ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా దేశంలోని 6 రాష్ట్రాల్లో ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియకు సంబంధించి భారత ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఆయా రాష్ట్రాల ఎన్నికల ప్రధాన అధికారుల నుంచి వచ్చిన అధికారిక అభ్యర్థనల మేరకు సర్ ప్రక్రియ గడువును సవరిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం కొత్త షెడ్యూల్‌తో కూడిన ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది. ఓటర్ల జాబితాలను మరింత పారదర్శకంగా మార్చడం, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడమే లక్ష్యంగా ఈ గడువును పొడిగించారు.
Also Read : సూపర్ ఎల్‌నినో ముప్పు.. భారత్‌లో 55 వేల ప్రాణాలకు గండం?
తాజా ఉత్తర్వుల ప్రకారం, ఆంధ్రప్రదేశ్‌లో క్లెయిమ్‌లు, అభ్యంతరాల పరిష్కారం మరియు నోటీసుల జారీ ప్రక్రియ గడువును నవంబర్ 20 వరకు పొడిగించారు. తెలంగాణ విషయానికి వస్తే, నోటీసుల ఫేజ్, అభ్యంతరాల పరిష్కార గడువును నవంబర్ 26 వరకు పొడిగిస్తూ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలతో పాటు మహారాష్ట్ర, హర్యానా, నాగాలాండ్ రాష్ట్రాల్లో సవరించిన తుది ఓటర్ల జాబితాను నవంబర్ 30 న అధికారికంగా ప్రచురించనున్నారు. ఢిల్లీలో మాత్రం తుది జాబితా డిసెంబర్ 22న విడుదల కానుంది.
Also Read : పింఛన్లను అడ్డుకునేందుకు వైసీపీ సరికొత్త కుట్ర..?
ఈ సర్ ప్రక్రియలో భాగంగా బూత్ స్థాయి అధికారులు ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. తెలంగాణలో ఈ సవరణ ప్రక్రియ ప్రారంభానికి ముందు మొత్తం 3,38,26,448 మంది ఓటర్లు ఉండగా, వారిలో 2,64,87,213 మంది ఎన్యూమరేషన్ ఫారాలను సమర్పించారు. మిగిలిన 73,39,235 మందిని అబ్సెంట్, షిఫ్టెడ్, డెత్, డూప్లికేట్ జాబితా కింద గుర్తించి డ్రాఫ్ట్ రోల్స్ నుంచి తొలగించారు. ఇప్పటివరకు జనరేట్ అయిన నోటీసుల్లో మెజారిటీ ఓటర్లపై విచారణలు కూడా పూర్తయ్యాయి.


