Friday, October 30, 2026 06:31 AM
Friday, October 30, 2026 06:31 AM

ఈరోజు రాశి ఫలితాలు (30-10-2026)

శ్రీ పరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, ఆశ్వయుజ మాసం, బహుళపక్షం.. 30-10-2026 నాడు మీ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి అనుకుంటున్నారా, అయితే ఆ వివరాలు మీకోసం. మీ గ్రహాల ప్రభావం ఎలా ఉందో చెక్ చేసుకోండి..

మేషం

ఉద్యోగస్తులకు అధికారుల సహాయంతో పదోన్నతులు పెరుగుతాయి. ఆప్తుల నుండి అరుదైన శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు. సోదరులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. కొన్ని పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.
————————–

వృషభం

చిన్ననాటి మిత్రులతో వివాదాలు తప్పవు. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి వలన తగిన విశ్రాంతి ఉండదు. వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుకుంటారు. దైవానుగ్రహంతో కొన్ని పనులు పూర్తి చేయగలుగుతారు. ఇంటా బయట సమస్యలు ఉన్నప్పటికీ అధిగమించి ముందుకు సాగుతారు.
————————–

మిధునం

ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం మంచిది. దూర ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలు ఉన్నవి. ఉద్యోగస్తులకు అధికారుల నుండి విమర్శలు తప్పవు. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి. కొన్ని వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు.
————————–

కర్కాటకం

జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. స్థిరాస్తి వ్యవహారాలలో కీలక నిర్ణయాలు అమలు పరుస్తారు.
————————–

సింహం

మిత్రుల నుండి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. స్నేహితులతో గృహమున ఆనందంగా గడుపుతారు. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. నిరుద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. వ్యాపారాల విస్తరణకు భాగస్తులు నుండి సహాయం అందుతుంది. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు.
————————–

కన్య

దూర ప్రయాణాలు వీలైనంత వరకు వాయిదా వేయడం మంచిది. నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. ఋణదాతల ఒత్తిడి అధికమవుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి. కీలక వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబ సభ్యుల ప్రవర్తన మానసికంగా చికాకు పరుస్తుంది.
————————–

తుల

వ్యాపార ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. చిన్ననాటి మిత్రులతో అకారణ కలహాలు కలుగుతాయి. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారించడం మంచిది. ధన వ్యవహారాలలో కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి.
————————–

వృశ్చికం

ఉద్యోగస్తులకు మరింత అనుకూల పరిస్థితులు ఉంటాయి. శుభకార్యాలకు ధనవ్యయం చేస్తారు. వ్యాపారాలు లాభాల బాట పడుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం ఉన్నది. వివాదాలకు సంబంధించి ఆప్తుల నుంచి కీలక సమాచారం అందుతుంది. విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు.
————————–

ధనస్సు

అవసరానికి చేతిలో ధనం నిల్వ ఉండదు. వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు ఉంటాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపార ఉద్యోగాలలో ఊహించని సమస్యలు తప్పవు. చేపట్టిన పనులలో అవాంతరాలు కలుగుతాయి. దూర ప్రయాణాలలో వాహన ఇబ్బందులుంటాయి.
————————–

మకరం

గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. ఉద్యోగమున పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. భూ క్రయ విక్రయాలు అనుకూలిస్తాయి. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.
————————–

కుంభం

వ్యాపారాలు, ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి. చిన్ననాటి మిత్రులతో కలహా సూచనలున్నవి. వృధా ప్రయాణాలు చెయ్యవలసి వస్తుంది. ముఖ్యమైన పనులలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు. నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు.
————————–

మీనం

విందు వినోద కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలకు లోటుండదు. చిన్ననాటి మిత్రుల నుంచి ధన సహాయం అందుతుంది. వ్యాపార, ఉద్యోగాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. బంధువుల కలయిక ఉత్సాహాన్నిస్తుంది.
————————–

గమనిక : ఈ ఆర్టికల్‌లో అందించిన జ్యోతిష్య సమాచారం, వార్షిక ఫలాలు, పరిహారాలన్నీ జ్యోతిష్యశాస్త్రం, హిందూ మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇది అందుబాటులో ఉన్న సమాచారం మేరకు అవగాహన కొరకు ఇవ్వబడింది. ఏదైనా నిర్ణయాలు తీసుకునే ముందు జ్యోతిష్య పండితులను సంప్రదించండి.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

సూపర్ ఎల్‌నినో ముప్పు.....

భారత్‌కు సూపర్ ఎల్‌నినో రూపంలో తీవ్రమైన...

చంద్రబాబుపై కయ్యానికి కాలు...

జూనియర్ ఎన్టీఆర్ మామ గారు చంద్రబాబుపై...

గంటల్లోనే సహాయకచర్యలు.. సహాయక...

అర్నాబ్ తుఫాన్ సృష్టించిన బీభత్సం నుంచి...

చంద్రబాబు విజన్‌పై కేటీఆర్...

రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఒక...

పింఛన్లను అడ్డుకునేందుకు వైసీపీ...

ఆంధ్రప్రదేశ్‌లో నవంబర్ 1వ తేదీన జరగబోయే...

కూటమిలో రెబల్స్‌పై చంద్రబాబు...

ఆంధ్రప్రదేశ్‌లో నవంబర్ 1న జరగబోయే పట్టణ,...

పోల్స్