Saturday, October 31, 2026 06:37 AM
Saturday, October 31, 2026 06:37 AM

ఈరోజు రాశి ఫలితాలు (31-10-2026)

శ్రీ పరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, ఆశ్వయుజ మాసం, బహుళపక్షం.. 31-10-2026 నాడు మీ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి అనుకుంటున్నారా, అయితే ఆ వివరాలు మీకోసం. మీ గ్రహాల ప్రభావం ఎలా ఉందో చెక్ చేసుకోండి..

మేషం

వ్యాపారాల్లో ఆశించిన ఫలితాలు సాధిస్తారు. వృత్తి ఉద్యోగాలలో కీలక నిర్ణయాలు అమలు పరుస్తారు. అవసరానికి సన్నిహితుల నుండి ధన సహాయం అందుతుంది. రాజకీయ ప్రముఖుల నుండి అందిన ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి. స్ధిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి.
————————–

వృషభం

వృత్తి ఉద్యోగస్తులకు పని ఒత్తిడి అధికమవుతుంది. వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు చేయటం మంచిది కాదు. కుటుంబ సభ్యులు మీ మాటతో విభేదిస్తారు. చేపట్టిన పనులు శ్రమాధిక్యతతో కానీ పూర్తి కావు. ఆర్థికంగా కొంత గందరగోళ పరిస్థితులు ఉంటాయి. వృధా ప్రయాణాలు చెయ్యవలసి వస్తుంది.
————————–

మిధునం

బంధుమిత్రులతో చిన్నపాటి వివాదాలు ఉంటాయి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో ఆలోచించి ముందుకు సాగడం మంచిది. ఉద్యోగస్తులకు అధికారులతో చర్చలు ఫలించవు. దూర ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. నూతన వ్యాపారాల ప్రారంభానికి చేసే ప్రయత్నాలు విఫలమవుతాయి.
————————–

కర్కాటకం

విద్యార్థుల కష్టానికి తగిన ఫలితం పొందుతారు. జీవిత భాగస్వామి సహాయంతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన లాభాలు అందుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలకు లోటు ఉండదు. చిన్ననాటి మిత్రుల నుండి విలువైన వస్తువులు బహుమతులుగా పొందుతారు.
————————–

సింహం

మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన వ్యక్తుల పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది.
————————–

కన్య

నిరుద్యోగ ప్రయత్నాలు వాయిదా పడుతాయి. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఇతరులతో వివాదాలకు వీలైనంత దూరంగా ఉండటం మంచిది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. అవసరానికి చేతిలో డబ్బు నిల్వ ఉండదు. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుకుంటారు.
————————–

తుల

ఉద్యోగ విషయమై అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. మాతృ వర్గ బంధువులతో వివాదాలు కలుగుతాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆదాయ మార్గాలు మందగిస్తాయి. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చెయ్యడం మంచిది కాదు. పాత మిత్రుల నుండి అందిన సమాచారం ఊరట కలిగిస్తుంది.
————————–

వృశ్చికం

గృహమున శుభకార్య విషయమై ప్రస్తావన వస్తుంది. దీర్ఘకాలిక ఋణ సమస్యల నుండి కొంత వరకు బయటపడతారు. వృత్తి ఉద్యోగాలలో మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. ఆప్తుల నుండి శుభవార్తలు అందుతాయి. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. బంధుమిత్రులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.
————————–

ధనస్సు

వ్యాపార విస్తరణకు ప్రయత్నాలు ఫలించవు. జీవిత భాగస్వామితో చిన్నపాటి వివాదాలు ఉంటాయి. ఉద్యోగస్థులకు అదనపు పని భారం వలన తగిన విశ్రాంతి లభించదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. చేపట్టిన పనులలో ప్రతిబంధకాలు తప్పవు. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు.
————————–

మకరం

నూతన వ్యాపారాలు ప్రారంభించిన తగిన లాభాలు అందుకుంటారు. ధనాదాయ మార్గాలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాలు అనుకూలిస్తాయి. నిరుద్యోగులకు అరుదైన అవకాశాలు అందుతాయి. సన్నిహితులతో గృహమున సంతోషంగా గడుపుతారు. చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది.
————————–

కుంభం

ఉద్యోగమున సహోద్యోగుల నుండి విమర్శలు అధికమవుతాయి. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. నూతన ఋణ ప్రయత్నాలు ఫలించవు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలలో ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి. ఆకస్మిక ప్రయాణాలు చేయవలసి వస్తుంది. దూరపు బంధువులతో మాటపట్టింపులు ఉంటాయి.
————————–

మీనం

స్థిరాస్తి క్రయ విక్రయాలలో నూతన లాభాలు అందుకుంటారు. సంతాన వివాహ విషయమై గృహమున చర్చలు చేస్తారు. విలువైన వస్తు వాహనాలు బహుమతులుగా పొందుతారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. నూతన వస్తులాభాలు అందుకుంటారు. నిరుద్యోగుల కలలు ఫలిస్తాయి.
————————–

గమనిక : ఈ ఆర్టికల్‌లో అందించిన జ్యోతిష్య సమాచారం, వార్షిక ఫలాలు, పరిహారాలన్నీ జ్యోతిష్యశాస్త్రం, హిందూ మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇది అందుబాటులో ఉన్న సమాచారం మేరకు అవగాహన కొరకు ఇవ్వబడింది. ఏదైనా నిర్ణయాలు తీసుకునే ముందు జ్యోతిష్య పండితులను సంప్రదించండి.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

వైసీపీ తుఫాన్ రాజకీయాలు...

ఏపీలో అర్నబ్ తుఫాన్ బీభత్సం సృష్టించింది....

మున్సిపల్ పోరు వేళ...

ఏపీలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల పోలింగ్...

టోల్‌ప్లాజా వాహనదారులకు కేంద్రం...

జాతీయ రహదారులపై ప్రయాణించే స్థానిక వాహనదారులకు...

ఏపీ ఎన్నికల సంఘం...

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను...

ఏపీకి మరో ముప్పు.....

ఆంధ్రప్రదేశ్‌ను ఇటీవల వణికించిన అర్నబ్ తుఫాను...

ఏపీ, తెలంగాణ.. సర్...

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా దేశంలోని 6...

పోల్స్