Friday, October 30, 2026 02:41 PM
Friday, October 30, 2026 02:41 PM

టోల్‌ప్లాజా వాహనదారులకు కేంద్రం బిగ్ రిలీఫ్..!

జాతీయ రహదారులపై ప్రయాణించే స్థానిక వాహనదారులకు కేంద్ర రోడ్డు రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ భారీ ఊరటనిచ్చింది. టోల్‌ప్లాజాల వద్ద ప్రతిరోజూ స్థానికులు ఎదుర్కొంటున్న ఫీజుల భారాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. టోల్‌ప్లాజాలకు చుట్టుపక్కల నివసించే ప్రజలకు ప్రత్యేక రాయితీలు, లోకల్ పాస్‌ల జారీని కచ్చితం చేస్తూ అధికారికంగా గెజిట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ కొత్త నిబంధనల ప్రకారం, ఏదైనా జాతీయ రహదారిపై ఉన్న టోల్‌ప్లాజాకు 20 కిలోమీటర్ల పరిధిలో నివసించే స్థానికులకు ఈ సదుపాయం వర్తిస్తుంది.

Also Read : ఏపీ ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం..!

వీరు ప్రతి ట్రిప్‌కు విడివిడిగా టోల్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేకుండా, ఒకేసారి ఫిక్స్‌డ్ ఫీజుతో కూడిన కన్సెషనల్ యాన్యువల్ ఫాస్ట్‌ట్యాగ్ పాస్ పొందే వెసులుబాటు కల్పించారు. అయితే, ఈ వెసులుబాటు కేవలం వాణిజ్యేతర వ్యక్తిగత వాహనదారులకు మాత్రమే వర్తిస్తుందని, కమర్షియల్ వాహనాలకు ఎటువంటి రాయితీలు ఉండవని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వం టోల్‌ప్లాజా ఉన్న లొకేషన్‌ను బట్టి రెండు రకాల యాన్యువల్ ఛార్జీలను ఖరారు చేసింది. మున్సిపల్ లేదా పట్టణ పరిధికి వెలుపల ఉండే టోల్‌ప్లాజాల పరిధిలోని స్థానిక వాహనదారులకు ఏడాదికి రూ. 1,500 గా ఫీజు నిర్ణయించారు.

Also Read : ఏపీకి మరో ముప్పు.. ఆ జిల్లాలకు భారీ వర్షాల హెచ్చరిక..!

అదేవిధంగా, మున్సిపల్ లేదా లోకల్ టౌన్ లిమిట్స్ లోపల ఉండే టోల్‌ప్లాజాల పరిధిలోని స్థానిక వాహనదారులకు ఏడాదికి రూ. 3,000 గా ఫీజు ఉంటుంది. ఈ కొత్త రాయితీ పాస్ అనేది కేవలం ఏ టోల్‌ప్లాజా కోసం అయితే ఇష్యూ చేస్తారో, అక్కడ మాత్రమే వాలిడ్ అవుతుంది. ఒక రూట్‌లో ఉండే అన్ని టోల్‌ప్లాజాలకు ఇది వర్తించదు. అలాగే, క్లోజ్డ్ యూజర్ ఫీ కలెక్షన్ సిస్టమ్ ఉన్న జాతీయ రహదారులు లేదా ఎక్స్‌ప్రెస్‌వేలపై ఈ రాయితీ వర్తించదు. ఒకవేళ స్థానికులు వెళ్లడానికి ప్రత్యామ్నాయ సర్వీస్ రోడ్డు అందుబాటులో ఉన్నా కూడా ఈ పాస్ జారీ చేయరు. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని జాతీయ రహదారులపై ఈ సరికొత్త నిబంధనలు నవంబర్ 1 నుండి అధికారికంగా అమల్లోకి రానున్నాయి. ఆ తర్వాత డిసెంబర్ 1, 2026 నుండి కేంద్ర ప్రభుత్వ అఫీషియల్ యాప్ అయిన రాజమార్గ్‌యాత్ర ద్వారా కూడా ఈ పాస్‌లను ఆన్‌లైన్‌లో పొందే సదుపాయం అందుబాటులోకి వస్తుంది.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

ఏపీ ఎన్నికల సంఘం...

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను...

ఏపీకి మరో ముప్పు.....

ఆంధ్రప్రదేశ్‌ను ఇటీవల వణికించిన అర్నబ్ తుఫాను...

ఏపీ, తెలంగాణ.. సర్...

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా దేశంలోని 6...

కష్టకాలంలో ఏపీకి అండగా...

ఆంధ్రప్రదేశ్‌ను వణికించిన అర్నబ్ తుఫాన్ తీర...

బ్రేకింగ్: హిమాలయాల్లో మరో...

భూటాన్‌లోని గాసా జిల్లాలో ఉన్న శింటాఫు...

సూపర్ ఎల్‌నినో ముప్పు.....

భారత్‌కు సూపర్ ఎల్‌నినో రూపంలో తీవ్రమైన...

పోల్స్