Saturday, October 31, 2026 11:35 AM
Saturday, October 31, 2026 11:35 AM

సెమీ ఫైనల్.. అసలు కథ మొదలైంది..!

మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగిసింది. ప్రచార ప్రభావాన్ని ఊహించని తుఫాన్ తుడిచి పెట్టేసింది. ఎన్నికలు, పార్టీల ప్రతిష్ఠ, సరదా, సందడి తుఫాను మిగిల్చిన కష్టం ముందు కరిగిపోయాయి. పోలింగ్‌కు ఒకరోజు వ్యవధి. అధికారిక ప్రచారాలకు అవకాశం లేదు. గంటల వ్యవధిలోనే అభ్యర్థులు, వారి పార్టీల నాయకులు గెలుపు కోసం చివరి కృషి, కసికి అవకాశం. ఇంతవరకు అవసరం మేరకు ఖర్చు చేసిన వారు, నిర్ణయాలను మాత్రం.. భరించక తప్పని పరిస్థితి.

Also Read : ఏపీలో అర్నబ్ తుఫాన్ తెచ్చిన జలకళ..!

అధికార కూటమి పరిపాలనకు దాదాపు రెండేళ్లకు పైగా సమయం మిగిలింది. సగం కాలం దాదాపు ముగిసినట్టే. కొంతమంది ఎమ్మెల్యేలకు ఒకరకంగా మున్సిపల్ ఎన్నికలు సెమీఫైనల్స్ వంటివి. రాజకీయ వివాదాలు, వైసీపీ, టీడీపీలోని అంతర్గత సంఘర్షణలు, భూకబ్జాల ఆరోపణలు, ఎంఆర్‌పీ మించి మద్యం విక్రయాలు, నియోజకవర్గంలో అధికార యంత్రాంగంలోని అసంతృప్తులు వంటివి ప్రధానంగా ఓటర్లను ప్రభావితం చేయవచ్చు. ప్రధానంగా కొన్ని చోట్ల మాత్రం ఇండిపెండెంట్ అభ్యర్థులు జయాపజయాలను నిర్ణయిస్తారా.. లేదా? అన్నదే ఆసక్తికరమైన అంశం. ఎవరి ఓటమిని ప్రధానంగా మనసులో కోరుకుంటూ, రంగంలోకి దిగారో, ఫలితం తెలియజేస్తుంది.

అభ్యర్థుల ఎంపికలో అధికార కూటమికి కొన్నిచోట్ల తలనొప్పులు ఎదురయ్యాయి. కొన్ని చోట్ల సెకండ్ కేడర్‌ను సమన్వయం చేసుకోలేకపోయింది. వైసీపీ మాత్రం ప్రచార అంశాల్లో ఎక్కువగా అధికార కూటమి ఎమ్మెల్యేను టార్గెట్ చేసింది. చాలా చోట్ల మాత్రం ప్రభుత్వ అనుకూలత మీదే ఎమ్మెల్యేలు ఆధారపడినట్టు కనిపిస్తుంది. అయితే జనసేన పార్టీలో గందరగోళం ఏ మేరకు కూటమిని ఇబ్బంది పెడుతుందో కూడా వేచి చూడాల్సి ఉంది. ఇదే సమయంలో కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం.. వైసీపీ నేతల అరెస్టుల సానుభూమి ఆయా మునిసిపాలిటీల్లో ఏ మేరకు చూపించిందనే విషయం కూడా ఎన్నికల్లో తేలిపోతుంది.

Also Read : మిథున్ రెడ్డి అరెస్ట్‌కు రంగం సిద్ధం..?

కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం వైసీపీలో సమన్వయకర్తల తీరుపై తీవ్ర అసంతృప్తి కనిపిస్తోంది. కొన్ని చోట్ల అభ్యర్థుల ఎంపికపై సొంత పార్టీ నేతలే గుర్రుగా ఉన్నారు. దీంతో గెలుపు, ఓటములకు పార్టీ అధ్యక్షులే స్వయంగా బాధ్యత వహించాల్సి ఉంటుందని ఇప్పటికే తాడేపల్లి ప్యాలెస్ పెద్దలు వార్నింగ్ కూడా ఇచ్చారు. దీంతో పార్టీ జిల్లా అధ్యక్షులకు కత్తి మీద సాములా మారింది. కొన్నిచోట్ల మాత్రం.. అధికార కూటమి ఎమ్మెల్యేలకు మునిసిపల్ ఎన్నికలు సవాల్‌గానే నిలవనున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో వైసీపీ వైఫల్యం మాత్రం కూటమి నేతలకు కలిసి వస్తుందని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

చంద్రబాబు లేఖతో రెండు...

అర్నబ్ తుపాను సృష్టించిన బీభత్సంపై ఏపీ...

ఏపీలో అర్నబ్ తుఫాన్...

ఆంధ్రప్రదేశ్‌ను వణికించిన అర్నబ్ తుఫాన్ రాష్ట్రానికి...

జగన్ వార్నింగ్ కు...

ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సమయం...

మిథున్ రెడ్డి అరెస్ట్‌కు...

రాజంపేట వైఎస్సార్‌సీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్...

వైసీపీ తుఫాన్ రాజకీయాలు...

ఏపీలో అర్నబ్ తుఫాన్ బీభత్సం సృష్టించింది....

మున్సిపల్ పోరు వేళ...

ఏపీలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల పోలింగ్...

పోల్స్