Friday, October 30, 2026 11:31 AM
Friday, October 30, 2026 11:31 AM

ఏపీకి మరో ముప్పు.. ఆ జిల్లాలకు భారీ వర్షాల హెచ్చరిక..!

ఆంధ్రప్రదేశ్‌ను ఇటీవల వణికించిన అర్నబ్ తుఫాను ప్రభావం ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతుండగా, బంగాళాఖాతంలో మరో కొత్త అల్పపీడనం రూపంలో ముప్పు పొంచి ఉంది. దక్షిణ అండమాన్ సముద్రం, దాని పరిసర ప్రాంతాలలో నిన్న ఉదయం ఒక అల్పపీడనం ఏర్పడినట్లు భారత వాతావరణ శాఖ అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం ఇది పశ్చిమ వాయువ్య దిశగా వేగంగా కదులుతోంది. ఇది రేపటికల్లా ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడనుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

Also Read : చంద్రబాబుపై కయ్యానికి కాలు దువుతున్న జూనియర్ ఎన్టీఆర్ మామ..!

ఆ తర్వాతి రెండు రోజుల్లో ఇది మరింత తీవ్రరూపం దాల్చి నేరుగా ఏపీ తీరం వైపు దూసుకువచ్చే అవకాశం ఉంది. ఈ వాతావరణ మార్పుల కారణంగా రాష్ట్రంలోని పలు జిల్లాలకు విపత్తు నిర్వహణ సంస్థ ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది. నేడు అల్లూరి సీతారామరాజు, తూర్పు గోదావరి, గుంటూరు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. శనివారం నాడు విజయనగరం, కృష్ణా, నంద్యాల, అన్నమయ్య జిల్లాల్లో వర్షాలు పడవచ్చు. అసలైన ముప్పు ఆదివారం నుండి ప్రారంభం కానుంది.

Also Read : కూటమిలో రెబల్స్‌పై చంద్రబాబు సీరియస్..!

ఆది, సోమవారాల్లో కోస్తాంధ్రా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని, ముఖ్యంగా కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కుండపోతగా అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. అల్పపీడన తీవ్రత కారణంగా సముద్రం భారీగా అలజడికి లోనవుతుందని వాతావరణ కేంద్రం తెలిపింది. తీరం వెంబడి గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో నవంబర్ 2వ తేదీ వరకు మత్స్యకారులు ఎవరూ కూడా వేటకు వెళ్లరాదని ఆంక్షలు విధించారు.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

ఏపీ, తెలంగాణ.. సర్...

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా దేశంలోని 6...

కష్టకాలంలో ఏపీకి అండగా...

ఆంధ్రప్రదేశ్‌ను వణికించిన అర్నబ్ తుఫాన్ తీర...

బ్రేకింగ్: హిమాలయాల్లో మరో...

భూటాన్‌లోని గాసా జిల్లాలో ఉన్న శింటాఫు...

సూపర్ ఎల్‌నినో ముప్పు.....

భారత్‌కు సూపర్ ఎల్‌నినో రూపంలో తీవ్రమైన...

చంద్రబాబుపై కయ్యానికి కాలు...

జూనియర్ ఎన్టీఆర్ మామ గారు చంద్రబాబుపై...

గంటల్లోనే సహాయకచర్యలు.. సహాయక...

అర్నాబ్ తుఫాన్ సృష్టించిన బీభత్సం నుంచి...

పోల్స్