Sunday, November 1, 2026 06:30 AM
Sunday, November 1, 2026 06:30 AM

హిందువుల ఓట్లు లేవు.. యోగి ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు..!

ఉత్తరప్రదేశ్ ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంచలన ఆరోపణలు చేశారు. లక్నోలో జరిగిన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ఓటర్ల జాబితా నుంచి ఏకంగా 1.27 కోట్ల మంది హిందూ ఓటర్ల పేర్లు గల్లంతయ్యాయని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఓటరు పేరును జాబితాలో చేర్చేలా పార్టీ శ్రేణులు అప్రమత్తంగా వ్యవహరించాలని ఆయన పిలుపునిచ్చారు. ఓటర్ల తొలగింపు కారణంగా 28 అర్బన్ లోకల్ బాడీ నియోజకవర్గాల్లో పార్టీ బలహీనపడుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

Also Read : చంద్రబాబు లేఖతో రెండు రోజుల్లో రంగంలోకి కేంద్రం..!

జనాభా లెక్కల ప్రకారం ఉత్తరప్రదేశ్‌లో 16 కోట్లకు పైగా ఓటర్లు ఉండాల్సి ఉండగా, ప్రస్తుతం సుమారు 13 కోట్ల మంది మాత్రమే ఓటర్ల లిస్టులో ఉన్నారని యోగి ఆదిత్యనాథ్ గణాంకాలతో వివరించారు. పంచాయతీ ఓటర్ల జాబితాలో ఉన్న 66 లక్షల మంది పేర్లు అసెంబ్లీ నియోజకవర్గాల ఓటర్ల లిస్టులో కనిపించడం లేదని సీఎం యోగి అసహనం వ్యక్తం చేశారు. అదేవిధంగా ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా ప్రయోజనం పొందుతున్న 55 లక్షల మంది లబ్ధిదారుల పేర్లు, అలాగే 18-19 సంవత్సరాల వయసు గల దాదాపు 4.5 లక్షల మంది యువతీ యువకుల పేర్లు కూడా ఓటర్ల జాబితాలో లేవని ఆయన స్పష్టం చేశారు.

Also Read : ఏపీ బ్రాండ్ పవర్.. మేడ్‌ ఇన్‌ తిరుపతి.. ముంబైకి డ్రైవర్‌లెస్ మెట్రో రైళ్లు

గత సవరణ ప్రక్రియలో కేవలం నాలుగు లక్షల మంది ఓటర్లు మాత్రమే కొత్తగా చేరడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఓటర్ల నమోదు ప్రక్రియను క్రమం తప్పకుండా సమీక్షించాలని సీఎం యోగి ఆదేశించారు. బూత్ స్థాయి అధికారులతో సమన్వయం చేసుకుంటూ, అర్హులైన ప్రతి ఒక్క హిందూ ఓటరు పేరును ఓటర్ల జాబితాలో చేర్చాల్సిన బాధ్యతను ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ పదాధికారులు తీసుకోవాలని ఆయన స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. కాగా, కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం.. సవరణ ప్రక్రియలో భాగంగా యూపీలో దాదాపు 2.04 కోట్లకు పైగా ఓటర్ల పేర్లను తొలగించగా, కొత్తగా 84 లక్షల మంది ఓటర్లను చేర్చడంతో మొత్తం ఓటర్ల సంఖ్య 13,39,84,792 కి చేరింది.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

చీ.. ఇది కూడా...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాప్తాడులో దారుణం చోటు...

పులివెందులలో జగన్, అవినాష్...

ఆంధ్రప్రదేశ్‌ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సమీపిస్తున్న...

ఏపీ బ్రాండ్ పవర్.....

ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికంగా మరో గొప్ప ఘనత...

సెమీ ఫైనల్.. అసలు...

మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగిసింది. ప్రచార...

చంద్రబాబు లేఖతో రెండు...

అర్నబ్ తుపాను సృష్టించిన బీభత్సంపై ఏపీ...

ఏపీలో అర్నబ్ తుఫాన్...

ఆంధ్రప్రదేశ్‌ను వణికించిన అర్నబ్ తుఫాన్ రాష్ట్రానికి...

పోల్స్