదీన వైఎస్ షర్మిలకు వైఎస్ జగన్ ఒక లేఖను పంపినట్లు సమాచారం.
Also Read : బొత్సకు జడ్పీ పీఠం భయం.. ఎందుకీ నిర్ణయం..?
బెంగళూరులోని తన నివాసమైన ఎలహంక ప్యాలెస్‌లో కుమార్తె అంజలి పెళ్లి నిర్వహించాలని నువ్వు కోరుకున్నట్లు తనకు తెలిసిందని జగన్ ఆ లేఖలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. అయితే, అంత భారీ స్థాయిలో పెళ్లి వేడుకను అక్కడ నిర్వహిస్తే భద్రత, గోప్యతా పరమైన తీవ్ర సమస్యలు తలెత్తుతాయని ఆయన ఆందోళన వ్యక్తం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. పెద్ద సంఖ్యలో అతిథులు, సహాయకులు, సిబ్బంది రాకపోకలు సాగించడం వల్ల నివాస భద్రతకు భంగం వాటిల్లే అవకాశం ఉందని, అంతేకాకుండా ప్రాంగణానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు బయటకు వచ్చే ప్రమాదం ఉందని ఆయన స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.
Also Read : లోపల అసంతృప్తి.. పైకి మాత్రం..!
ఈ నేపథ్యంలో ఎలహంక ప్యాలెస్‌కు బదులుగా ప్రత్యామ్నాయ వేదికను ఎంచుకోవాలని జగన్ ఆ లేఖలో సూచించారు. ఒకవేళ వేరే వేదిక కుదਰకపోతే హైదరాబాద్‌లోని లోటస్ పాండ్ నివాసాన్ని గానీ, లేదా ఇందుకు తగిన ఇతర వేదికలలో ఈ వివాహ వేడుకను జరుపుకోవాలని ఆయన ఆ లేఖలో ప్రతిపాదించినట్లు సమాచారం. కుటుంబ పరమైన విభేదాలు, ఆస్తుల తగాదాల నడుమ తలెత్తిన ఈ తాజా పరిణామం అన్నాచెల్లెళ్ల మధ్య రాజకీయంగానూ, వ్యక్తిగతంగానూ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ వ్యవహారంపై షర్మిల తరఫున కుటుంబ సభ్యులు కూడా జగన్ కు ఘాటుగా లేఖ రాసినట్లు సమాచారం.


