ఆంధ్రప్రదేశ్‌ను వణికించిన అర్నబ్ తుఫాన్ తీర ప్రాంతాల్లో ఊహించని స్థాయిలో విధ్వంసాన్ని సృష్టించింది. ముఖ్యంగా విద్యుత్ వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిపోవడంతో వందలాది గ్రామాలు, పట్టణాలు చీకట్లోకి వెళ్ళిపోయాయి. ఈ విపత్కర పరిస్థితుల్లో విద్యుత్ సరఫరాను యుద్ధప్రతిపాదికన పునరుద్ధరించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు పొరుగు రాష్ట్రాల సహాయాన్ని కోరారు. సీఎం చంద్రబాబు విజ్ఞప్తికి పొరుగున ఉన్న తెలంగాణ, తమిళనాడు ప్రభుత్వాలు సానుకూలంగా స్పందించి, ఏపీకి అండగా నిలిచాయి.
Also Read : పింఛన్లను అడ్డుకునేందుకు వైసీపీ సరికొత్త కుట్ర..?
ఏపీలో దెబ్బతిన్న విద్యుత్ వ్యవస్థను పునరుద్ధరించడానికి సహాయక బృందాలను పంపాల్సిందిగా సీఎం చంద్రబాబు చేసిన విజ్ఞప్తికి తెలంగాణ ప్రభుత్వం వెంటనే స్పందించింది. తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డితో చర్చించిన అనంతరం, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఏపీకి విద్యుత్ సహాయక బృందాలను, నిపుణులను పంపాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణ నుంచి వస్తున్న ఈ ప్రత్యేక బృందాలు ఏపీలోని తుఫాన్ బాధిత ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పునరుద్ధరణ పనుల్లో భాగస్వాములు కానున్నాయి.
Also Read : చంద్రబాబుపై కయ్యానికి కాలు దువుతున్న జూనియర్ ఎన్టీఆర్ మామ..!
మరోవైపు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి సూచనల మేరకు ఏపీ ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తమిళనాడు విద్యుత్ శాఖ మంత్రితో ఫోన్ లో మాట్లాడారు. అర్నబ్ తుఫాన్ కారణంగా ఏపీలో విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు, సబ్‌స్టేషన్లు ఏ స్థాయిలో దెబ్బతిన్నాయో వారికి వివరించారు. ఈ విధ్వంసాన్ని అధిగమించడానికి తమిళనాడు ప్రభుత్వ సహాయాన్ని కోరగా, అక్కడి ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించింది. ఏపీకి అవసరమైన విద్యుత్ సిబ్బందిని, సాంకేతిక సామాగ్రిని తక్షణమే పంపేందుకు సుముఖత వ్యక్తం చేసింది. పొరుగు రాష్ట్రాల నుంచి అందుతున్న ఈ భారీ సాయంతో ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ పునరుద్ధరణ పనులు మరింత వేగవంతం కానున్నాయి.


