ఏపీలో మునిసిపల్, కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. అయితే ఒక్క పులివెందులలో తప్ప. ఇందుకు ఏకైక కారణం.. అక్కడ వైసీపీ నేతలు, కార్యకర్తలు దాడులు చేస్తున్నారు. మొదటిసారి స్వేచ్ఛగా ఓటు వేసేందుకు బయటకు వచ్చిన పులివెందుల పట్టణ ఓటర్లను భయబ్రాంతులకు గురి చేసేందుకు నానా పాట్లు పడుతున్నారు. రాళ్ల దాడులతో ఓటర్లను భయపెడుతున్నారు. ఇక నాలుగు రోజుల ముందే జగన్ చెప్పినట్లుగా.. ఆయన వచ్చిన వెంటనే.. వైసీపీ నేతలు రంగంలోకి దిగారు. మా అన్న వస్తే ఎలా ఉంటుందో తెలుసా.. అంటూ పులివెందుల వీధుల్లో వీరంగం సృష్టించారు. కత్తులు, రాడ్లు తీసుకుని దాడులకు తెగబడ్డారు.
Also Read : తుఫాన్ వేళ వాట్సాప్ గవర్నెన్స్‌తో ప్రభుత్వం సక్సెస్..!
రాష్ట్రమంతా మునిసిపల్ ఎన్నికలు జరుగుతుంటే.. వైసీపీ నేతలు మాత్రం పులివెందులపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టారు. ఇందుకు ప్రధాన కారణం.. అక్కడ వైసీపీ ఛైర్మన్ అభ్యర్థి ఓడిపోతే.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరువు పూర్తిగా పోతుందనే భయం వైసీపీ నేతల్లో స్పష్టంగా కనిపిస్తోంది. అందుకే విజయవాడ నుంచి ప్రత్యేకంగా కొంతమంది పాత్రికేయులను కూడా ఎన్నికల కవరేజ్ కోసం పులివెందులకు తీసుకెళ్లారు. అయితే వీరంతా వైసీపీ అనుకూల, అభిమాన న్యూస్ ఛానల్స్ ప్రతినిధులు మాత్రమే. అక్కడ జరిగే ప్రతి విషయాన్ని వైసీపీ అనుకూలంగా రిపోర్టింగ్ ఇవ్వాలని ముందే స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.
Also Read : చీ.. ఇది కూడా రాజకీయమేనా.. మీరు మారరా..?
ఇక పులివెందుల అంటే వైఎస్ కుటుంబానికి కంచుకోట అనే మాట ఇకపై కష్టమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. వైఎస్ కుటుంబానికి పులివెందులలో ఎదురు చెప్పే వాళ్లు లేరనే మాట 2026 నవంబర్ ఒకటవ తేదీతో తుడిచిపెట్టుకుపోయింది. వైఎస్ కుటుంబానికి పులివెందులలో ఎదురు చెబితే ఏమవుతుందనే విషయం ప్రతి ఒక్కరికీ తెలుసు. అలాంటి పులివెందులలో నడి రోడ్డు మీద నలుగురు చూస్తూ ఉండగానే.. వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఘోర అవమానం జరిగింది. మాజీ మంత్రి, జగన్ సొంత బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో జగన్ ప్రధాన సూత్రధారి అనే విషయం ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది.
Also Read :పులివెందులలో జగన్, అవినాష్ భారీ కుట్ర: బీటెక్ రవి సంచలన ఆరోపణలు..!
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బెంగళూరు నుంచి పులివెందులకు హెలికాఫ్టర్‌లో వచ్చారు. పోలింగ్ జరుగుతున్న సమయంలో నిబంధనలకు విరుద్దంగా రోడ్లపై ర్యాలీగా వెళ్లారు. పులివెందులలో ఎన్నిక సమయంలో జగన్ చేస్తోంది రోడ్ షో కాదు…ఫ్యాక్షన్ షో అంటూ కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించిన జగన్ మీద ఎస్ఈసీకి కూటమి పార్టీలు ఫిర్యాదు చేశాయి. అయితే ఓ వైపు జగన్ రోడ్ షో చేస్తున్న సమయంలోనే ఊహించని షాక్ తగిలింది. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రధాన ముద్దాయిగా ఉన్న దస్తగిరి ఇప్పటికే అప్రూవర్‌గా మారారు. తాజాగా పులివెందులలో జగన్ కాన్వాయ్‌కు దస్తగిరి ఎదురొచ్చారు. జగన్ కాన్వాయ్ అడ్డుకున్న దస్తగిరి.. నీ బాబాయ్‌ని నువ్వే చంపించి, మా జీవితాలు నాశనం చేసావ్.. అంటూ అందరి ముందే జగన్‌ను దస్తగిరి నిలదీశాడు.
పులివెందులలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని దస్తగిరి అడ్డుకున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఇంతకాలం పులివెందులలో వైఎస్ కుటుంబానికి ఎదురే లేదని విర్రవీగారు. ఏ రాజకీయ పార్టీ నేతలు కూడా తమ ముందు తలెత్తి మాట్లాడలేదని గొప్పగా చెప్పుకున్నారు. అలాంటి పులివెందులలో అందరి ముందు ఓ సామాన్యుడు వచ్చి.. నీ వల్లే మా జీవితాలు నాశనం అయ్యాయని చెప్పడం ఇప్పుడు ఆ కుటుంబానికి ఉన్న పట్టు కోల్పోయినట్లే అనిపిస్తోందనే మాట బాగా వినిపిస్తోంది. వంద గొడ్లు తిన్న రాబందు.. ఒక్క గాలి వానకు చచ్చిందనే సామెత మాదిరిగా.. ఎన్నో దారుణాలు చేసిన వైఎస్ కుటుంబాన్ని ఒక సామాన్యుడు ఇలా నిలదీశాడనే మాటలు బాగా వినిపిస్తున్నాయి.


